అమరులకు ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా నివాళి
శ్రీనగర్ : 1931లో శ్రీనగర్‌లోని సెంట్రల్ జైల్ బయట జరిగిన పోలీసు కాల్పుల్లో మరణించిన 22 మంది మృత వీరులకు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం ఆమె మృత వీరుల సమాధులను సందర్శించి అంజలి ఘటించారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అమరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ వ్యాన్లను చూస్తుంటేనే ప్రజలు భయపడుతున్నారన్నారు. కశ్మీర్లో పరిస్థితిని అంచనా వేయటంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.
మరోవైపు కశ్మీర్ లోయలో అయిదోరోజు కూడా కర్ప్యూ కొనసాగుతోంది. వేర్పాటువాద గ్రూపులు ఇచ్చిన బంద్ పిలుపుతో కశ్మీర్ లోయలో సాధారణ జనజీవనం స్తంభించింది. వేర్పాటువాద గ్రూపులు బంద్‌ను ఇవాళ్టివరకూ పొడిగించిన విషయం తెలిసిందే.