మండిపడ్డ దీపిక.. పలువురి మద్దతు | Deepika Padukone reacts severely over Cleavage comments | Sakshi
Sakshi News home page

మండిపడ్డ దీపిక.. పలువురి మద్దతు

Published Mon, Sep 15 2014 11:04 AM | Last Updated on Sat, Aug 25 2018 6:31 PM

దీపికా పదుకునే - Sakshi

దీపికా పదుకునే

మహిళలను.. ముఖ్యంగా హీరోయిన్లను చూసే దృక్కోణం మారాలంటూ దీపికా పదుకొనే తీవ్రంగా స్పందించారు. తన వస్త్రధారణ విషయంలో ఓ ప్రముఖ దినపత్రిక వ్యవహరించి తీరును దులిపి పారేసింది. ఆమెకు ఒక్కసారిగా అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తింది. బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, దర్శకుల దగ్గర నుంచి సామాన్య ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరూ దీపికకు, ఆమెతో పాటు మొత్తం నారీ లోకానికి అండగా నిలబడ్డారు.

తన వస్త్రధారణపై 'ఫైండింగ్ ఫ్యానీ' హీరోయిన్ దీపికా పదుకొనే ట్విట్టర్లో గట్టిగా స్పందించారు. తాను అందాలను (ఎక్స్ పోజింగ్) ప్రదర్శిస్తూ వస్త్రాలను ధరించినట్లు వచ్చిన విమర్శలకు ఆమె చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. తాను మహిళనని, తనకు స్త్రీలకు ఉండే సహజ సౌందర్యం ఉంటుందని తెలిపారు. 'అయితే మీకేంటి సమస్య?' అని ప్రశ్నించారు. మహిళలను గౌరవించడం చేతకాకపోతే వారి గురించి మాట్లాడవద్దని సలహా ఇచ్చారు.

ఆమె ట్వీట్స్ సోషల్ మీడియాలో సంచలనం రేపాయి. ఆమె వ్యాఖ్యలకు పలువురు మద్దతు పలికారు.  ఆమెకు గంటలోపలే దాదాపు 15 వందల మంది స్పందించారు. ఒక మహిళ తన అందాన్ని కాస్త ప్రదర్శిస్తే, దానిని తప్పుగా భావించాలా? ఆ అందాలను అసభ్యంగా చూడాలా?  స్త్రీ సహజ సౌందర్యంగా ఎందుకు భావించరు? అని పలువురు ప్రశ్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement