Christian Erickson
-
గ్రౌండ్లో కుప్పకూలిన మరో స్టార్ ప్లేయర్..
మ్యూనిచ్: డెన్మార్క్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సన్ ఘటన మరువకముందే యూరోకప్ 2020లో మరో స్టార్ ప్లేయర్ గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. ఆ ఆటగాడు10 నుంచి 15 సెకన్ల పాటు స్పృహ కోల్పోవడంతో సహచర ఆటగాళ్లు ఆందోళన చెందారు. జర్మనీతో మ్యాచ్ సందర్భంగా ఫ్రాన్స్ డిఫెండర్ బెంజమిన్ పవార్డ్ ప్రత్యర్థి ప్లేయర్ రాబిన్ గోసెన్స్ను ఢీకొట్టడంతో వెంటనే కింద పడిపోయి స్పృహ కోల్పోయాడు. అయితే ఘటన తర్వాత కొన్ని నిమిషాల పాటు పవార్డ్కు చికిత్సనందించడంతో అతను కోలుకున్నాడు. అనంతరం మ్యాచ్‌లో కూడా కొనసాగాడు. అయితే, స్పృహ కోల్పోయిన ఆటగాడిని మ్యాచ్‌లో ఎలా కొనసాగిస్తారని, అతడు కంకషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందని సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో ఫ్రాన్స్ జట్టు యాజమాన్యం అతన్ని మైదానం నుంచి బయటకు పంపింది. అతని స్థానంలో సబ్‌స్టిట్యూట్ ఆటగాడిని బరిలోకి దించింది. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 1-0తో జర్మనీపై గెలుపొందింది. మ్యాచ్ అనంతరం గాయపడిన పవార్డ్ మాట్లాడుతూ.. ప్రత్యర్ధి ఆటగాడు బలంగా ఢీకొట్టడం వల్ల షాక్‌కు లోనయ్యాని, దాంతో కాసేపు స్పృహ కోల్పోయానని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే, ఇదే టోర్నీలో డెన్మార్క్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సన్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా మైదానంలోనే కుప్పకూలిన విషయం తెలిసిందే. అతన్ని వెంటనే గ్రౌండ్ నుంచి హాస్పిటల్‌కు తరలించడంతో ప్రాణాపాయస్థితి నుంచి బయటపడి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఊహించని ఈ పరిణామానికి షాక్ తిన్న ఫుట్‌బాల్ ప్రపంచం, వెంటనే అలాంటి ఘటనే పునరావృతం కావడంతో ఉలిక్కిపడింది. అయితే, పవార్డ్కు ఏమీ కాకపోవడంతో సాకర్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: కోక్ బాటిల్ వ్యవహారంతో 30 వేల కోట్లు హాంఫట్, మరి ఈయన బీర్ బాటిల్ తీసేశాడు -
అగ్రస్థానంలోకి దూసుకొస్తాం
ఎరిక్సన్ ఇంటర్వ్యూ డానిష్ స్టార్ మిడ్‌ఫీల్డర్ క్రిస్టియన్ ఎరిక్సన్ . ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో టాటెన్ హామ్ హాట్స్పర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సాకర్ స్టార్... ఈ సీజన్ ట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. అజేయమైన చెల్సీకి బ్రేకులేసిన టాటెన్ హామ్ ఇప్పుడు తదుపరి పోరులో మాంచెస్టర్ సిటీతో సమరానికి సై అంటోంది. ఈ నేపథ్యంలో ఎరిక్సన్ తమ జట్టు విశేషాల్ని ఇలా చెప్పుకొచ్చాడు. జోరుమీదున్న చెల్సీకి షాకిచ్చారు. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో మాంచెస్టర్ సిటీని ఓడిస్తారా? మేం ప్రతి మ్యాచ్‌లో బాగా ఆడుతున్నాం. దీంతో మా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతోంది. చెల్సీపై ఫలితం చెప్పుకోదగింది. కానీ ఇక్కడితో ఆగం. తదుపరి మ్యాచ్‌లో 4–0తో గెలవాలనే లక్ష్యంతో ఉన్నాం. కాబట్టి మా జోరు కొనసాగిస్తాం. టాటెన్ హామ్ టైటిల్ అవకాశాలెలా ఉన్నాయి? ఇప్పుడే చెబితే తొందరపాటవుతుంది. ఈ సీజన్ లో ఇంకా ఆడాల్సింది ఎంతో ఉంది. అయితే మా ప్రయాణం సానుకూలంగా సాగుతోందని చెప్పగలను. మా వాళ్లంతా ఫామ్‌లో ఉన్నారు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి చేరే సత్తా మా జట్టుకు వుంది. అయితే త్వరలో చెల్సీని అధిగమిస్తారా? వారిపై గెలిచిన మీరు టైటిల్ రేసులో ఉన్నారనే అనుకుంటున్నారా? అధిగమిస్తామనే ఆశిస్తున్నా. కానీ వారు బాగా ఆడుతున్నారు. ఎట్టకేలకు ఈ సీజన్ లో మా జోరుతో వారి జైత్రయాత్రకు బ్రేకులేశాం. దీంతో ఎవరైనా సరే చెల్సీని ఓడించేయొచ్చని మిగతా జట్లు తెలుసుకునేలా చేశాం. వారి మైండ్‌సెట్‌ను మార్చాం. ఇప్పటికైతే మేం మెరుగైన స్థానంలోనే ఉన్నాం. ఇలాగే మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఆరు గోల్స్ చేసిన మీరు వ్యక్తిగతంగా మీ ఫామ్‌పై సంతృప్తితో ఉన్నారా? నిజానికి నేను మరిన్ని గోల్స్ చేయాల్సింది. అయితే మిగతా వాళ్లూ గోల్స్ చేయడానికి సహాయ పాత్ర పోషించినందుకు సంతోషంగానే ఉంది. మా జట్టు విజయాలకు సమష్టిగా కష్టపడినందుకు సంతృప్తిగా ఉంది.