రాజీనామాపై రతన్ టాటా క్లారిటీ
న్యూఢిల్లీ : టాటా ట్రస్టుల చైర్మన్ పదవి నుంచి తను రాజీనామా చేయబోతున్నట్టు వస్తున్న వార్తాకథనాలపై రతన్ టాటా స్పందించారు. ప్రస్తుతం టాటా ట్రస్టులకు రాజీనామా చేసే ప్లాన్స్ ఏమీ లేవని తేల్చేసి, మీడియా ఊహాగానాలను కొట్టిపారేశారు. రతన్ టాటా ప్రస్తుతం టాటా గ్రూప్ తాత్కాలిక చైర్మన్‌గా కొనసాగుతున్నారని, ఈ సమయంలో టాటా ట్రస్టుల నుంచి ఆయన దిగిపోయే ఉద్దేశాలు ఏమీ లేవని గ్రూప్ కూడా ఓ ప్రకటనలో తెలిపింది. టాటా ట్రస్టుల కార్యక్రమాల్లో ఆయన తన ప్రమేయాన్ని కొనసాగిస్తారని గ్రూప్ పేర్కొంది.
ముందస్తు రిపోర్టుల ప్రకారం టాటా సన్స్‌లో 66 శాతం మెజార్టీ కంట్రోల్‌తో గ్రూప్‌ను నడిపిస్తున్న టాటా ట్రస్టులకు రతన్ టాటా గుడ్‌బై చెప్పనున్నారని, చైర్మన్ పదవి నుంచి ఆయన దిగిపోతున్నారని పలు వార్తలొచ్చాయి. వచ్చే ఏడాది ప్రథమార్థం చివరి వరకు కొత్త చెర్మన్‌ను ఎంపికచేసేందుకు టాటా ట్రస్టులు కసరత్తు కూడా చేస్తున్నాయంటూ పేర్కొన్నాయి. కానీ ఆ రిపోర్టులను కొట్టిపారేస్తూ.. టాటా ట్రస్ట్‌ల చైర్మన్ పదవి నుంచి దిగిపోయే ఉద్దేశ్యాలేమీ లేవని రతన్ టాటా ప్రకటించారు.