Christina Aguilera
-
నాకు హార్ట్ ఎటాక్ తెప్పిస్తాడు
లాస్ ఏంజెలిస్: పాప్ సింగర్ తన కుమారుడి విషయంలో తీవ్ర కలత చెందుతోంది. తన కుమారుడు మాక్స్ ఏదో ఒక రోజు గుండెపోటు తెప్పిస్తాడంటూ పాప్ సింగర్ క్రిస్టినా అగ్విలెరా అంటోంది. పార్కర్ కు తన ఎనిమిదేళ్ల కొడుకు మాక్స్ బిగ్ ఫ్యాన్ అని, వాడి డేరింగ్ నెస్ ఎక్కువైనందుకు కాస్త కంగారు పడుతున్నట్లు పేర్కొంది. మాక్స్ ఎప్పుడూ వాడికి ఇష్టం ఉన్న పనులు చేస్తుంటాడు, వారి కెరీర్ కూడా వాడే డిసైడ్ చేసుకుంటాడని చెప్పింది. అగ్విలెరా పాల్గొన్న షో 'ది ఎల్లిన్ డిజెనరెస్ షో' మంగళవారం నాడు భారత్ లోనూ కొన్ని చానల్స్ లో ప్రసారం కానుందని ఆమె తెలిపింది. మాక్స్ పెద్దయ్యాక ఎంటర్ టైన్ మెంట్ కంపెనీ సర్క్యూ డు సొలేల్ లో జాయిన్ అవుతాడేమోనని అభిప్రాయపడింది. పార్కర్.. ప్రమాదకర క్రీడ అయినందున తాను భయపడాల్సి వస్తుందని పాప్ స్టార్ చెప్పుకొచ్చింది. ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్ పైకి దూకడం లాంటి పనులు చేయడం ఆ గేమ్ లో ఉంటాయని, ఇప్పటికే వాడు ట్రెయినింగ్ మొదలెట్టాడని అగ్విలెరా తెలిపింది. మాక్స్ చేసే స్టంట్స్, ఇతర యాక్షన్స్ వల్ల వాడికి ఏదైనా జరిగితే తనకు గుండెపోటు వచ్చేలా ఉందని పాప్ సింగర్ ఆందోళన చెందుతోంది. -
మా బుజ్జాయి భలేగా ఉంది..
గత ఆగస్ట్‌లో మాతృత్వపు ఆనందం పొందిన ప్రముఖ సింగర్ క్రిస్టీనా అగిలేరా పుత్రికోత్సాహంతో పొంగిపోతోంది. ఐదు నెలలు నిండిన తన బుజ్జాయి ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘ఈ ప్రపంచాన్ని జయించడానికి మా చిట్టితల్లి వస్తోంది’ అంటూ దానికి క్యాప్షన్ కూడా జత చేసింది. ఫొటోలో పింక్ కలర్ డ్రెస్‌లో అంబాడుతున్న జూనియర్ క్రిస్టీనా ముఖం కనిపించకున్నా.. ముద్దుగానే కనిపిస్తోంది. -
నగ్నంగా ఫొటోలకు పోజిచ్చిన గాయని!
రెండో బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉన్న గాయని క్రిస్టినా ఆగిలెరా నగ్నంగా ఫొటోలకు పోజులిచ్చింది. 33 ఏళ్ల ఈ గాయనికి ఈసారి ఆడపిల్ల పుడుతుందని చెబుతున్నారు. తన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో చూపించడానికి ఆమె పూర్తి నగ్నంగా మారి 'వి' మ్యాగజైన్‌కు ఫొటో పోజులు ఇచ్చినట్లు డైలీ మెయిల్ తెలిపింది. ఆ వెబ్‌సైటే ఆమె ఫొటోలను విడుదల చేసింది. తెల్లటి బ్యాక్‌గ్రౌండ్‌లో పూర్తి బ్లాక్ అండ్ వైట్‌లో తీసిన ఈ ఫొటోను సదరు వెబ్సైట్ ప్రచురించింది. అయితే.. నగ్నత్వంలో కూడా ఎలాంటి అసభ్యత లేకుండా ఈ ఫొటో ఉండటం గమనార్హం. ఎందుకిలా నగ్నంగా ఫొటో తీయించుకున్నారని అడిగితే.. ''నేనో మహిళను. నా జీవితంలోని ప్రతి దశలో నా శరీరం పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. ఏమాత్రం భయం లేకుండా, ఆత్మవిశ్వాసంతో ఉన్నాను'' అని చెప్పింది. ఈ నెలలోనే ఆగిలెరా, ఆమె భర్త మాథ్యూ రట్లర్ (28) తల్లిదండ్రులు కాబోతున్నారు. ఆగిరెలాకు ఇప్పటికే తన మాజీ భర్త జోర్డాన్ బ్రట్మన్తో ఆరేళ్ల కొడుకు మాక్స్ ఉన్నాడు. 2008లో మాక్స్ పుట్టడానికి ముందు కూడా ఆమె ఇలాగే దుస్తులు విప్పి నగ్నంగా ఫొటోలు తీయించుకుంది.