clay pots
-
Summer Season: మట్టికుండ.. సల్లగుండ!
రాను రాను.. ఎండకాలం చాలా ముదురుతోంది. వేసవిలో పడే తిప్పలు అంతింతా కాదు. చెప్పడానికి కూడా మాటలురాని విధంగా ఓ వైపు దాహం దారుణంగా వెంటాడుతూంటుంది. ఇలాంటి దాహానికి చల్లని నీళ్లు తప్ప మరేది తాగిన ఉపశమనం లభించదనే విధంగా వేసవి విజృంభిస్తుంది. కానీ నీళ్లు మరీ చల్లగా ఉన్నా ఇబ్బందే.. చల్లగా లేకున్నా ఇబ్బందే. ఇప్పుడు కొనసాగుతున్న కాలానికి చాలా ఇళ్లల్లో ఫ్రిడ్జ్ సదూపాయాలు కలవు. మరీ చల్లటి నీరు, అందులో.. ఫ్రిడ్జ్‌లోని మెనస్ డగ్రీల వద్ద చల్లబడ్డ నీళ్లను తాగినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.., అందుకు బదులుగా కుండలో నిల్వచేయబడ్డ నీళ్లు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతాయని నిపుణుల సూచనలు. ఇందుకు అనుగుణంగానే వేసవి కారణంగా మార్కెట్లలో మట్టికుండ విక్రయాలు భారీగా పెరిగాయి. వేసవిలో మట్టి కుండ చల్లని నీరందిస్తూ దాహార్తి తీరుస్తుంది. కాలక్రమంలో దీని వినియోగం నామోషీగా మారి, ఫ్రిడ్జ్ రాజ్యమేలుతున్నా.. మట్టి కుండ మాత్రం తన ఉనికి కోల్పోలేదు. ఆరోగ్యానికి ఉపయోగమని భావిస్తున్న చాలామంది వినియోగిస్తున్నారు. ఏటా వేసవిలో కుండలు ఆరోగ్య విషయంలో తమవంతు ప్రాధాన్యతను చాటుకుంటున్నాయి. ట్యాబ్‌లతో కూడిన రాజస్థాన్ కుండలు, మట్టి వాటర్ బాటిల్స్, కూజాలు, రంజన్లపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువవుతుండడంతో వాటి వ్యాపార స్థాయి కూడా పెరిగింది. ఈవిషయంలో కుండల తయారీదారులు సరికొత్త డిజైన్లు సృష్టిస్తుంటే.., అమ్మకందారులు మార్కెట్లలో అమ్మడానికి సిద్ధమవుతున్నారు. ఇవి చదవండి: సమ్మర్లో ఈ రైస్ తింటే..లాభాలే..లాభాలు! -
ఒకప్పుడు పేదల ఇంటి అవసరం.. ఇప్పుడు ఇంట్లో అలంకారంగా!
Creative Ideas: మట్టి పాత్రలు ఒకప్పుడు పేదల ఇంటి అవసరంగా ఉండేవి. ఇప్పుడు ధనవంతుల ఇళ్ల అలంకారాలుగా మారాయి. ఇంటి అలంకరణలో మట్టి అందాలు దండిగా చేరి నిండుదనాన్నిస్తున్నాయి. వెనకటి రోజులను మళ్లీ నట్టింట చూసుకోవడానికి పట్టణ జీవి మట్టి రూపాలను ఎంచుకుంటున్నాడు. అందుకేనేమో మట్టి.. రంగులద్దుకొని మరీ ముస్తాబవుతోంది. కుండల దొంతర.. సమృద్ధికి కుండల దొంతరలనూ ఓ గుర్తుగా చూస్తుంది ప్రాచీన భారతీయం. ఇప్పుడు ఆ కుండలు ఇల్లాలి చేతిలో ఓ కళగా మారి ఇల్లంతా రాజ్యమేలు తున్నాయి. మంచి నీటి కూజాల దగ్గర్నుంచి .. లివింగ్ రూముల్లో ఆర్ట్ కాన్వాస్‌గా.. బాల్కనీల్లో మొక్కలను ఆవరిస్తున్న తొట్టెలు చేరి ఇంటి కళనే మార్చేస్తున్నాయి. వంటపాత్రల హంగామా.. వంట కోసం ఇత్తడిని రీప్లేస్ చేసిన అల్యూమినియం జమానా కూడా పోయి మట్టి పాత్రల ఎరా మొదలైంది. వీటి శోభ వంట గట్టు మీద సరే... డైనింగ్ టేబుల్ మీదా విరాజిల్లుతోంది.. గ్లాసులు, బాటిళ్లుగా! జల్లెడలు, జ్యూసర్లు, ప్లేట్లు, ఇడ్లీ పాత్రలు... ఒక్కటని ఏంటి ఇంట్లో అవసరాలకు ఉపయోగపడే పాత్రలన్నీ మట్టి రూపాలై పెద్ద పెద్ద షాపింగ్మాల్స్లలోనూ దర్శనమిస్తున్నాయి. ఇందులో టెర్రకోటానే ఆధిపత్యం చూపుతున్నా అక్కడక్కడా మన ప్రాంతీయ నల్ల మట్టీ మెరుస్తోంది. మట్టి సవ్వడి.. అల్యూమినియం, స్టీల్‌తో తయారైన హ్యాంగింగ్ బెల్స్ చేసే సవ్వడి మనకు తెలిసిందే. కానీ, గుడిలో గంటల మాదిరిగా రూపుదాల్చుకున్న మట్టి గంటల అమరికా ఇంటి ముందు కొత్త అందానికి తోరణంగా నిలుస్తోంది. బొమ్మల కథ.. మట్టి గణేశుడు మరెన్నో రూపాలకు ప్రేరణ ఇచ్చాడు. రాజా–రాణి ఫేస్ మాస్క్‌లు, వెల్కమ్ బొమ్మలు గోడపైన హొయలొలికిస్తున్నాయి. ఇండోర్ ప్లాంట్స్ కోసం తొట్టెలుగానూ సరికొత్త మట్టిరూపాలు కొలువుదీరుతున్నాయి. ఈ మట్టి రూపాలకు పెద్ద మొత్తంలో ధర పెట్టాల్సిన అవసరం లేదు. వందల రూపాయల్లోనే దొరుకుతున్నాయి. రోజూవారీ వాడకంలో.. ఇంటి అలంకరణలో మేలైనవిగా నిలుస్తున్నాయి. Interior Decor: చేటలో ప్లాంట్.. బాల్కనీకి పల్లె సొగసు.. వెదురు అందం! -
ఊరెళితే మొక్కలకు నీళ్లు పెడతాయి!
అర్జంటుగా ఊరెళ్లాలి.. వారం, పది రోజుల వరకూ మళ్లీ ఇంటికొచ్చే అవకాశమే లేదు. పెరట్లో మొక్కలు నీళ్లులేక చచ్చిపోతాయేమో! మహా నగరాల్లోని అపార్ట్మెంట్ల నుంచి.. పల్లెల్లోని ఇంటి పెరళ్ల వరకూ ఈ సమస్య గురించి మనం చాలాసార్లు వినే ఉంటాం. ఇరుగు పొరుగును అప్పుడప్పుడూ మొక్కలకు నీళ్లు పెట్టమని చెప్పడమో.. అపార్ట్మెంట్లలోని మొక్కలన్నీ వరండాల్లోకి తీసుకొచ్చి నీళ్లుపెట్టే బాధ్యతను వాచ్‌మెన్‌కు అప్పగించడమో.. సాధారణంగా మనం చేసే పని. కానీ ఫొటోలో కనిపిస్తున్న.. ఇలాంటి కూజాలు మీ దగ్గరున్నాయనుకోండి... ఈ సమస్య ఇట్టే మాయమైపోతుంది. ఒకట్రెండు వారాలు కాదు.. ఏకంగా నెలరోజులపాటు మొక్కలకు నీళ్లు పడుతుంది ఈ ‘క్లయోలా’. దాదాపు 20 లీటర్ల బకెట్‌ను కొంచెం ఎత్తులో పెట్టి... దానికి క్లయోలా కూజాలను కలిపితే చాలు.. మిగిలినదంతా ఆటోమెటిక్‌గా జరిగిపోతుంది. కూజాల్లోకి చేరే నీరు... మట్టిలోని అతిసూక్ష్మమైన కంతల ద్వారా చెమ్మగా మారుతుంది. ఆ చెమ్మ నుంచి మొక్కల వేళ్లు నీళ్లు అందుకుంటాయి. చాలా సింపుల్‌గా అనిపించే ఈ క్లయోలా కూజాలను ఈజిప్టుకు చెందిన రామీ హలీమ్ అనే వ్యక్తి అభివృద్ధి చేశారు. ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో ఒకప్పుడు విరివిగా వాడిన ఒల్లా అనే మట్టిపాత్రల డిజైన్ ఆధారంగా ఈ క్లయోలా తయారైంది. ఒక్కో క్లయోలా కూజా దాదాపు మూడు అంగుళాల వెడల్పు, ఐదంగుళాల పొడవు మాత్రమే ఉంటుంది. దాని మూతపై రెండు గొట్టాలు వ్యతిరేక దిశలో ఉంటాయి. మొక్కలకు ఎల్లప్పుడూ కావాల్సినంత నీళ్లు మాత్రమే అందుతాయి. కూజాలకు మూతలు ఉండటం వల్ల నీరు ఆవిరి రూపంలో వృథా అయ్యేది కూడా ఉండదు. కుమ్మర్ల పనితనానికి మచ్చుతునకలుగా కనిపించే ఈ ప్రత్యేకమైన మట్టి కూజాలు ఆరింటి ఖరీదు దాదాపు 30 డాలర్లు. అంటే సుమారు 2 వేల రూపాయలు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పేదల ఫ్రిజ్‌కు భలే గిరాకీ..!
జోరందుకున్న మట్టికుండల విక్రయాలు ఆకట్టుకుంటున్న రాజస్థాన్ మట్టి కుండలు, కూజాలు బళ్లారి అర్బన్ : వేసవి దృష్ట్యా బళ్లారిలో మట్టి కుండలు, కూజాల వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే రాజస్థాన్ జోధ్‌పూర్‌కు చెందిన బల్దేవ్జీ, బన్సీలాల్ వ్యాపారులు రాజస్థాన్ నుంచి లారీల ద్వారా వివిధ రకాల మట్టి కుండలను తీసుకువచ్చి విక్రయాలు చేస్తున్నారు. స్థానిక ఎస్పీ సర్కిల్లోని జైల్గోడ పక్కన బల్దేవ్ ఇప్పటికే రెండు లోడ్ల మట్టి కుండలను విక్రయించారు. నగరంలో వివిధ ప్రాంతాల్లోని కుమ్మరి వ్యాపారులు తయారు చేసిన కుండలు, కూజాలతో పాటు వడ్రబండ, కుమ్మరవీధిలో, కౌల్‌బజార్ కుంబర వీధిలలో మట్టి కుండలు విక్రయిస్తున్నారు. మట్టి కుండలు రూ.100ల నుంచి రూ.350ల వరకు సైజ్‌ను బట్టి స్టాండ్‌తో పాటు అమ్మకాలు చేపట్టారు. నగరంలో ఎండలు అధికం కావడంతో చల్లటి నీటి కోసం అలమటిస్తున్నారు. ఫ్రిజ్ నీరు కన్నా మట్టికుండలోని నీరు శ్రేష్టమని, ఉత్తమ ఆరోగ్యానికి మట్టి కుండలు మేలు కావడంతో ఈ వ్యాపారం జోరుగా సాగుతోందన్నారు.