రోడ్డు నిర్మాణం.. ప్రచారాస్త్రమే !
బెజ్జూర్, న్యూస్‌లైన్ : ప్రజాప్రతినిధులు.. ప్రభుత్వాలు.. స్థాని క ప్రజాప్రతి నిధులు మారి నా రోడ్డు సమస్య తీరడం లేదు. ఎన్నికల సమయంలో ప్ర చారాస్త్రంగా మారుతూనే ఉంది. ఇచ్చిన హామీలను నాయకులు మర్చిపోతూనే ఉన్నా రు. మండలంలోని ఎర్రగుంట, నందిగాం, మొర్లిగూడ, జిల్లేడ గ్రామాల ప్రజలు దీర్ఘకాలంగా సరైన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నా రు. పాపన్‌పేట నుంచి మొర్లిగూడ వరకు 12కిలోమీటర్ల దూరం ఉంటుంది.
ఆరు కిలోమీట ర్ల మేర అటవీ శాఖ భూమి ఉంది. మొర్లిగూడ పక్కనే జిల్లేడ, నందిగాం గ్రామాలున్నాయి. మొర్లిగూడ, జిల్లెడ గ్రామాల్లో 2000 మంది జ నాభా ఉండగా.. వీరిలో 1,070 మంది ఓటర్లు ఉన్నారు. అందరూ గిరిజనులే. పాపన్‌పేట్ గ్రామం నుంచి అటవీ ప్రాంతంలో రో డ్డు ని ర్మాణం చేపడితే సమస్య తీరిపోతుంది. బస్సు సౌకర్యమూ కలుగుతుంది. కానీ రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అనుమతి లభించడం లేదు.
రెండేళ్ల క్రితం ఎమ్మెల్యే నిధుల నుంచి మట్టి రోడ్డు వేసినా అటవీ శాఖ పరిధిలోని భూ మి వరకు రాగానే నిలిపివేశారు. ఎన్నికల సమయంలో నాయకులు ఇస్తున్న హామీలు ఇప్పటి కీ నెరవేరడం లేదు. బెజ్జూరుకు 20 కిలోమీటర్ల దూరంలోని ఎర్రగుంట గ్రామంలో 400 మం ది జనాభా ఉన్నారు. అక్కడ ఇప్పటికీ కరెం టు, రోడ్డు, నీటి సమస్య తీవ్రంగా ఉంది.
పెంచికల్‌పేట నుంచి ఎర్రగుంటకు రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ఆరు కిలోమీటర్లు కాలినడ క, ఎడ్లబండిపై వెళ్తున్నారు. సమస్యలు పరిష్కరించే వారికే ఓటు వేస్తామని ఆయా గ్రామాల ప్రజలు తేల్చిచెబుతున్నారు.