స్పౌస్ కేటగిరీ కింద బదిలీలకు ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: జీవిత భాగస్వామి (స్పౌస్) విభాగంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని కార్యాలయాలకు మాత్రం బదిలీలను నిరాకరించింది.అయితే హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఉద్యోగులు బయటి ప్రాంతాలకు బదిలీ పొం దేందుకు అనుమతించింది. అలాగే హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు ఉద్యోగుల బదిలీలను మాత్రం అనుమతించిం ది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శనివారం ఉత్తర్వులిచ్చారు. లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్(అంతర్ జిల్లా)కు బదిలీలతోపాటు జిల్లాలో అంతర్గత (ప్రస్తుత లోకల్ కేడర్ లోపే) బదిలీలకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు.
జీవిత భాగస్వామి కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు, రాష్ట్రస్థాయి ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగయితే సదరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను స్పౌస్ కేటగిరీ కింద బదిలీ చేసేందుకు అర్హులుగా పరిగణిస్తారు. స్పష్టమైన ఖాళీ పోస్టుల్లోనే వీరిని బదిలీ చేస్తారు. లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్‌కు బదిలీ అయితే సం బంధిత ఉద్యోగికి సీనియారిటీలో చివరి స్థానాన్ని కల్పిస్తారు. విజ్ఞప్తిపై బదిలీ అయ్యేవారికి బదిలీ రవాణా భత్యం(టీటీఏ),కరువు భత్యం(డీఏ) సదుపాయం ఉండదు. స్పౌస్ కేటగిరీ బదిలీలపై సచివాలయంలో ప్రభుత్వశాఖలు, హెచ్‌ఓడీలు, జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
హైదరాబాద్‌కు బదిలీ నై
Published Sun, May 22 2016 4:01 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement