
జగన్‌పై చంద్రబాబు విషప్రచారం
సీఎంపై ధ్వజమెత్తిన భూమన
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజాక్షేత్రంలో రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకే సీఎం చంద్రబాబు మీడియాను అడ్డం పెట్టుకుని కుటిల రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. జగన్ బెయిల్ వ్యవహారంలో ఓ వర్గం మీడియా పనికట్టుకుని మరీ ‘బెయిల్ రద్దు’ అయిం దంటూ ఊహాత్మక కథనాలను ప్రసారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో కరుణాకర్‌రెడ్డి మాట్లాడారు. ఇంటి నుంచి కోర్టుకు వెళ్లడానికి జగన్ బయలుదేరినప్పటి నుంచీ ఆయన వెనుక ఓబీ వ్యాన్లలో మీడియా వెంబడించడమేకాక, బెయి ల్ రద్దు కాబోతోందని, జగన్ భవిష్యత్తు ఈరోజు తేలబో తోందంటూ ఆధారం లేని కథనాలను ఓ వర్గం మీడియా ప్రసారం చేసిందన్నారు.
చంద్రబాబు ఆయన మంత్రివర్గ సభ్యులు, టీడీపీ నేతలు జగన్ బెయిల్ రద్దు కాబోతోందంటూ విష ప్రచా రానికి తెరతీశాయని మండిపడ్డారు. అప్పట్లో చంద్రబాబు, సోనియాగాంధీ కలసి చేసిన కుట్ర కారణంగానే జగన్‌పై అక్రమంగా కేసులు మోపి జైలుకు పంపారని చెప్పారు. ప్రస్తుతం సీబీఐ వేసిన పిటిషన్‌ను కోర్టు ఏ విధంగా కొట్టేసిందో అదే విధంగా భవిష్యత్తులో కూడా ఏ తప్పూ చేయని జగన్‌కు తీర్పు సానుకూలంగా వస్తుందని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందని, జగన్ కడిగిన ముత్యంలా కేసుల నుంచి బయటకు వస్తారని భూమన చెప్పారు.