సీఐఐ నుంచి ఈ కామర్స్ పోర్టల్
న్యూఢిల్లీ: భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ తాజాగా దేశీ వ్యాపార సంస్థల కోసం ఈ-కామర్స్ గేట్‌వేను ప్రారంభించింది. సీఐఐట్రేడ్డాట్కామ్ పేరిట ఈ పోర్టల్ ఏర్పాటైంది. సీఐఐలో సభ్యత్వం ఉన్న సంస్థలు ఇందులో తమ ఉత్పత్తులు, సర్వీసులను పొందుపర్చడం ద్వారా ఇటు దేశీయంగానే కాకుండా అటు అంతర్జాతీయ స్థాయిలో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకోవచ్చు.
దీని ద్వారా జరిగే లావాదేవీల వ్యయం అత్యంత తక్కువగా ఉండేట్లుగాను, విక్రేతల బ్యాంకు ఖాతాల్లోకి చెల్లింపులు...
వేగవంతంగా జరిగేట్లుగాను పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు సీఐఐ నేషనల్ ఎస్ఎంఈ కౌన్సిల్ చైర్మన్ టీటీ అశోక్ తెలిపారు. ఈ పోర్టల్‌కు క్లౌడ్బై సంస్థ సెక్యూరిటీ సేవలు అందిస్తోంది.