ఫ్రెండ్ కోసం లాయర్‌గా మారిన అమల
ఒకప్పటి స్టార్ హీరోయిన్ అమల మరోసారి వెండితెర మీద కనిపించేందుకు రెడీ అవుతోంది. నాగార్జునతో పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన అమల చాలా కాలం తరువాత లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్ సినిమాలో తెర మీద కనిపించింది. ఇప్పుడు మరోసారి వెండితెర మీద కనిపించేందుకు ఓకె చెప్పింది ఈ సీనియర్ హీరోయిన్. తెలుగు లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అమల నటిగా పరిచయం అయ్యింది మలయాళ ఇండస్ట్రీలోనే.. అందుకే మాలీవుడ్ లో రీ ఎంట్రీకి సై అంది.
ఇటీవల హౌ ఓల్డ్ ఆర్ యు..? సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మాలీవుడ్ హీరోయిన్ మంజు వారియర్ కోసం అమల రీ ఎంట్రీకి అంగీకరించింది. మంజు వారియర్ కీలక పాత్రలో నటిస్తున్న కేరాఫ్ సైరాభాను సినిమాలో అమల లాయర్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై మరిన్ని విశేషాలను త్వరలోనే వెల్లడించనున్నారు.