Christmas Feast
-
క్రిస్మస్ వేళ.. మమ్మీ.. శాంటా ఏమిచ్చాడో చూడు..
మమ్మీ... శాంటా ఏమిచ్చాడో చూడు.. శాంటా వస్తాడట... గిఫ్ట్స్ ఇస్తాడట... మమ్మీ... నాక్కూడా ఇస్తాడా?. డాడీ... నేనడిగింది ఇస్తాడా? పిల్లలు... బంగారు కొండలు. శాంటా వారికి ఇష్టమైన తాతయ్య. కానుకలిచ్చే తాతయ్య. పిల్లల్ని మంచి మార్గంలో పెట్టడానికి మంచి బుద్ధులు చెప్పడానికి చదువులో ప్రోత్సహించడానికి ఊరికే సంతోషపెట్టడానికి అర్ధరాత్రి దిండు కింద కానుకలు పెట్టి తల్లిదండ్రులే శాంటాలు అవుతారు. పిల్లలు ఈ సంతోషానికి హక్కుదారులు. పెద్దలు ఈ సంతోషం పంచాల్సిన బాధ్యత కలిగిన వారు. క్రిస్మస్ను సంతోషమయం చేయండి. పిల్లలను ఈ కానుకలతో ఎలా ప్రోత్సహించవచ్చు?. ఏ కానుకలు ఇవ్వొచ్చు? ‘అమ్మా... శాంటా క్లాజ్ ఎక్కడ ఉంటాడు?’ ‘నార్త్ పోల్‌లో’ ‘ఎప్పుడు వస్తాడు?’ ‘రేపు క్రిస్మస్ అనగా ఇవాళ రాత్రి వస్తాడు’ ‘ఎలా వస్తాడు?’ ‘ఎగిరే జింకల బగ్గీ మీద బోలెడన్ని గిఫ్ట్స్ వేసుకుని, ఏయే పిల్లాడికి ఏయే గిఫ్ట్ ఇవాలో వాటి మీద పేరు రాసుకుని వస్తాడు’ ‘మన ఇంటికి వస్తాడా?’ ‘ఎందుకు రాడు?’ ‘నాకు గిఫ్ట్ ఇస్తాడా?’ ‘ఇస్తాడు. మంచి పిల్లలకు మంచి గిఫ్ట్ ఇస్తాడు. అల్లరి పిల్లలకు గిఫ్ట్ ఇవ్వడు’ ‘నేను మంచి పిల్లాడినేగా’ ‘నాకేం తెలుసు. నీకు తెలియాలి’ ‘నేను అల్లరి చేయనుగా’ ‘అయితే నీకు గిఫ్ట్ తెచ్చిస్తాడులే’ ∙∙ క్రిస్మస్ వచ్చిందంటే పిల్లలందరికీ క్రిస్మస్ తాత గుర్తుకొస్తాడు. తెల్లటి ఫర్ అంచుల ఎర్రటి బట్టలు వేసుకుని, ఇంత పొడవు తెల్ల గడ్డంతో, ఎర్ర టోపీతో, కళ్లద్దాలు పెట్టుకుని ‘జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్’ పాడుతూ కానుకలు తెచ్చే శాంటా తాత కోసం ఎదురు చూపులు మొదలవుతాయి. మూడు నాలుగేళ్ల వయసు నుంచి పదేళ్ల లోపు పిల్లలకు క్రిస్మస్ తాత మీద ఎంతో నమ్మకం. సంవత్సరమంతా ఎదురు చూసైనా తాత ఇచ్చే బహుమతి అందుకోవాలనుకుంటారు. ఏ బహుమతి ఇస్తాడో అనే సస్పెన్స్‌ని ఎంజాయ్ చేస్తారు. కాస్త పెద్ద పిల్లలకు తాత మీద డౌట్ ఉన్నా తెల్లారే సరికి తమ బెడ్ మీద పక్కనే ఉన్న గిఫ్ట్స్‌ను చూస్తే ఆనందం. సంతోషం. వాటిని తాత ఇచ్చినా సరే. తాత పేరుతో ఎవరు ఇచ్చినా సరే. కాని ఆ రోజంతా ‘శాంటా ఏం ఇచ్చాడో చూడు’ అని అందరికీ చూపడం ఎంత బాగుంటుందో. ∙∙ ‘అమ్మా.. నాకేం గిఫ్ట్ కావాలో శాంటాకు ఎలా తెలుస్తుంది? ‘ఉత్తరం రాసి నాకు ఇవ్వు పోస్ట్ డబ్బాలో పడేస్తాను’ ‘సరే’ ‘నేను కోరిందే ఇస్తాడా?’ ‘శాంటాకు రాయి. తాతయ్యా... నేను బాగా చదువుకుంటాను. బుద్ధిగా ఉంటాను. క్లాస్‌లో అల్లరి చేయను. అమ్మ చెప్పినట్టు వింటాను. అన్నం తిననని మారాం చేయక పెట్టిందల్లా తింటాను. అబద్ధాలు చెప్పను. ఎక్కువగా ఫోన్‌తో ఆడను. నేను గుడ్‌బాయ్‌గా ఉంటాను అని రాయి. అప్పుడు తెస్తాడు’ ‘సరే’ ∙∙ కానుకలు ఎప్పుడూ పిల్లలను ఉత్సాహపరుస్తాయి. తల్లిదండ్రులు క్రిస్మస్ సందర్భంగా వారికి నచ్చిన చిన్నచిన్న కానుకలైనా ఇచ్చి ప్రోత్సహించాలి. ‘పోయిన సంవత్సరం మంచి మార్కులు తెచ్చుకున్నావుగా. అందుకని ఈ గిఫ్ట్. చాలా బుద్ధిగా ఉంటున్నావుగా... అందుకని ఈ గిఫ్ట్. చెల్లితో/అక్కతో కొట్లాడటం లేదు కదా అందుకని ఈ గిఫ్ట్. మంచి ఫ్రెండ్స్‌ను చేసుకున్నావుగా. అందుకని ఈ గిఫ్ట్’ ఇలా చెప్పి కానుకలు ఇస్తే వారు తాము మంచి పనులు చేస్తున్నామనే నమ్మకానికి వస్తారు. చేయాలని అనుకుంటారు. వాటికి కానుకలు ఉంటాయని ఉత్సాహపడతారు. క్రిస్మస్ తాతను చూపి దురలవాట్లు (గోర్లు కొరకడం, హ్యాండ్ రైటింగ్ కరెక్ట్ చేసుకోకపోవడం, పుస్తకాల బ్యాగ్ సరిగ్గా ఉంచుకోకపోవడం, స్కూల్ ఎగ్గొట్టడం.. వంటివి) మాన్పించవచ్చు. అవి మానతామని హామీ ఇస్తేనే తాత గిఫ్ట్ ఇస్తాడని చెప్పాలి. మెర్రీ క్రిస్మస్. పిల్లలకు ఏం గిఫ్ట్‌లు ఇవ్వొచ్చు? వీటిలోంచి ఎంచుకోండి. 1. ఆర్ట్ మెటీరియల్ 2. బొమ్మల పుస్తకాలు 3. షూస్ 4. పిగ్గీ బ్యాంక్ 5. కెలడీస్కోప్ 6. ఇండోర్ ప్లాంట్ 7. కుక్కపిల్ల 8. స్మార్ట్ వాచ్ 9. స్మార్ట్ స్పీకర్స్ 10.పోర్టబుల్ ఆడియో ప్లేయర్ 11. క్రిస్మస్ టీషర్ట్స్ 12. హెడ్ సెట్స్ 13. టాయ్స్ -
రూ.4 లక్షలు టిప్ ఇచ్చిన కస్టమర్..!
వాషింగ్టన్: పండుగల వేళ మనకున్నదాంట్లో పేదవారికి సాయం చేస్తే.. వారి ముఖాల్లో కూడా సంతోషం వెల్లివిరిస్తుంది. అందుకే చాలా వరకు పండుగ పూట ఇంటికి వచ్చిన వారికి తోచినంత దానం చేస్తారు. అమెరికాకు చెందిన ఓ కస్టమర్ కూడా ఇలానే భావించాడు. తాను భోజనం చేయడానికి వెళ్లిన రెస్టారెంట్ స్టాఫ్‌కి 4 లక్షల రూపాయలు టిప్ ఇచ్చి.. అందరిని సమంగా పంచుకోమన్నాడు. అతడి దాతృత్వానికి రెస్టారెంట్ సిబ్బంది తెగ సంబరపడ్డారు. ధన్యవాదాలు తెలిపారు. వివరాలు.. ఈ నెల 12న ఓ కస్టమర్ ఒహియోలోని సౌక్ మెడిటేరియన్ రెస్టారెంట్‌కి వెళ్లాడు. డిన్నర్ చేశాడు. ఇక బిల్ తెచ్చివ్వగా.. బిల్‌తో పాటు 5,600 డాలర్లు (4,12,459 రూపాయలు) టిప్ ఇచ్చాడు. స్టాఫ్ అందరిని సమానంగా పంచుకోమని కోరాడు. మొత్తం 28 మందికి 200 డాలర్లు వచ్చాయి. ఇక క్రిస్టమస్ ముందు ఇంత భారీ మొత్తం టిప్‌గా లభించడంతో సిబ్బంది సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సదరు కస్టమర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. (వైరల్: డెలివరీ బాయ్‌కు ఊహించని సర్ప్రైజ్) ఈ సందర్భంగా చీఫ్ కుక్ మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది మా అందరి జీవితాల్లో కన్నీళ్లే ఉన్నాయి. పండుగ ఆనందం కూడా లేదు. ఆర్థికంగా ఎంతో కుంగిపోయాం. కేవలం రోజులు గడుస్తున్నాయి అంతే. ఇలాంటి పరిస్థితుల్లో ఓ అపరిచితుడు మమ్మల్ని తన కుటుంబ సభ్యులుగా భావించాడు. మా అందరికి భారీ మొత్తం టిప్‌గా ఇచ్చాడు. ఇది మాకు ఎంతో ఎక్కువ. అతడికి జీవితాంతం కృతజ్ఞతలు తెలుపుతాం’ అన్నారు. ఇక ఇంత మంచి పని చేసిన వ్యక్తి తన పేరు బయటకు వెల్లడించవద్దని కోరినట్లు సిబ్బంది తెలిపారు. -
20న క్రైస్తవులకు సీఎం క్రిస్మస్ విందు
- క్రిస్మస్ వేడుకలకు రూ. 15 కోట్లు కేటాయింపు - రెండు లక్షల మందికి దుస్తుల పంపిణీ - విందు ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి తలసాని సాక్షి, హైదరాబాద్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 20న హైదరా బాద్‌లోని ఎల్బీ స్టేడియంలో క్రైస్తవ సోదరులకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు క్రిస్మస్ విందు ఇవ్వనున్నారు. క్రిస్మస్ వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటా యించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు లక్షల మంది క్రైస్తవ పేదలకు ఒక ప్యాంటు, షర్టు, చీర, జాకెట్, ఒక పంజాబీ డ్రెస్‌తో కూడిన కిట్‌ను పంపిణీ చేయనున్నారు. క్రిస్మస్ విందు కోసం ప్రతి చర్చికి రూ.2 లక్షల చొప్పున మంజూరు చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని 100 డివిజన్లలో లక్ష మంది పేదలకు దుస్తుల పంపి ణీతోపాటు విందును ఏర్పాటు చేస్తున్నారు. విందు ఏర్పాట్లు, దుస్తుల పంపి ణీపై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ శుక్రవారం సచివాలయంలో సమీక్షించారు. సీఎం కేసీఆర్ పాల్గొనే విందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. నగరంలో దుస్తుల పంపిణీ, విందు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలన్నారు. సమీక్షలో క్రిస్టియ న్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ విక్టర్, సనత్‌నగర్ నియోజకవర్గ కార్పొరే టర్లు అత్తిలి అరుణ, ఆకుల రూప, క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు. -
నేడు రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ ఫీస్ట్
195 కేంద్రాల్లో రెండు లక్షల మందికి విందు భోజనం రేపు హైదరాబాద్‌లో ఫీస్ట్‌కు సీఎం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కిస్మస్ పండుగను పురస్కరించుకొని సుమారు రెండు లక్షల మంది క్రైస్తవులకు నేడు(శనివారం) ప్రత్యేకంగా ఫీస్ట్(విందు) ఏర్పాటు చేయనుంది. తొమ్మిది జిల్లాల్లోని 95 నియోజకవర్గ కేంద్రాలు, జీహెచ్ఎంసీ పరిధిలో వంద ఏరియాల్లో విందు భోజనం ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ విక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిరుపేద క్రైస్తవ కుటుంబాలకు కిస్మస్ కానుకగా నూతన వస్త్రాల పంపిణీ కొనసాగుతోంది. చర్చి కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన 2.10 లక్షల క్రైస్తవ నిరుపేద కుటుంబాలను, 10 వేల అనాథ పిల్లలు, వృద్ధులకు.. ప్యాంటు, షర్టు, ఒక పాలిస్టర్ చీర, బ్లౌజు, షల్వారు, కమీజ్, దుపట్టాలతో కూడిన ప్రత్యేక ప్యాకెట్లు బహూకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.15.37 కోట్లు విడుదల చేయగా అందులో రూ.11.27 కోట్లు కానుకలు, రూ.4.10 కోట్లు క్రిస్మస్ ఫీస్ట్ కోసం వినియోగిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైస్తవ సోదరులకు ఆదివారం నిజాం కాలేజీ మైదానంలో ‘క్రిస్మస్ డిన్నర్’ ఏర్పాటు చేశారు. ఈ విందుకు సుమారు ఐదు వేల మంది అతిథులు హాజరుకానున్నారు. దీని కోసం మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది.