చెట్టు కింద కూర్చున్నా సీఎం సీఎమ్మే!
విజయవాడ: రెండు నెలలుగా రాష్ట్ర పాలన గాడితప్పిందని ఏపి ఉద్యోగుల సంఘ నేత అశోక్ బాబు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే కుర్చీ కూడా లేదంటున్నారని విమర్శించారు. చెట్టు కింద కూర్చున్నా సీఎం సీఎమ్మే అని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రజలు హైదరాబాద్ వెళ్లకుండా విజయవాడ, గుంటూరులో ప్రతీది అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు. ప్రజలకు మెరుగైన సేవలందిస్తే సీఎం ఎక్కడ కూర్చున్నా ప్రజలకు అక్కరలేదని అశోక్బాబు అన్నారు.