నెమలికి నేర్పిన నడకలివి..
కూచిపూడి, భరతనాట్యం, జానపదం నత్య ప్రక్రియ ఏదైనా సరే.. సుందరంగా, సుమనోహరంగా ప్రదర్శిస్తుంది కిరణ్మయి. నెమలి నడకలు, సెలయేటి గలగలలు రసరంజితమైన అడుగుల కలబోసి పలు భంగిమల నత్యాలతో అలరిస్తోంది ఈ యువ నత్య కళాకారిణి. అందెల రవళులతో అందర్నీ మంత్ర ముగ్ధం చేస్తున్న ఈ చిన్నారి అరవై వరకూ అవార్డులు దక్కించుకోవటం విశేషం. చదువుకుంటూనే నత్యకళాకారులకు శిక్షణలు ఇస్తూ వేదికలపై ప్రదర్శనలిస్తూ రాణిస్తోంది. –విశాఖ–కల్చరల్
నగరంలో ఆరిలోవ ప్రాంతంలో నివసిస్తున్న కిరణ్మయి తల్లి ప్రసన్న లక్ష్మి కుమార్తెకుSనత్యంపై ఉన్న అభినివేశాన్ని గమనించి మూడేళ్ల వయసులోనే నత్యంలో మొహిద్దీన్ బాషా మాస్టర్ వద్ద శిక్షణ ఇప్పించారు. ఇప్పుడామె జాతీయ స్థాయిలో కూచిపూడి నత్య ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగింది. కిరణ్మయి ప్రిజమ్ డిగ్రీ కాలేజీలో బీకాం (ఆనర్స్) ప్రథమ సంవత్సరం చదువుతోంది.
కిరణ్మయి ఇటు చదువులోనూ, అటు నత్యంలోనూ రాణిస్తోంది. కిరణ్మయి నత్యాంజలి అనే సాంస్క తిక కళానిలయాన్ని స్థాపించి ఇక్కడ 20 మంది పిల్లలకు కూచిపూడి, భరత నాట్యం, జానపదం, సంగీతం వంటి కళలపై చిన్నారులకు శిక్షణ ఇస్తోంది.
నాట్య కౌముది పురస్కారం
నగరస్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు నిర్వహించిన కూచిపూడి, భరతనాట్యం, పోటీల్లో ప్రతిభ కనబరచి జాతీయ స్థాయిలో ప్రతిభను చాటుతోంది. ఇటీవల ఏలూరులో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో ప్రథమస్థాయిలో నిలిచి ‘నాట్యకౌముది’యువ పురస్కారాన్ని పొందింది. ఇంకా వందకు బహుమతులు అందుకున్నారు. తిరుపతి, ఢిల్లీ, చండీగఢ్, పంజాబ్ తదితర ప్రదేశాల్లో నాట్య ప్రదర్శనలు చేసి ఎందరో ప్రముఖుల నుంచి సత్కారాలు, అభినందనలు అందుకున్నారు.
కళలపై ఆసక్తి
భారతీయ సంస్కతి, సంప్రదాయాల పట్ల నేటితరం తల్లిదండ్రుల్లో ఆసక్తి పెరుగుతోంది. నత్య శిక్షణలో మాస్టర్ డిగ్రీ చేయాలని కిరణ్మయి ఆశిస్తోంది. తన ఆశయాన్ని నెరవేర్చాలన్నదే నా సంకల్పం. అందువల్లే, చిన్నారులకు చక్కని తర్ఫీదు ఇచ్చి తీర్చిదిద్దగలుగుతోంది.
–ప్రసన్న లక్ష్మి, నత్యాంజలి ప్రధాన కార్యదర్శి
ఏకాగ్రత పెరుగుతుంది
కూచిపూడి, భరత నాట్యంలో తెలుగు యూనివర్శిటీలో డిప్లమా చేశాను. ప్రస్తుతం సిద్ధేశ్వర యోగి కూచిపూడి కళాక్షేత్రం (కూచిపూడిగ్రామం)లో యక్షగాన డిగ్రీ కరస్పాండెంట్ కోర్సు చేస్తున్నాను. ఏయూ యోగా విలేజ్లో డిప్లమా కోర్సు కూడా చేస్తున్నాను. వత్తి, చదువుకు ఆటంకం రాదు. నత్య సాధనతో ఏకాగ్రత, క్రమశిక్షణ పెరుగుతుంది.
–కిరణ్మయి