CM came
-
8న ముఖ్యమంత్రి రాక
అనంతపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సెప్టెంబర్ 8న జిల్లాలో పర్యటించనున్నారు. జలహారతిలో భాగంగా ఉరవకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనులకు సంబంధించి పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. పూర్తిస్థాయి షెడ్యూల్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
అమరవీరుల సంస్మరణకు భారీ ఏర్పాట్లు
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబైంది. శుక్రవారం జరిగే ఈ కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం చంద్రబాబుతోపాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొంటారు. ఇందుకోసం స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమరవీరుల స్తూపంతో పాటు భారీ వేదికను సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లను గురువారం రాత్రి సీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. – సాక్షి, విజయవాడ