- క్రిస్మస్ వేడుకలకు రూ. 15 కోట్లు కేటాయింపు
- రెండు లక్షల మందికి దుస్తుల పంపిణీ
- విందు ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 20న హైదరా బాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో క్రైస్తవ సోదరులకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు క్రిస్మస్ విందు ఇవ్వనున్నారు. క్రిస్మస్ వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటా యించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు లక్షల మంది క్రైస్తవ పేదలకు ఒక ప్యాంటు, షర్టు, చీర, జాకెట్, ఒక పంజాబీ డ్రెస్‌తో కూడిన కిట్‌ను పంపిణీ చేయనున్నారు. క్రిస్మస్ విందు కోసం ప్రతి చర్చికి రూ.2 లక్షల చొప్పున మంజూరు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్‌లోని 100 డివిజన్లలో లక్ష మంది పేదలకు దుస్తుల పంపి ణీతోపాటు విందును ఏర్పాటు చేస్తున్నారు. విందు ఏర్పాట్లు, దుస్తుల పంపి ణీపై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ శుక్రవారం సచివాలయంలో సమీక్షించారు. సీఎం కేసీఆర్ పాల్గొనే విందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. నగరంలో దుస్తుల పంపిణీ, విందు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలన్నారు. సమీక్షలో క్రిస్టియ న్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ విక్టర్, సనత్‌నగర్ నియోజకవర్గ కార్పొరే టర్లు అత్తిలి అరుణ, ఆకుల రూప, క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు.
20న క్రైస్తవులకు సీఎం క్రిస్మస్ విందు
Published Sat, Dec 17 2016 3:22 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement