Government Employees transfer
-
40 శాతమే అయితే ఎలా?
సాక్షి, హైదరాబాద్: సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా.. ప్రభుత్వ శాఖలు ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశాయి. ఒకట్రెండు రోజుల్లో శాఖల వారీగా బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు జారీచేసే పనిలో బిజీ అయ్యాయి. వాస్తవానికి ఉద్యోగుల సాధారణ బదిలీలు 2018లో జరిగాయి. ఆ తర్వాత జీఓ 317 కింద జరిగిన కేటాయింపులు, ఎన్నికల సమయంలో జరిగిన బదిలీలు మినహా ఉద్యోగులకు స్థానచలనం కలగలేదు. అయితే తాజాగా ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలపై ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. 40 శాతం మించి ఉద్యోగులకు బదిలీలు చేయొద్దని స్పష్టం చేయడంతో, సుదీర్ఘకాలంగా వేచిచూస్తున్న వారికి తాజా బదిలీలు నిరాశ కలిగిస్తాయనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. సీనియర్లకే అవకాశం... ఒక ఉద్యోగి ఒకస్థానంలో గరిష్టంగా నాలుగేళ్లు దాటితే బదిలీ తప్పనిసరి అనే నిబంధన పెట్టింది. దీంతో వరు సగా నాలుగేళ్లు ఒకేచోట పనిచేస్తే వారు తప్పకుండా బదిలీ కావాల్సి ఉంటుంది. 40 శాతం మించొద్దని చెప్పడంతో తప్పనిసరి బదిలీ కేటగిరీలో ఉన్న చాలామంది ఉద్యోగులకు స్థానచలనం కష్టమని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సాధారణ బదిలీ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర స్థాయి, మలీ్టజోనల్, జోనల్, జిల్లా కేడర్‌లో బదిలీలు జరగనున్నాయి. ఈ క్రమంలో కేడర్ యూనిట్ ప్రకారం బదిలీలకు అర్హులైన ఉద్యోగుల జాబితాను సంబంధిత శాఖలు ప్రకటిస్తాయి. 40 శాతం మాత్రమే బదిలీలకు అవకాశం కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం జిల్లా కేడర్‌లో 10 మంది ఉద్యోగులు ఉంటే అందులో కేవలం నలుగురు మాత్రమే బదిలీకి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో సాధారణ బదిలీలు జరిగి దాదాపు ఆరేళ్లు కావొస్తుంది. దీంతో నాలుగేళ్లు సర్వీసు దాటిన ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పిస్తే పనిచేస్తున్న వారిలో మెజారిటీ శాతం తప్పనిసరి బదిలీ కేటగిరీలో అర్హత సాధించే అవకాశం ఉంది. కానీ 40శాతం మందికి అవకాశం కల్పిస్తే కేవలం కొందరు సీనియర్లకు మాత్రమే స్థానచలనం కలుగుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు ఆర్టర్ టు సర్వ్ ప్రాతిపదికన పలు జిల్లా కార్యాలయాల్లో ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. సాధారణ బదిలీల కోసం వారంతా ఎదురు చూస్తుండగా... ప్రభుత్వ నిబంధన ప్రకారం వీరిలో మెజారిటీ ఉద్యోగులకు తాజా బదిలీల్లో అవకాశం కలగుతుందా? లేదా? వేచి చూడాలి. అయితే 40శాతం నిబంధనను ఎత్తివేయాలనే డిమాండ్ కూడా ఉద్యోగవర్గాల నుంచి వినిపిస్తోంది. ఉద్యోగుల సీనియారిటీ జాబితా, తప్పనిసరి బదిలీల జాబితా వెలువడేందుకు మరో నాలుగైదు రోజుల సమయం పడుతుంది. ఈలోపు ఎంతమందికి బదిలీల్లో అవకాశం కలుగుతుందో స్పష్టత వస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. -
రేపట్నుంచి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ షురూ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు లైన్‌క్లియర్ అయ్యింది. బదిలీలపై ఉన్న నిషేధం ఎత్తివేస్తూ ఈనెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం..ఈ ఏడాది జూన్ 30వ తేదీ నాటికి ఒక ఉద్యోగి కనీసం రెండేళ్లు ఒకేచోట పనిచేసి ఉంటే బదిలీకి అర్హుడు. ఇక నాలుగేళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగికి బదిలీ తప్పనిసరి. ప్రత్యేక పరిస్థితి ఉంటే తప్ప నాలుగేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగికి బదిలీ నుంచి మినహాయింపు ఉండ దని, గరిష్టంగా 40%ఉద్యోగులకు మించకుండా బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్పౌజ్ కేటగిరీ, 2025 జూన్ 30వ తేదీ నాటికి పదవీవిరమణ పొందే ఉద్యోగులు, 70 శాతం డిజెబిలిటీ లేదా అంతకంటే ఎక్కువశాతం డిజెబిలిటీ ఉన్న ఉద్యోగులు, మానసిక వైకల్యంతో కూడిన పిల్లలున్న ఉద్యోగులు, వితంతువులు, మెడికల్ గ్రౌండ్స్ ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. బదిలీ ప్రక్రియ ఇలా... బదిలీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు శాఖాధి పతి ప్రభుత్వం ఇచ్చిన బదిలీల ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. – శాఖల వారీగా హెచ్ఓడీ సంబంధిత ఉద్యోగుల సీనియారి టీ జాబితా ప్రచురించాలి. – ఉద్యోగి పనిచేస్తున్న స్థానం, పదవీకాలంతో సహా చెప్పాలి. – శాఖలో ఉన్న ఖాళీల జాబితా కూడా ప్రచురించాలి. – తప్పనిసరి బదిలీ కేటగిరీలో ఉన్న ఉద్యోగుల వివరాలు కూడా ప్రత్యేకంగా ప్రకటించాలి. – బదిలీలకు సంబంధించి 5 ఐచ్చికాలను ఉద్యోగుల నుంచి తీసుకోవాలి. – ప్రభుత్వం ఆప్షన్ పత్రాన్ని ప్రకటించింది. అయితే శాఖాపరంగా ఈ ఆప్షన్ పత్రాన్ని మార్పు చేసుకునే వెసులుబాటు కల్పించింది. – బదిలీల ప్రక్రియతో ప్రతి కార్యాలయంలో కనీస సిబ్బంది ఉండేలా చూడాలి. – అవకాశం ఉన్నచోట ఆన్లైన్, వెబ్ కౌన్సెలింగ్ పద్ధతిలో బదిలీలు చేపట్టాలి. – ప్రభుత్వం జారీ చేసిన బదిలీల విధానానికి అనుగుణంగా విద్య, రెవన్యూ, వైద్య,ఆరోగ్య తదతర శాఖలు కూడా ఉద్యోగులబదిలీలకు పూర్తిస్థాయి మార్గదర్శకాలు జారీ చేస్తాయి. అయితే ప్రభుత్వ అనుమతితో మార్గదర్శకాల్లో సవరణలు కూడా చేసుకోవచ్చు. -
సీఎం కేసీఆర్‌కు వైఎస్ జగన్ లేఖ
సాక్షి, అమరావతి : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. అంతర్ రాష్ట్ర ఉద్యోగుల బదిలీకి సంబంధించిన విషయంపై అందులో ప్రస్థావించారు. బదిలీలను సత్వరమే పూర్తి చేయాలని, మానవతా దృక్పథంతో ఆలోచించి బదిలీలు చేపట్టాలని కోరారు. పరస్పర బదిలీలపై కమిటీ ఉత్తర్వులు విడుదల చేయాలని, అవి వెలువడిన వెంటనే ఉద్యోగుల బదిలీలు జరపాలని విజ్ఞప్తి చేశారు. -
పాలన గాడిన పడేనా..?
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో గాడితప్పిన పాలనను గాడిన పెట్టేందుకు ప్రక్షాళన మొదలైంది. కొన్నేళ్లుగా ఒకేచోట పాతుకుపోయిన ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నవారిని డిమోషన్ చేయడానికి కూడా వెనకాడడం లేదు. రెండేళ్లుగా స్మార్ట్‌సిటీ సాధనపైనే పూర్తిస్థాయిలో దృష్టిపెట్టిన బల్దియా.. ఉద్యోగులను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో సిబ్బంది ఆడిందే ఆటగా నడుస్తోంది. దీనికితోడు పలువురికి రాజకీయ అండదండలు ఉండడంతో ఎక్కడివారక్కడే పాతుకుపోయారు. పనిచేయకున్నా ఫరవాలేదనే పరిస్థితికి వచ్చారు. ప్రస్తుతం స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకుని, ఓడీఎఫ్‌గా గుర్తించబడిన నగరపాలక సంస్థలో ఉద్యోగుల పనితీరుపై దృష్టిసారించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందడం, సదరు ఉద్యోగులు పలు ఆరోపణలు వంటివి అధికారుల దృష్టికి వచ్చాయి. దీంతో కమిషనర్ శశాంక బల్దియా పాలనను గాడిన పెట్టేందుకు కొరడా ఝుళిపిస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పలువురు ఉద్యోగులను డిమోషన్ చేసి, కంప్యూటర్ ఆపరేటర్లను అంతర్గత బదిలీలు చేశారు. కాగా ఐదేళ్లుగా బిల్ కలెక్టర్లను, కంప్యూటర్ ఆపరేటర్లను కదిలించిన సందర్భాలు లేవు. కారణం.. ఉత్తర్వులు వెలువడకముందే రాజకీయ ప్రమేయంతో ఆగిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో సాహసోపేత నిర్ణయంతో పలువురు ఉద్యోగులపై చర్యలు చేపట్టారు. దీంతో బల్దియా కార్యాలయంలో పనిచేస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఆర్ఐ, బిల్ కలెక్టర్లకు డిమోషన్ నగరపాలక సంస్థకు గుండెకాయలాంటి రెవెన్యూ విభాగంలో నిలువెల్లా నిర్లక్ష్యం ఆవహించింది. ఇంటిపన్నుల వసూలు, అసెస్మెంట్లు, మోటేషన్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటికితోడు ఇంటిపన్నుల వసూళ్లకు కదలకపోవడం ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఈ కారణాలను దృష్టిలో పెట్టుకుని పలుమార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులను మందలించినా.. మార్పు రాకపోవడంతో వేటుపడింది. మున్సిపల్లో ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న ఆంజనేయులు క్లర్క్‌గా డిమోషన్ అయ్యారు. పన్నుల వసూలు విషయంలో నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తిచేయకుండా గతంలో షోకాజ్ నోటీసులు అందుకున్నా పనితీరులో మార్పు కనిపించని బిల్కలెక్టర్లు నర్సయ్య, శశికుమార్, ప్రణీత్, మల్లేశంను విధుల నుంచి తొలగించారు. అదే బాటలో నడుస్తున్న మరికొంత మంది రెవెన్యూ సిబ్బందిపై కూడా త్వరలో వేటు పడుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు కదిలిన సీట్లు కొద్ది సంవత్సరాలుగా ఆయా విభాగాల్లో పాతుకుపోయిన కంప్యూటర్ ఆపరేటర్ల సీట్లు ఎట్టకేలకు కదిలించారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆపరేటర్లతోపాటు అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఆపరేటర్లను సైతం అంతర్గత బదిలీలు చేశారు. ఆరోపణలు ఉన్నవారిని కాకుండా అందరినీ ఒకేగాటిన కట్టడంతో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఔట్సోర్సింగ్ ద్వారా నియామకమై ఒక సెక్షన్లో 15ఏళ్లుగా, మరో సెక్షన్లో 10 ఏళ్లుగా పనిచేస్తూ తమకు ఎదురులేదన్నట్లు ఉన్నవారికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. గతంలో ఎంతమంది కమిషనర్లు అంతర్గత బదిలీలకు ప్రయత్నించినా రాజకీ య ఒత్తిడి మేరకు వెనక్కితగ్గారు. ఈసారి కూడా రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒత్తిళ్లకు తలొగ్గుతారా..? ఉత్తర్వులకు కట్టుబడి ఉంటారా..? వేచి చూడాల్సిందే.. అధికారులపై చర్యలు లేవా..? నగరపాలక సంస్థలో చిన్న ఉద్యోగులపైనే కొరడా ఝుళిపిస్తున్నారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలకు వెనుకాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ... పలుమార్లు టెండర్ల రద్దుకు కారణమవుతున్న వారిపై, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, ఇంజినీరింగ్ సెక్షన్లో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, వారిపై కూడా చర్యలు చేపట్టాలనే వాదనలు వినవస్తున్నాయి. ఏది ఏమైనా బల్దియాలో ఆరంభమైన ప్రక్షాళన అవినీతి, నిర్లక్ష్యపు ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. -
హైదరాబాద్‌కు బదిలీ నై
స్పౌస్ కేటగిరీ కింద బదిలీలకు ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: జీవిత భాగస్వామి (స్పౌస్) విభాగంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని కార్యాలయాలకు మాత్రం బదిలీలను నిరాకరించింది.అయితే హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలోని ఉద్యోగులు బయటి ప్రాంతాలకు బదిలీ పొం దేందుకు అనుమతించింది. అలాగే హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు ఉద్యోగుల బదిలీలను మాత్రం అనుమతించిం ది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శనివారం ఉత్తర్వులిచ్చారు. లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్(అంతర్ జిల్లా)కు బదిలీలతోపాటు జిల్లాలో అంతర్గత (ప్రస్తుత లోకల్ కేడర్ లోపే) బదిలీలకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. జీవిత భాగస్వామి కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు, రాష్ట్రస్థాయి ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగయితే సదరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను స్పౌస్ కేటగిరీ కింద బదిలీ చేసేందుకు అర్హులుగా పరిగణిస్తారు. స్పష్టమైన ఖాళీ పోస్టుల్లోనే వీరిని బదిలీ చేస్తారు. లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్‌కు బదిలీ అయితే సం బంధిత ఉద్యోగికి సీనియారిటీలో చివరి స్థానాన్ని కల్పిస్తారు. విజ్ఞప్తిపై బదిలీ అయ్యేవారికి బదిలీ రవాణా భత్యం(టీటీఏ),కరువు భత్యం(డీఏ) సదుపాయం ఉండదు. స్పౌస్ కేటగిరీ బదిలీలపై సచివాలయంలో ప్రభుత్వశాఖలు, హెచ్ఓడీలు, జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.