CM Narayanasamy
-
పుదుచ్చేరిలో కూలిన కాంగ్రెస్ సర్కార్
సాక్షి, చెన్నై: ఊహించని మలుపులతో రసవత్తరంగా సాగిన పుదుచ్చేరి రాజకీయాలకు తెర పడింది. బల నిరూపణలో నారాయణస్వామి సర్కార్ విఫలమయ్యింది. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. సరైనా సంఖ్యబలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సీఎం సభ నుంచి వెళ్లి పోయారు. సభ ప్రారంభమైన తర్వాత సీఎం నారాయణ స్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్ జరగకముందే ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో సభ నుంచి బయటకు వెళ్లి పోయారు. దాంతో విశ్వాసం తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్ వీపీ శివకొలందు ప్రకటించారు. బలనిరూపణలో ఓడిపోయిన సీఎం నారాయణ స్వామి రాజీనామా లేఖతో రాజ్‌భవన్‌కు బయల్దేరారు. ఈ సందర్భంగా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మీద నిప్పులు చెరిగారు నారాయణ స్వామి. కేంద్రం లెఫ్టినెంట్ గవర్నర్‌తో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని ఆరోపించారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారు ప్రజల ముందుకు ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు. 2016 ఎన్నికల్లో ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని డీఎంకేతో కలిసి కాంగ్రెస్ చేజిక్కించుకుంది. గడిచిన నాలుగున్నరేళ్లు సాఫీగానే సాగింది. ఇలా ఉండగా గతేడాది పార్టీ ఎమ్మెల్యే ధనవేల్ తిగురుబావుటా ఎగురవేశారు. ఇక నాటి నుంచి నారాయణ స్వామికి ఇబ్బందులు మొదలయ్యాయి. 33 మందితో కూడిన పుదుచ్చేరి అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు 17 మంది సభ్యుల మద్దతు అవశ్యం. అయితే, కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు రాజీనామాలు చేస్తూ వెళ్తుండడంతో ప్రభుత్వం మైనారిటీలో ప్రభుత్వం పడింది. ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామాతో కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలింది. ఈ సమయంలో ఊహించని రీతిలో ఆదివారం రాజ్‌భవన్ నియోజకవర్గ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేయడం, మరికొన్ని గంటల్లోనే మిత్ర పక్షం డీఎంకేకు చెందిన తట్టాన్ చావడి ఎమ్మెల్యే వెంకటేషన్ రాజీనామాతో నారాయణ సర్కారును ఐసీయూలోకి నెట్టినట్టు అయింది. తాజాగా నేడు నిర్వహించని బల పరీక్షలో నారాయణ స్వామి ప్రభుత్వం విఫలం అవడంతో ఆయన రాజీనామా చేశారు. -
ఐదో రోజుకు నారాయణస్వామి ధర్నా
పుదుచ్చేరి: లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి వైఖరికి నిరసనగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి రాజ్‌నివాస్ బయట చేస్తున్న ధర్నా ఆదివారం ఐదోరోజుకు చేరింది. సం క్షేమ పథకాలపై ప్రభుత్వ ప్రతిపాదనలకు బేడి ఆమోదం తెలపకుంటే నిరసనను తీవ్రతరం చేసి జైల్‌భరో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఉచిత బియ్య పంపిణీ పథకంతోపాటు మరో 39 సంక్షేమ పథకాల ప్రతిపాదనలు, పరిపాలనా సంబంధ నిర్ణయాల్ని లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బేడికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ నాయకులు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగరవేశారు. తమ నిరసన తెలిపేందుకు నల్ల జెండాలు ఎగరవేసే స్థాయికి చేరడం దురదృష్టకరమని నారాయణస్వామి పేర్కొన్నారు. విభేదాలపై ఫిబ్రవరి 21న బహిరంగ చర్చకు వస్తానని బేడి చేసిన ప్రతిపాదనను అంగీకరిస్తున్నానని చెప్పారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పుదుచ్చేరి వెళ్లి నారాయణస్వామి ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. సంక్షేమ పథకాల అమలుకు అడ్డుపడుతున్న కిరణ్ బేడిని కేంద్రం వెనక్కి పిలవాల ని డిమాండ్ చేశారు. బేడి ప్రజాస్వామిక విలు వల్ని అణగదొక్కుతున్నారని ఆరోపించారు. -
గవర్నర్‌పై కేసు పెడతాం : సీఎం వార్నింగ్
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడిపై పరువునష్టం దావా వేయనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు. అధికారుల్ని, మంత్రుల్ని బెదిరిస్తున్న కిరణ్ బేడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు తెలిపారు. పుదుచ్చేరిలో సీఎం నారాయణ స్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ భేడి మధ్య వివాదం సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది జరిగిన ప్రైవేటు కళాశాలల్లో వైద్య సీట్ల భర్తీలో అవకతవకలు గవర్నర్-సీఎంల మధ్య వివాదానికి దారి తీశాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనే అర్థంలో గవర్నర్ కిరణ్ బేడీ స్పందించారు. కాగా, శనివారం హుటాహుటిన మీడియా సమావేశం ఏర్పాటుచేసిన సీఎం నారాయణస్వామి.. బేడీ వ్యాఖ్యలను ఖండించారు. తమ ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తోన్న కిరణ్ బేడిపై పరువునష్టం దావా వేయనున్నట్టు ప్రకటించారు. ‘‘అధికారుల్ని, మంత్రుల్ని బెదిరిస్తూ, హెచ్చరికలతో ముందుకు సాగుతున్న కిరణ్ బేడీపై అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. అసలు ఆమె లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి అర్హురాలేకాదు. కానీ కేంద్రం ఆమెను మాపై పడేసింది. ఇప్పుడు మాకు ఆమె శిరోభారంగా మారింది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా, అందుకు ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేరుస్తూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు దారుణం, ఖండనీయం’’ అని సీఎం నారాయణస్వామి ఘాటుగా వ్యాఖ్యానించారు. -
ప్రసంగం రచ్చ
ముదిరిన వివాదం కిరణ్‌కు స్పీకర్ ఆహ్వానం ఆసక్తికరంగా పుదుచ్చేరి రాజకీయం సాక్షి, చెన్నై: సీఎం నారాయణస్వామి, గవర్నర్ కిరణ్ బేడీల మధ్య వివాదం పుదుచ్చేరి రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో ప్రసంగించేందుకు తాను సిద్ధం అన్నట్టుగా, స్వయంగా ప్రసంగం జాబితాను కిరణ్ సిద్ధం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు ఆ రాష్ట్ర స్పీకర్ వైద్యలింగం ఆహ్వానిండం గమనార్హం. పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వానికి పక్కలో బల్లెంగా ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ మారారు. తనకు ఉన్న అధికారాల మేరకు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. కిరణ్ చర్యల్ని తిప్పికొట్టే విధంగా ఆ రాష్ట్ర సీఎం నారాయణ స్వామి వ్యవహరిస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలను ఖాతరు చేయాల్సిన అవసరం లేదంటూ అధికారులకు సూచించి ఉన్నారు. దీంతో సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య వివాదం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో వివాదం రోజురోజుకు ముదురుతుండడంతో పుదుచ్చేరిలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశానికి సీఎం నారాయణస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ఏడాదిలో జరిగే తొలి సమావేశంలో తనకు ప్రసంగించే అవకాశం ఇవ్వాలని కిరణ్‌బేడీ స్పీకర్‌కు లేఖ రాశారు. అయితే, బడ్జెట్ సమావేశాల్లో మాత్రమే కేంద్ర పాలిత ప్రాంతాల్లోని గవర్నర్లకు సభలో ప్రసంగించేందుకు అవకాశం ఉంది. అయితే తొలి సమావేశంలో తన ప్రసంగం తప్పనిసరి అన్నట్టుగా కిరణ్ బేడీ చర్యలు ఉండడాన్ని సీఎం నారాయణ స్వామి తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరోమారు ఆ రాష్ట్ర స్పీకర్‌కు కిరణ్‌బేడీ లేఖ రాసి ఉన్నారు. ఇందుకు స్పీకర్ వైద్యలింగం ఆహ్వానం పలికి ఉండడం చర్చకు దారి తీసింది. సీఎం నారాయణ స్వామి వ్యతిరేకిస్తుంటే, స్పీకర్ ఆహ్వానించి ఉండడం అక్కడి కాంగ్రెస్ గ్రూపు వివాదాలు మళ్లీ తెరమీదకు వచ్చి ఉన్నట్టుగా పరిస్థితులు మారి ఉన్నాయి. ప్రసంగం రచ్చ: లెఫ్టినెంట్ గవర్నర్‌ను స్పీకర్ ఆహ్వానించడాన్ని సీఎం తీవ్రంగా పరిగణించి ఉన్నారు. గవర్నర్ ప్రసంగం జాబితాను స్పీకర్ కార్యాలయం తయారు చేయడం ఆనవాయితీ. దీనికి సీఎం ఆమోద ముద్ర వేసినానంతరం గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుంది. అయితే, ఇందుకు విరుద్ధంగా కిరణ్ అడుగులు సాగుతుండడంతో పుదుచ్చేరిలో వివాదం ముదిరి ఉన్నది. స్వయంగా తానే ప్రసంగాన్ని సిద్ధం చేసుకునే పనిలో కిరణ్ ఉన్నట్టు సమాచారం. కొందరు అధికారులు ఇందుకు తగ్గ కసరత్తుల్లో ఉన్నట్టు సంకేతాలు రావడంతో ఆగమేఘాలపై అసెంబ్లీ వ్యవహారాల కమిటీని సమావేశ పరిచేందుకు సీఎం నారాయణస్వామి నిర్ణయించి ఉన్నారు. ఈ నెల 18వ తేదీ బుధవారం అసెంబ్లీ వ్యవహారాల కమిటీని సమావేశ పరచి, అందులో గవర్నర్‌కు వ్యతిరేకంగా ఏదేని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో సీఎం, గవర్నర్ల వార్‌లో అధికారులతో పాటుగా స్పీకర్ కూడా నలిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉన్నది. ఈ పరిణామాలు కాస్త పుదుచ్చేరి రాజకీయాల్లో ఓ వైపు ఆసక్తికరంగా మారి ఉంటే, మరో వైపు ఈ ఇద్దరి కుమ్ములాటలపై విమర్శలు గుప్పించే పనిలో ప్రజలు నిమగ్నం కావడం గమనార్హం.