యూరప్ పర్యటనకు భారత హాకీ జట్టు
న్యూఢిల్లీ: కొత్త కోచ్ రోలంట్ ఓల్ట్‌మన్స్ ఆధ్వర్యంలో భారత హాకీ జట్టు ఈనెల 31న యూరప్ పర్యటనకు వెళ్లనుంది. సర్దార్ సింగ్ నేతృత్వంలోని 21 మంది సభ్యుల బృందం 15 రోజులపాటు ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో పర్యటిస్తుంది. ఆగస్టు 14న టూర్ ముగిసేలోపు ఓవరాల్‌గా ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది.
ఈ ఏడాది చివర్లో భారత్‌లోనే జరిగే హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ కోసం ఈ మ్యాచ్‌లను సన్నాహకంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. వివాదాస్పద పరిస్థితిలో కోచ్‌గా ఉన్న పాల్ వాన్ యాస్పై హాకీ ఇండియా (హెచ్ఐ) వేటు వేసిన విషయం తెలిసిందే. మరో ఏడాదిలో రియో ఒలింపిక్స్ ఉన్న నేపథ్యంలో కొత్త కోచ్‌ను కాకుండా జట్టులో హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్‌గా ఉన్న ఓల్ట్‌మన్స్‌కు బాధ్యతలు అప్పగించారు.