clothes sale
-
హైదరాబాద్: మైండ్‌బ్లోయింగ్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు.. లేట్ చేయకండమ్మా!
లాట్ దసరా, దీపావళి ధమాకా ఆఫర్లు మొబైల్ రిటైల్‌రంగంలో ఏపీ, తెలంగాణల్లో వేగంగా విస్తరించిన మల్టీబ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ లాట్ మొబైల్స్ దసరా, దీపావళి ధమాకా ఆఫర్లను ప్రారంభించింది. అన్ని బ్రాండెడ్ మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్స్, స్మార్ట్ వాచెస్, హోం థియేటర్ వంటివి అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ఫైర్ బోల్ట్ కాలింగ్ వాచ్, టవర్ ఫ్యాన్, టీడబ్ల్యూఎస్ ఎయిర్ పాడ్స్, పోర్టబుల్ స్పీకర్, నెక్‌బ్యాండ్ హోం థియేటర్ కాంబో ఆఫర్లు లభిస్తాయన్నారు. స్మార్ట్ టీవీ రూ.8,999, ల్యాప్టాప్స్ రూ.17,499కే లభిస్తాయని తెలిపారు. ఆర్ఎస్ బ్రదర్స్ ఆఫర్ల వర్షం దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఆర్ఎస్ బ్రదర్స్ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ఈ పండుగలకు సంప్రదాయంతోపాటు ఆధునికత ఉట్టిపడే సరికొత్త వస్త్రాలతోపాటు నగలనూ పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచినట్లు ఆర్ఎస్ బ్రదర్స్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పర్వదినాలను తెలుగు మహిళలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. షాపింగ్ చేసిన వారికి 2.5 కేజీల బంగారం, 80 కేజీల వెండి, 150 శాంసంగ్ టీవీలు, 600 గ్రైండర్లు, 1,375 ఎలక్ట్రిక్ కుక్కర్లతోపాటు మరెన్నో బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. సౌత్ ఇండియా డిస్కౌంట్లు దసరా, దీపావళి పండుగల సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆకర్షణీయమైన డిస్కౌంట్స్‌ను అందజేస్తోంది. చీరలు, మెన్స్‌వేర్‌పై డిస్కౌంట్‌తోపాటు అతి తక్కువ తరుగుతో బంగారు ఆభరణాలను, తరుగు, మజూరీ లేని వెండి ఆభరణాలను అందుబాటులో ఉంచినట్టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్ పి.వి.ఎస్.అభినయ్ తెలిపారు. దసరా–దీపావళి లక్కీ బంపర్‌డ్రాలో భాగంగా రూ.ఆరుకోట్ల విలువైన బహుమతులను రెండువేల మంది విజేతలకు అందజేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా ఈనెల 5న, దీపావళి సందర్భంగా ఈనెల 25న బంపర్‌డ్రా ఫలితాలు వెల్లడించినున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీకి కేంద్రం భారీ షాక్! -
24 గంటల్లో గోధుమ పిండి ధర తగ్గించకుంటే దుస్తులు అమ్మేస్తా!
Pakistani Prime Minister Shehbaz Sharif given an ultimatum: వచ్చే 24 గంటల్లో 10 కిలోల గోధుమ పిండి బస్తా ధరను తగ్గించకుంటే తన బట్టలను అమ్మేస్తానని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఖైబర్ ఫక్తున్ఖ్వా ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్‌కి తన నిర్ణయాన్ని తెలిపారు. థకారా స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని షరీఫ్ ప్రసంగిస్తూ...నా దుస్తులు విక్రయించి అయిన ప్రజలకు తక్కువ ధరలో గోధుమ పిండి అందిస్తానని చెప్పారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశానికి నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణాన్ని కానుకగా ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. దాదాపు ఐదు మిలయన్ల ఇళ్లు, 10 మిలయన్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోవడమే కాకుండా దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారంటూ ఇమ్రాన్ ఖాన్‌పై విమర్శలు గుప్పించారు. తాను దేశ శ్రేయస్సు కోసం ప్రాణాలర్పించడమే కాకుండా అభివృద్ధి పథంలో ఉంచుతానని షరీఫ్ బహిరంగంగా ప్రకటించారు. బలూచిస్తాన్ ఎన్నికల గురించి మాట్లాడుతూ..ప్రజలకు తనపై విశ్వాసం ఉందని తనకు అనుకూలంగా ఓట్లు వేయడానికి పోలింగ్‌బూత్‌లకు తరలి వచ్చారని షరీఫ్ అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై ప్రజలకు గల నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ని ప్రజలు గద్ది దించుతారని గ్రహించే ఇంధన ధరలు తగ్గించారంటూ విమర్శించారు. అంతేకాదు షరీఫ్ తన సోదరుడు, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై కూడా ప్రశంసలు కురిపించారు. ఆ సభలో పీఎంఎల్-ఎన్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ కూడా ప్రసంగించడమే కాకుండా తన తండ్రి నవాజ్ షరీఫ్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. (చదవండి: షాకింగ్ వీడియో: మోనాలిసా పెయింటింగ్ ధ్వంసానికి యత్నం! మారు వేషంలో వచ్చి మరీ..) -
ఆప్కోకు రూ.58.32 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: ఆప్కాబ్(ఆంధ్రప్రదేశ్ సహకార కేంద్ర బ్యాంక్) నుంచి ఆప్కో(ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికుల సహకార సంస్థ) తీసుకున్న రూ.58.32 కోట్లకు పూచీకత్తు ఇచ్చేందుకు సర్కారు సోమవారం అంగీకారం తెలిపింది. వస్త్రాల కొనుగోలుకు రూ.52.48 కోట్లు, ముడిసరుకులు కొనుగోలుకు రూ.5.84 కోట్లు వెరసి రూ.58.32 కోట్లను ఆప్కాబ్ నుంచి రుణం తీసుకోవడానికి పూచీకత్తు ఇవ్వాలని జౌళి శాఖ కమిషనర్ పి.నరేష్ ఫిబ్రవరి 29న పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. ఆ మేరకు తీసుకున్న రుణానికి ప్రభుత్వం పూచీ కత్తు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.