మీసం కోసం.. చెవి పోగొట్టుకున్నాడు!!
మీసం గురించి జరిగిన గొడవలో.. ఓ మాజీ సైనికుడు తన చెవి పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటన పాట్నా జిల్లాలో జరిగింది. నంకు, బీనాయాదవ్ అనే ఇద్దరు సోదరులు, స్నేహితులు, ఇరుగుపొరుగులు కలిసి రామానుజ్ వర్మ ఎడమ చెవిని కోసేశారని పోలీసులు తెలిపారు. ముందురోజు రాత్రి వాళ్లంతా కలిసి మద్యం సేవించారు. అన్నదమ్ములిద్దరూ కలిసి ఎన్నాళ్లుగానో రామానుజ్ వర్మ ఇష్టంగా పెంచుకుంటున్న మీసం గురించి అతడిని ఏడిపించారు.
ఆర్మీలో రిటైరైన తర్వాత తాను చేస్తున్న పని నుంచి తిరిగి కౌరియా గ్రామంలోని ఇంటికి వెళ్లతుండగా మళ్లీ సోదరుల మధ్య గొడవ జరిగింది. దాంతో ఇద్దరు సోదరులు కలిసి రామానుజ్ ఎడమచెవిని పదునైన ఆయుధంతో కోసేశారు. దీనిపై వర్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేశారు. అతడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితులిద్దరూ సంఘటన జరిగినప్పటినుంచి పరారీలో ఉన్నారు. వాళ్లకోసం పోలీసులు గాలిస్తున్నారు.