cleavage
-
FIFA: అందాల విందు కష్టమే.. అసభ్యకర దుస్తులు ధరిస్తే జైలుకే
మరో మూడురోజుల్లో సాకర్ సమరం మొదలుకానుంది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఈసారి అరబ్ దేశాల్లో ఒకటైన ఖతార్‌లో జరగనుంది. ఈ మెగా సమరాన్ని వీక్షించేందుకు అన్ని దేశాల అభిమానులు ఇప్పటికే ఖతార్ బాట పట్టారు. అమెరికా, యూకే లాంటి దేశాల నుంచి చాలా మంది అభిమానులు ఖతార్‌కు చేరుకున్నారు. ఇక మ్యాచ్‌లు మొదలయితే ఆ కిక్కు వేరుగా ఉండనుంది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరగనుంది. దాదాపు నెలరోజులపాటు జరగనున్న ఈ సమరం ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు. ఇక ఫిఫా వరల్డ్‌కప్ జరిగిన ప్రతీసారి మహిళలు, యువతులు తమ అందచందాలతో అదనపు ఆకర్షణగా నిలుస్తుంటారు. కానీ ఇస్లాం దేశాల్లో ఒకటైన ఖతార్‌లో మాత్రం మహిళల అందాల కనువిందు కష్టమే. ఇస్లాం దేశాల్లో ఒకటైన ఖతార్‌లో సంప్రదాయాలకు విలువెక్కువ. మాములుగా ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు అభిమానులు ఎలాగైనా రావొచ్చు. లిక్కర్ కూడా అన్లిమిటెడ్. ఇక మ్యాచ్ చూసేందుకు వచ్చే యువతులు, మహిళలు బాడీపార్ట్స్ కనిపించేలా దుస్తులు వేసుకురావడం చూస్తునే ఉంటాం. ఇవన్నీ మిగతా దేశాల్లో నడుస్తుందేమో కానీ ఇస్లాం మతం గట్టిగా ఫాలో అయ్యే అరబ్ దేశాల్లో ఇలాంటివి నిషేధం. వాస్తవానికి అరబ్ దేశాల్లో మద్యపానం బహిరంగ నిషేధం. అయితే ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్‌కు ఒక మిడిల్ ఈస్ట్ దేశం తొలిసారి ఆతిథ్యం ఇస్తుండడంతో మరి కటువుగా ఉంటే పరిస్థితులు మారిపోతాయని పసిగట్టిన ఖతార్ దేశం కొన్ని నియమాలను సడలించింది. మ్యాచ్‌లకు వచ్చే ప్రేక్షకులు తమతో లిక్కర్ తెచ్చుకుంటే అనుమతిస్తామని ఖతార్ అధికార విభాగం తెలిపింది. అయితే బహిరంగంగా మాత్రం మద్యపానం ఎక్కడా అమ్మరని.. తమతో వచ్చేటప్పుడు తెచ్చుంటే ఎటువంటి అభ్యంతరం లేదని నిర్వాహకులు తెలిపారు. కానీ మ్యాచ్‌కు వచ్చే మహిళలు, యువతులు ధరించే దుస్తులపై మాత్రం కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనే మ్యాచ్‌లు వీక్షించడానికి వచ్చే మహిళలు, యువతులు కురచ దుస్తులు వేసుకొని రావొద్దని.. శరీర బాగాలు కనిపించేలా అసభ్యకరమైన దుస్తులు వేసుకొస్తే స్టేడియంలోకి అనుమతించమని.. మాట వినకుంటే జైలుకు పంపేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. అయితే ఫిఫా వెబ్సైట్లో మాత్రం మ్యాచ్ చూడడానికి వచ్చే అభిమానుల డ్రెస్ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. ఆ చాయిస్ వారికే వదిలేస్తున్నామని తెలిపింది. కానీ దేశ నిబంధనల ప్రకారం శరీర బాగాలు కనిపించకుండా దుస్తులు వేసుకొని వస్తే మంచిదని పేర్కొంది. అయితే మ్యాచ్ చూడడానికి వచ్చే మహిళా అభిమానులకు ఈ ఆంక్షలు ఇబ్బంది పెట్టేలాగా ఉన్నప్పటికి ఖతార్ దేశ నిబంధనల మేరకు నడుచుకోక తప్పదు. చదవండి: భారతీయుల అభిమానానికి మెస్సీ ఫిదా.. ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ ఎలా తయారు చేస్తారో తెలుసా? -
డొనాల్డ్ ట్రంప్ ఏకాకి
లామాల్బె(కెనడా): ఊహించినట్లుగానే జీ–7 దేశాల శిఖరాగ్ర సదస్సు వాడివేడిగా జరిగింది. మిత్ర దేశాల అల్యూమినియం, ఇనుము, వాహనాల ఎగుమతులపై అమెరికా టారిఫ్‌లు పెంచిన అంశం చర్చలను కుదిపేసింది. అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాకున్నా అమెరికా ఒక వైపు, మిగిలిన ఆరు దేశాలు మరోవైపు చీలిపోయినట్లు తెలుస్తోంది. వాణిజ్య సంబంధాల పునఃపరిశీలనకు సంబంధించి ఉమ్మడి ప్రకటన వెలువరించాలని ట్రంప్ చేసిన సూచనను మిగిలిన దేశాలు పట్టించుకోలేదని తెలిసింది. సుంకాల పెంపుతో ఇతర దేశాల్లో నెలకొన్న వ్యతిరేకతను ఉమ్మడి ప్రకటన లాంటివి దాచలేవని భావించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫలితంగా కెనడాలోని క్యూబెక్‌లో జరిగిన రెండు రోజుల సదస్సు శనివారం ప్రతిష్టంభనతోనే ముగిసింది. విభేదాలు ప్రస్ఫుటం.. వాణిజ్య యుద్ధానికి దారితీసేలా ఉన్న పరిణామాల నడుమ..రష్యాను జీ–7 కూటమిలోకి తిరిగి చేర్చుకోవాలని ట్రంప్ చేసిన ప్రతిపాదన పుండు మీద కారం చల్లినట్లయింది. ఈ సూచనను ఐరోపాకు చెందిన కూటమి సభ్యులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఆతిథ్య దేశం కెనడా ప్రధాని ట్రూడో నేతృత్వంలోని సభ్య దేశాలు ట్రంప్ నిర్ణయాన్ని అక్రమమని పేర్కొన్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ ఇమాన్యుయేల్ స్పందిస్తూ..చర్చలు నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా జరిగాయని అన్నారు. వాణిజ్యం క్లిష్ట వ్యవహారంగా మారిందని, అయినా అన్ని దేశాలు అభివృద్ధిచెందేందుకు మార్గాలున్నాయని తెలిపారు. భద్రతా కారణాలతో ఇతర దేశాల వస్తువులపై సుంకాలు పెంచామన్న ట్రంప్ వాదనను కెనడా తోసిపుచ్చింది. తమ ఎగుమతులతో అమెరికాకు ముప్పు ఉందని పేర్కొనడం సమర్థనీయం కాదని తిప్పికొట్టింది. వాణిజ్యం, పర్యావరణం, ఇరాన్ ఒప్పందం తదితరాలపై ట్రంప్ వైఖరిని తప్పుపట్టిన యూరోప్ దేశాలు..తామూ అమెరికాపై ప్రతిచర్యలకు దిగుతామని హెచ్చరించాయి. -
మండిపడ్డ దీపిక.. పలువురి మద్దతు
మహిళలను.. ముఖ్యంగా హీరోయిన్లను చూసే దృక్కోణం మారాలంటూ దీపికా పదుకొనే తీవ్రంగా స్పందించారు. తన వస్త్రధారణ విషయంలో ఓ ప్రముఖ దినపత్రిక వ్యవహరించి తీరును దులిపి పారేసింది. ఆమెకు ఒక్కసారిగా అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తింది. బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, దర్శకుల దగ్గర నుంచి సామాన్య ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరూ దీపికకు, ఆమెతో పాటు మొత్తం నారీ లోకానికి అండగా నిలబడ్డారు. తన వస్త్రధారణపై 'ఫైండింగ్ ఫ్యానీ' హీరోయిన్ దీపికా పదుకొనే ట్విట్టర్లో గట్టిగా స్పందించారు. తాను అందాలను (ఎక్స్ పోజింగ్) ప్రదర్శిస్తూ వస్త్రాలను ధరించినట్లు వచ్చిన విమర్శలకు ఆమె చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. తాను మహిళనని, తనకు స్త్రీలకు ఉండే సహజ సౌందర్యం ఉంటుందని తెలిపారు. 'అయితే మీకేంటి సమస్య?' అని ప్రశ్నించారు. మహిళలను గౌరవించడం చేతకాకపోతే వారి గురించి మాట్లాడవద్దని సలహా ఇచ్చారు. ఆమె ట్వీట్స్ సోషల్ మీడియాలో సంచలనం రేపాయి. ఆమె వ్యాఖ్యలకు పలువురు మద్దతు పలికారు. ఆమెకు గంటలోపలే దాదాపు 15 వందల మంది స్పందించారు. ఒక మహిళ తన అందాన్ని కాస్త ప్రదర్శిస్తే, దానిని తప్పుగా భావించాలా? ఆ అందాలను అసభ్యంగా చూడాలా? స్త్రీ సహజ సౌందర్యంగా ఎందుకు భావించరు? అని పలువురు ప్రశ్నించారు. YES!I am a Woman.I have breasts AND a cleavage! You got a problem!!?? — Finding Fanny (@deepikapadukone) September 14, 2014 Dont talk about Woman's Empowerment when YOU don't know how to RESPECT Women! — Finding Fanny (@deepikapadukone) September 14, 2014 So glad @deepikapadukone stood up to the low brow trash that garbs up as entertainment news. Have they not learnt what news & 'views' mean? — Mini Mathur (@minimathur) September 15, 2014 Complimenting a lady is a grace reserved for gentlemen! I stand on a tall tall chair and applaud you @deepikapadukone — Boman Irani (@bomanirani) September 15, 2014 I just read here in Malaysia about @deepikapadukone retort to cheap sensational journalism,well done girl. — arjun rampal (@rampalarjun) September 15, 2014 Above all, be the heroine of your life, not the victim. @deepikapadukone doing just that!! (N THATS how u pay a compliment ) — Farah Khan (@TheFarahKhan) September 15, 2014 Just reading TOI Ent's coverage of @deepikapadukone Stunned. A new low. Well done, Deepika, for not letting it go. Neither shall we. — Rahul Bose (@RahulBose1) September 14, 2014 Brilliant strike @deepikapadukone. So fearless a message and truly inspiring coming from you as a role model to millions of women all over. — Nimrat Kaur (@NimratOfficial) September 14, 2014 Thank you @deepikapadukone #RESPECT — Dia Mirza (@deespeak) September 14, 2014 If you are even remotely self righteous and want to do the right thing then SUPPORT @deepikapadukone. THIS WOMAN ROCKS. — Sanjay Gupta (@_SanjayGupta) September 14, 2014 That's eve teasing of different kind...@deepikapadukone that's the way women shd stand against & protest ... — Shoojit Sircar (@ShoojitSircar) September 14, 2014 Media attacks a celeb's personal & professional life all the time but this is a new low! Tku for speaking out @deepikapadukone! #Shame #TOI — SOPHIE CHOUDRY (@Sophie_Choudry) September 14, 2014 Media attacks a celeb's personal & professional life all the time but this is a new low! Tku for speaking out @deepikapadukone! #Shame #TOI — SOPHIE CHOUDRY (@Sophie_Choudry) September 14, 2014