Choreographer Ahmed Khan
-
ఈ స్టార్ హీరో డబ్బు కోసం పని చేయడు: కొరియోగ్రాఫర్
చెప్పిన సమయానికల్లా రెడీ అయి ఉండటం కొందరికే సాధ్యమవుతుంది. కానీ ఓ హీరో చెప్పిన టైం కంటే అరగంటే ముందే సిద్ధంగా ఉంటాడని చెప్తున్నాడు కొరియోగ్రాఫర్, నిర్మాత అహ్మద్ ఖాన్. ఇంతకీ సమయపాలకు మారుపేరుగా నిలిచిన హీరో మరెవరో కాదు ఖిలాడీ అక్షయ్ కుమార్. తనకు పని చేయడమే తెలుసని, బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి పెద్దగా పట్టించుకోడని చెప్తున్నాడు.డబ్బు వెంట పరిగెత్తడుఅహ్మద్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అక్షయ్ ఎన్ని సినిమాలు చేస్తున్నాడో చూడండి. డబ్బు అవసరమై ఆయన పని చేస్తున్నారా? ఆయనకు డబ్బు వెంట పరిగెత్తాల్సిన అవసరం ఉందా? అయినా ఎందుకు చేస్తున్నాడో తెలుసా? తనెప్పుడూ ఒక మాట అంటుంటాడు. మన చేతిదాకా వచ్చిన పనిని వదిలేయొద్దు. ఇదే చివరి అవకాశం అనుకుని చేస్తూ పోవాలి. అందుకోసం ఎంతైనా కష్టపడాలి అని చెప్తుంటాడు.దాని గురించి మాట్లాడడుచేసే పనిని చాలా గౌరవిస్తాడు. సినిమా కోసం పూర్తి స్థాయిలో కృషి చేయాలని ఆలోచిస్తాడే తప్ప కలెక్షన్స్ రాలేదేంటని ఎక్కువగా దిగులు చెందడు. ఫెయిల్యూర్స్ గురించి ఎవరితోనూ పంచుకోడు. కానీ సెట్లో ఉదయం 7 గంటలకల్లా ఉండాలంటే ఆరున్నరకే ఉండేవాడు. మేము ఆలస్యంగా వెళ్లినా సరే మాపై కోప్పడేవాడు కాదు అని చెప్పుకొచ్చాడు. కాగా అక్షయ్ కుమార్ చివరగా బడే మియా చోటే మియా సినిమాలో నటించాడు. తను నటించిన సర్ఫిర (ఇది సూరరై పోట్రుకు రీమేక్‌గా తెరకెక్కింది) జూలై 12న విడుదల కానుంది. చదవండి: ప్రభాస్ అతిథి పాత్రలో నటించిన సినిమా ఏదో తెలుసా? -
లాగి ఒక్కటిస్తా....అన్నీ సర్దుకుంటాయ్
ఢిల్లీ: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, డ్యాన్స్ డైరెక్టర్, దర్శకుడు అహ్మద్ ఖాన్ మధ్య విబేధాలు పొడసూపాయన్న వార్తలపై అహ్మద్ ఖాన్ స్పందించారు. తామిద్దరం ఇప్పటికీ మంచిమిత్రులమని చెప్పాడు. త్వరలోనే షాహిద్ ని ఒక చెంప దెబ్బ కొడితే, వదంతులన్నీ అవే సర్దుకుంటాయని అహ్మద్ చమత్కరించాడు. షాహిద్ కపూర్ పెళ్లికి తన బాల్యమిత్రుడు అహ్మద్ ఖాన్ ఆహ్వానించలేదన్న వార్తలను ఆయన ఖండించారు. తమ మధ్య అలాంటిదేమీ లేదని, తన కుమారుడి సెలవులు, ఇతర పనుల్లో బిజీగా ఉండడం మూలంగానే షాహిద్ పెళ్లికి, రిసెప్షన్‌కి హాజరు కాలేకపోయానని వివరణ ఇచ్చారు. త్వరలోనే ఇద్దర్నీ కలిసి శుభాకాంక్షలు తెలుపనున్నామన్నారు. నిజానికి గ్రీస్‌లో ఇవ్వాలనుకున్న తన బ్యాచిలర్ పార్టీకి కూడా తనను ఆహ్వానించాడని తెలిపారు. మేము చిరకాల మిత్రులమని, బాల్యం నుంచి కలిసే పెరిగామని పేర్కొన్నారు. ఎవరి పనుల్లో వాళ్లం బిజీగా ఉండడం వల్ల కొన్ని నెలలుగా కలవలేకపోయా మన్నారు. ఇస్తాంబుల్ నుంచి వచ్చిన తరువాత కూడా బిజీ అయిపోయానని, త్వరలోనే కొత్త దంపతులు షాహిద్, మీరాలను కలవనున్నామని చెప్పాడు. తమ రెండు కుటుంబాలు కలిసి ఎటైనా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. కాగా ట్రైగర్ ష్రాఫ్, కీర్తి సనన్ నటించిన ఒక మ్యూజిక్ వీడియో ఆల్బంను ఇటీవలే విడుదల చేసాడు ఈ కొరియోగ్రాఫర్ కం దర్శకుడు అహ్మద్ ఖాన్.