కో ఆపరేటివ్ సొసైటీ సీఈవో అదృశ్యం
వెంకటాపురం (ఖమ్మం జిల్లా) : వెంకటాపురం మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) సీఈవో అదృశ్యం అయ్యాడంటూ ఆయన భార్య మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. పీఏసీఎస్ సీఈవోగా పనిచేస్తున్న అనుమకొండ రమేష్ (45) 20 రోజుల క్రితం ఆఫీసుకు వెళుతున్నానని చెప్పి ఇప్పటి వరకూ ఆచూకీ లేకుండా పోయారని ఆయన భార్య లక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదృశ్యం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.