CMS survey
-
జగన్‌పై చంద్రబాబు విషప్రచారం
సీఎంపై ధ్వజమెత్తిన భూమన సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజాక్షేత్రంలో రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకే సీఎం చంద్రబాబు మీడియాను అడ్డం పెట్టుకుని కుటిల రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. జగన్ బెయిల్ వ్యవహారంలో ఓ వర్గం మీడియా పనికట్టుకుని మరీ ‘బెయిల్ రద్దు’ అయిం దంటూ ఊహాత్మక కథనాలను ప్రసారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో కరుణాకర్‌రెడ్డి మాట్లాడారు. ఇంటి నుంచి కోర్టుకు వెళ్లడానికి జగన్ బయలుదేరినప్పటి నుంచీ ఆయన వెనుక ఓబీ వ్యాన్లలో మీడియా వెంబడించడమేకాక, బెయి ల్ రద్దు కాబోతోందని, జగన్ భవిష్యత్తు ఈరోజు తేలబో తోందంటూ ఆధారం లేని కథనాలను ఓ వర్గం మీడియా ప్రసారం చేసిందన్నారు. చంద్రబాబు ఆయన మంత్రివర్గ సభ్యులు, టీడీపీ నేతలు జగన్ బెయిల్ రద్దు కాబోతోందంటూ విష ప్రచా రానికి తెరతీశాయని మండిపడ్డారు. అప్పట్లో చంద్రబాబు, సోనియాగాంధీ కలసి చేసిన కుట్ర కారణంగానే జగన్‌పై అక్రమంగా కేసులు మోపి జైలుకు పంపారని చెప్పారు. ప్రస్తుతం సీబీఐ వేసిన పిటిషన్‌ను కోర్టు ఏ విధంగా కొట్టేసిందో అదే విధంగా భవిష్యత్తులో కూడా ఏ తప్పూ చేయని జగన్‌కు తీర్పు సానుకూలంగా వస్తుందని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందని, జగన్ కడిగిన ముత్యంలా కేసుల నుంచి బయటకు వస్తారని భూమన చెప్పారు. -
చంద్రబాబుకు పాలించే అర్హత లేదు’
హైదరాబాద్: అవినీతిలో చంద్రబాబు సర్కారు రెండో స్థానంలో ఉందని సీఎంఎస్ సర్వేలో వెల్లడైందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. అవినీతి, అక్రమాలు, దగాలో సీఎం చంద్రబాబుకు ఎవరూ సాటి సారని విమర్శించారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో భూమన విలేకరులతో మాట్లాడారు. వేల కోట్లతో అవినీతి సొమ్ముతో వచ్చే ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎంఎస్ సర్వేతో చంద్రబాబు కళ్లు తెరవాలని హితవు పలికారు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబుకు పాలించే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాక్షేత్రంలో ఎదుర్కొలేక వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకులతో చంద్రబాబు అసత్య ప్రచారం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, డబ్బాలు కొట్టుకోవడానికే పరిమితమైందని దుయ్యబట్టారు. కియా కంపెనీ రెండు మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతోందని చంద్రబాబు చెప్పిన విషయం అసత్యమని తేలిందన్నారు. తాము ఒక మిలియన్ డాలర్లు మాత్రమే పెట్టుబడి పెడుతున్నట్టు కియా కంపెనీ ప్రకటన చేసిందని వెల్లడించారు. చంద్రబాబు అసత్యాలు వల్లించడం మానుకోవాలని భూమన కరుణాకరరెడ్డి సూచించారు. -
చంద్రబాబుకు పాలించే అర్హత లేదు’
-
'ధైర్యముంటే రాజీనామా చేయించి గెలిపించుకో'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రజాదరణే ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎందుకు ఎన్నికలకు వెళ్లడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ...చంద్రబాబుకు ధైర్యముంటే ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి గెలిపించుకోవాలన్నారు. సీఎంఎస్ సర్వే చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే కుటుంబసభ్యుల సర్వేని అంబటి ఎద్దేవా చేశారు. సీఎంకు ప్రత్యామ్నాయమే లేదని ఈ సర్వే ద్వారా చెప్పించారని...ఇలా చెప్పించుకోవడం చంద్రబాబుకు కొత్తమే కాదని ఆయన దుయ్యబట్టారు. 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబుదే అధికారమని సీఎంఎస్ రిపోర్ట్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుకు చేశారు. దీన్ని బట్టి ఈ సర్వే విశ్వసనీయత ఏంటో అర్థం చేసుకోవచ్చునని అంబటి రాంబాబు చెప్పారు. ఈ నెల 19న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన లోటస్ పాండ్‌లో అన్ని జిల్లాల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, ఇన్‌ఛార్జీలతో సమావేశం జరగనుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు, రైతాంగ సమస్యలు, తాగునీటి ఎద్దడి సహా ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. ఆ సమావేశం అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని అంబటి చెప్పారు.