సిగరెట్ల లారీ నిలిపివేత
బీవీపాళెం(తడ): ఇటీవల వైజాగ్‌లో గోల్డ్ఫ్లాక్ సిగరెట్ల లారీ అపహరణకు గురైన నేపధ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం తనిఖీలు నిర్వహించిన తడ ఎస్ఐ సురేష్‌బాబు బీవీపాళెం చెక్æపోస్టు వద్ద ఓ కంటైనర్‌ని పట్టుకున్నారు. నాగాలాండ్ నుంచి చెన్నై వెళుతున్న ఈ కంటైనర్‌లోనూ గోల్డ్ఫ్లాక్ సిగరెట్లు తరలిస్తూ ఉండటంతో అనుమానంతో రికార్డులు స్వాదీనం చేసుకుని లారీని చెక్‌పోస్టు వద్ద నిలిపారు. ఈ లారీ, సరుకుకి సంబందించి పూర్తి వివరాల కోసం యజమానిని తడకు పిలిపించారు. వివరాలు తెలిపిన తరువాత లారీని పంపుతామని ఎస్ఐ తెలిపారు.