సీఎం సోదరుడి అనుచరుడు అరెస్ట్
తిరుపతి : చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు ప్రధాన అనుచరుడు ద్వారకానాధ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
మరోవైపు చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం మాఫియా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లర్ల వెనక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హస్తం అందని, ఆయన సోదరుడి ప్రోత్సాహం వల్లే స్మగ్లర్లు చెలరేగిపోతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.