cloth shop
-
XL, XXLలను వినే ఉంటారు.. X ఏమి సూచిస్తుంది?
ఎవరైనా షర్ట్ లేదా టీ-షర్ట్‌ను కొనుగోలు చేయడానికి వస్త్ర దుకాణానికి వెళ్లినప్పుడు షర్టు నాణ్యత, రంగుతో పాటు కావాల్సిన సైజును ఎన్నుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి మన సైజుకు సరిపడే షర్ట్ అందుబాటులో ఉండదు. అటువంటప్పుడు ఆ సైజు షర్ట్ కోసం మరో దుకాణానికి వెళ్లాల్సి వస్తుంది. అయితే షర్ట్‌పై సైజులకు సంబంధించి XL లేదా XXL అని రాసివుండటాన్ని మీరు గమనించే ఉంటారు. దీనిలో X అనేది ఏమి సూచిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా XL(ఎక్స్ట్రా లార్జ్) సైజు షర్టు ఛాతీ కొలత 42 నుంచి 44 అంగుళాలు ఉంటుంది. నడుము పరిమాణం 36 నుంచి 38 అంగుళాలు ఉంటుంది. ఇకముందు మీరు షర్ట్ కొనడానికి వెళ్లినపుడు మీ కావలసిన సైజు ఎంతనేది తెలియనప్పుడు మీ ఛాతీ, నడుము సైజును కొలవండి. అప్పుడు మీకు కావాలసిన షర్టు సైజు ఎంతో తెలుస్తుంది. ఇక XXL విషయానికొస్తే ఇది ఎక్స్ట్రా లార్జ్ కన్నా పెద్ద సైజు కలిగినది. ఈ సైజు షర్ట్ లేదా టీ- షర్ట్ ఛాతీ కొలత 44 నుంచి 46 అంగుళాలు ఉంటుంది. నడుము పరిమాణం 38 నుంచి 40 అంగుళాల మధ్య ఉంటుంది. ఈ పరిమాణం కొద్దిగా లావుగా ఉన్నవారికి సరిపోతుంది. ఎవరైనా తమ శరీర బరువు పెరిగినప్పుడు XXL సైజు దుస్తులు వేసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా చదవండి: ‘రాధాస్వామి’ గురువు ఎవరు? సత్సంగిలు ఏమి చేస్తుంటారు? -
స్నేహితులను కలిసి వస్తానని వెళ్లిన యువతి.. ఫోన్ స్విచ్చాఫ్..
సాక్షి, కుత్బుల్లాపూర్(హైదరాబాద్): ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన శ్రీను, నాగసత్యవేణి పెద్దకుమార్తె నాగరేవతి(20) ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు సుచిత్రలోని ఓ దుస్తుల షాపులోని తన స్నేహితులను కలిసి వస్తానని చెప్పి బయటకు వెళ్లింది. అలాగే చింతల్‌లోని ఓ కళాశాలలో చదువుతున్న తన సోదరికి ఇచ్చేందుకు టిఫిన్‌బాక్స్ కూడా తీసుకు వెళ్లింది. కాగా చిన్నకుమార్తె ఫోన్ చేసిన తనకు టిఫిన్స్ బాక్స్ అందలేదని చెప్పడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు నాగరేవతి మొబైక్కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో గురువారం పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కుక్కను తప్పించబోయి అదుపుతప్పిన కారు.. ఒకరి మృతి.. మరో ముగ్గురు -
పోలీసులే దొంగలు.. పట్టేసిన సీసీ కెమెరాలు
చిత్తూరు అర్బన్: రోడ్డుపై బట్టలమ్మే దుకాణంలో ఇద్దరు కానిస్టేబుళ్లు చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు చిత్తూరులోని విజయ డెయిరీ సమీపంలో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి రోడ్డు పక్కన చిన్నపాటి వస్త్రదుకాణం పెట్టుకున్నాడు. రాత్రి మూసేసి మరుసటి రోజు దుకాణాన్ని తెరిచేవాడు. నాలుగు రోజుల క్రితం యూనిఫాం ధరించిన ఓ కానిస్టేబుల్, సివిల్ డ్రెస్‌లో ఉన్న మరో కానిస్టేబుల్ అర్ధరాత్రి దుకాణం వద్దకు వెళ్లి రెండు బండిళ్ల బట్టలను చోరీ చేశారు. మరుసటి రోజు దుకాణం వద్దకు వచ్చిన దుకాణదారుడు చోరీ అయిన విషయాన్ని గ్రహించి పక్కనే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించాడు. పోలీసులే చోరీ చేసినట్లు గుర్తించాడు. అయితే దీనిపై పోలీసులు దుకాణదారుడిని బతిమలాడడంతో అతను పోలీసులకు చేసిన ఫిర్యాదును వాపస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై గురువారం రాత్రి వన్‌టౌన్ సీఐ నరసింహారాజును వివరణ కోరగా.. ఈ విషయం తమ దృష్టికి రాలేదని, దీనిపై విచారణ చేస్తామన్నారు. ఇవీ చదవండి: ఏపీ నూతన సీఎస్‌గా సమీర్ శర్మ ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు -
బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం
నిజామాబాద్ పట్టణం గాంధీ చౌక్‌లోని బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. పట్టణంలోని గాంధీ చౌక్‌లో ఉన్న అబ్ధూల్ మజిద్‌కు చెందిన హెచ్ఎంటీ కలెక్షన్స్ అనే బట్టలషాపు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు. దాదాపు రూ. 20లక్షల ఆస్తినష్టం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది పంచనామాలో తేలింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నది ఇంకా తెలియరాలేదు.