ఫార్మ్‌డీ విద్యార్ధులకు దేశ, విదేశాలలో ఉపాధి అవకాశాలు
రాజంపేట: ఫార్మ్‌డీ విద్యార్ధులకు దేశ, విదేశాలలో ఉపాధి అవకాశాలు మంచిగా ఉన్నాయని ఏఐటీఎస్ అధినేత చొప్పాగంగిరెడ్డి అన్నారు. అన్నమాచార్య ఫార్మశీ కళాశాలలో ఔషధాల వినియోగం, విదేశాలలో ఉద్యోగ అవకాశాలపై అర్హత పరీక్ష, ఫార్మసిస్ట్‌లకు వృత్తిపై శిక్షణ అనే అంశంపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసదస్సునుద్ధేశించి గంగిరెడ్డి మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన మందుల తయారీ, సరఫరాపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అజిముత్ కంపెనీ డైరక్టరు జోకబ్ నికోలస్ మాట్లాడుతూ ఔషదాన్ని వ్యాధిగ్రస్తునికి ఇవ్వడంలో, వ్యాధికి అవసరమైన ఔషధాలను ఉపయోగించుటలో గల మెళుకువలపై విద్యార్థులు పట్టుసాధించాలన్నారు. ఫార్మ్‌డీ విద్యార్థులకు విదేశాలలో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగాలు ఉంటాయన్నారు. వివిధ రకాల వ్యాధుల గురించి వాటిని నిర్మూలించడంలో క్లినికల్ ఫార్మసిస్ట్ చేయాల్సిన విధులను తరుచుగా తెలుసుకోవడం చాల ముఖ్యమైన అంశమన్నారు. సదస్సులో ఫార్మ్‌డీ విద్యార్ధులు, అధ్యాపకులు పాల్గొన్నారు.