195 కేంద్రాల్లో రెండు లక్షల మందికి విందు భోజనం
రేపు హైదరాబాద్‌లో ఫీస్ట్‌కు సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కిస్మస్ పండుగను పురస్కరించుకొని సుమారు రెండు లక్షల మంది క్రైస్తవులకు నేడు(శనివారం) ప్రత్యేకంగా ఫీస్ట్(విందు) ఏర్పాటు చేయనుంది. తొమ్మిది జిల్లాల్లోని 95 నియోజకవర్గ కేంద్రాలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో వంద ఏరియాల్లో విందు భోజనం ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ విక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిరుపేద క్రైస్తవ కుటుంబాలకు కిస్మస్ కానుకగా నూతన వస్త్రాల పంపిణీ కొనసాగుతోంది. చర్చి కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన 2.10 లక్షల క్రైస్తవ నిరుపేద కుటుంబాలను, 10 వేల అనాథ పిల్లలు, వృద్ధులకు.. ప్యాంటు, షర్టు, ఒక పాలిస్టర్ చీర, బ్లౌజు, షల్వారు, కమీజ్, దుపట్టాలతో కూడిన ప్రత్యేక ప్యాకెట్లు బహూకరిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.15.37 కోట్లు విడుదల చేయగా అందులో రూ.11.27 కోట్లు కానుకలు, రూ.4.10 కోట్లు క్రిస్మస్ ఫీస్ట్ కోసం వినియోగిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైస్తవ సోదరులకు ఆదివారం నిజాం కాలేజీ మైదానంలో ‘క్రిస్మస్ డిన్నర్’ ఏర్పాటు చేశారు. ఈ విందుకు సుమారు ఐదు వేల మంది అతిథులు హాజరుకానున్నారు. దీని కోసం మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది.
నేడు రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ ఫీస్ట్
Published Sat, Dec 19 2015 12:45 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement