వజ్ర బస్సులను ప్రారంభించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గురువారం వజ్ర బస్సులు ప్రారంభించారు. అలాగే ఆర్టీసీ ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఇవాళ మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో వరంగల్, హైదరాబాద్-నిజామాబాద్ మధ్య వజ్ర బస్సులను సీఎం ఆరంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రమాదాల శాతం తక్కువ అని, ఆర్టీసీపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. తాను రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ లాభాల్లో ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. మరిన్ని నగరాలకు వజ్ర బస్సులను ప్రవేశపెడతామని కేసీఆర్ తెలిపారు.
వజ్ర బస్సులను కరీంనగర్, మంచిర్యాల, రామగుండం కూడా నడపాలని అన్నారు. అలాగే జీహెచ్ఎంసీ నుంచి రెగ్యులర్‌గా సిటీ ఆర్టీసీకి, ఆర్టీసీ అప్పులను ప్రభుత్వం నుంచి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్లో కేటాయించిన రూ.వెయ్యికోట్లు విడుదలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
కొత్తగా ప్రవేశపెట్టిన ఏసీ మినీ వజ్ర బస్సులు 60, నాన్ ఏసీ మినీ పల్లెవెలుగు బస్సులు 50 ఉన్నాయి. సూపర్‌లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులు 190 ఉన్నాయి. వేసవిలో రద్దీ పెరిగినందున కొత్త బస్సుల అవసరం ఎంతో ఉంది. ఇప్పటికే సగానికిపైగా వేసవి గడిచిపోయినందున మిగిలిన రోజుల రద్దీ కనుగుణంగా కొత్త బస్సులను వెంటనే డిపోలకు కేటాయించారు.