రాందేవ్‌పై రూ.1000 కోట్ల పరువునష్టం దావా!
అహ్మదాబాద్: రాహుల్ గాంధీపై హనీమూన్ వ్యాఖ్యలతో బాబా రాందేవ్ దళితులకు పరువునష్టం కలిగించారంటూ అహ్మదాబాద్‌కు చెందిన ఓ ఎన్జీవో ఇక్కడి సివిల్ కోర్టులో రూ.1000 కోట్లకు పౌర పరువునష్టం దావా వేసింది. దళిత సామాజిక వర్గం, ముఖ్యంగా దళిత స్త్రీల పరువుకు భంగం కలిగించేలా రాందేవ్ వ్యాఖ్యలు చేశారని అంబేద్కర్ కార్వాన్ అనే ఎన్జీవో అధ్యక్షురాలు రత్నా వోరా పిటిషన్లో పేర్కొన్నారు. రాందేవ్ వ్యాఖ్యలు మొత్తం దళిత వర్గానికే పరువునష్టం కలిగించాయని, దేశంలో ప్రస్తుతం ఉన్న 28 కోట్ల మంది దళితులకూ ఆయన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ పరిహారం మొత్తాన్ని దేశంలోని దళితుల సంక్షేమానికి వెచ్చించాలని కోరారు.