రేపటితో ముగియనున్న ఎస్కేయూ సెట్
ఎస్కేయూ : వర్సిటీ క్యాంపస్ కళాశాలలు, అనుబంధ పీజీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఎస్కేయూ సెట్–2017 శుక్రవారం ముగియనున్నాయి. బుధవారం కామర్స్ పరీక్ష జరగడంతో విద్యార్థులు పోటెత్తారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని బుధవారం ఉదయం జరిగిన సమీక్షా సమావేశంలో రెక్టార్ ప్రొఫెసర్ హెచ్.లజిపతిరాయ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, పరీక్ష కేంద్రాలను బుధవారం సాయంత్రం సెషన్లో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుధాకర్ బాబు పరిశీలించారు.