క్షేమంగా వెళ్లిరండి
నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు
హజ్ యాత్రికులకు వాక్సినేషన్
కాశిబుగ్గ : ముస్లిం సోదరులు హజ్ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని రావాలని నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. వరంగల్ హజ్ సొసైటీ అధ్యక్షుడు సర్వర్ మోహినొద్దీన్ అధ్యక్షతన ఎల్బీనగర్లోని క్రిస్టల్ గార్డెన్లో శనివారం హజ్‌యాత్రికుల కోసం వైద్యశిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా యాత్రికులకు వ్యాక్సిన్లు వేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుధీర్‌బాబు హాజరై, మాట్లాడారు. అల్లా దయతో హజ్ యాత్ర ఆనందకరంగా జర గాలని ఆకాంక్షించారు. యాత్రికులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శిబిరంలో డాక్టర్లు యాకూబ్‌పాషా, సాజిద్, ఖాజాహసన్, సొసైటీ ప్రతినిధులు హుస్సేన్ పాషా, జి.ఫర్మా, సుగుణాదేవి, ఎస్.వాణి, జి.రమాదేవి, మసియొద్దీన్, మౌలానా సఫీయోద్దీన్, ఖాస్మి, యూసఫ్, జావిద్, మినోహజ్, సైఫోద్దీన్, మసూద్, హఫిజోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.