సాక్షి, ముంబై: కన్నబిడ్డపై ఉన్న మమకారాన్ని ఓ తండ్రి వినూత్నంగా చాటుకున్నాడు. ఆమె వివాహం పదికాలాలపాటు పదిలంగా గుర్తుండిపోయేలా ఘనంగా నిర్వహించాడు. నూతన వధువును పెళ్లిమండపం వద్దకు తీసుకురావడానికే ఏకంగా హెలికాప్టర్ తెచ్చాడు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన పంఢరిపూర్ తాలుకా ఉపరీ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఉపరీ గ్రామానికి చెందిన వడ్డీ వ్యాపారి దత్రాత్రేయ మోహితే కూతురు ప్రాజక్త వివాహం సాంగ్లీ జిల్లాలోని ఆట్పాడి తాలుకాకు చెందిన సూరజ్ కదంతో నిశ్చయమైంది. గురువారం వీరి పెళ్లి జరుగనున్న నేపథ్యంలో బుధవారం ఉపరీ గ్రామంలో హెలికాఫ్టర్ వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు చూడటానికి హెలికాప్టర్ క్యూకట్టారు. పెళ్లి కూతురుని మండపానికి తీసుకెళ్లడానికి హెలికాఫ్ట్టర్ వచ్చిందని తెలుసుకొని బంధువులు, స్థానికులు, గ్రామస్తులు అవాక్యయ్యారు.
పెళ్లి మండపానికి హెలికాఫ్టర్‌లో..
Published Thu, Feb 11 2016 10:22 PM | Last Updated on Sun, Sep 3 2017 5:26 PM
Advertisement
Advertisement