లాగి ఒక్కటిస్తా....అన్నీ సర్దుకుంటాయ్ | I’ll give Shahid a slap and things will be fine: Ahmed Khan | Sakshi
Sakshi News home page

లాగి ఒక్కటిస్తా....అన్నీ సర్దుకుంటాయ్

Published Mon, Jul 20 2015 4:17 PM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM

లాగి ఒక్కటిస్తా....అన్నీ సర్దుకుంటాయ్

లాగి ఒక్కటిస్తా....అన్నీ సర్దుకుంటాయ్


ఢిల్లీ: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, డ్యాన్స్ డైరెక్టర్, దర్శకుడు అహ్మద్ ఖాన్ మధ్య విబేధాలు  పొడసూపాయన్న వార్తలపై అహ్మద్ ఖాన్ స్పందించారు.  తామిద్దరం ఇప్పటికీ మంచిమిత్రులమని చెప్పాడు. త్వరలోనే  షాహిద్ ని ఒక చెంప దెబ్బ కొడితే, వదంతులన్నీ  అవే సర్దుకుంటాయని అహ్మద్ చమత్కరించాడు. షాహిద్ కపూర్ పెళ్లికి తన బాల్యమిత్రుడు అహ్మద్  ఖాన్ ఆహ్వానించలేదన్న వార్తలను ఆయన ఖండించారు.  తమ మధ్య అలాంటిదేమీ లేదని, తన కుమారుడి సెలవులు,  ఇతర పనుల్లో  బిజీగా ఉండడం మూలంగానే షాహిద్ పెళ్లికి, రిసెప్షన్కి  హాజరు కాలేకపోయానని వివరణ ఇచ్చారు. త్వరలోనే ఇద్దర్నీ కలిసి శుభాకాంక్షలు తెలుపనున్నామన్నారు.

నిజానికి  గ్రీస్లో ఇవ్వాలనుకున్న తన బ్యాచిలర్ పార్టీకి కూడా తనను ఆహ్వానించాడని తెలిపారు. మేము చిరకాల మిత్రులమని, బాల్యం నుంచి కలిసే పెరిగామని  పేర్కొన్నారు.  ఎవరి పనుల్లో వాళ్లం బిజీగా ఉండడం వల్ల కొన్ని నెలలుగా కలవలేకపోయా మన్నారు. ఇస్తాంబుల్ నుంచి వచ్చిన తరువాత కూడా బిజీ అయిపోయానని, త్వరలోనే కొత్త దంపతులు షాహిద్, మీరాలను కలవనున్నామని చెప్పాడు.  తమ రెండు కుటుంబాలు కలిసి  ఎటైనా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.
కాగా ట్రైగర్ ష్రాఫ్, కీర్తి సనన్ నటించిన  ఒక  మ్యూజిక్ వీడియో ఆల్బంను ఇటీవలే  విడుదల చేసాడు ఈ కొరియోగ్రాఫర్ కం దర్శకుడు అహ్మద్ ఖాన్.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement