Viral Video: ఆమ్లెట్ వెయ్యబోతే పిల్లైంది! కోడి పిల్లలు ఇలా కూడా పుడతాయా..
While making omelet chick suddenly came out of the egg స్ట్రీట్ ఫుడ్‌కి ఈ రోజుల్లో యమ క్రేజీ ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫైవ్ స్టార్ హోటల్లో లేని కిక్కు రోడ్డు మీద దొరికే చిన్న ప్లేటు స్నాక్స్‌లో ఉంటుంది. అదేం మాయో ఎవరికి ఎరుక? ఐతే అలాంటి రోడ్ సైడ్ షాప్‌లో ఆమ్లేట్ వేడి వేడిగా తిందామని పొయ్యి చుట్టూ చేరి గుడ్లు పగలగొట్టి, ఎంతో నేర్పుగా ఆమ్లెట్ వేస్తున్న వ్యక్తిని, అతని పనితనాన్ని శ్రద్ధగా గమనిస్తున్న కస్టమర్లలకు ఒక్కసారిగా షాక్ కొట్టినంత పనైంది! గుడ్డులోనుంచి ఓ అతిథి బయటకొచ్చింది మరీ! ప్రస్తుతం నెట్టింట ఈ ఆమ్లెట్లో నుంచి వచ్చిన అతిథికి చెందిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూస్తే మీరూ ఖచ్చితంగా ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు..
నిజానికి ఈ వీడియోలో ఆమ్లెట్ వేస్తున్న వ్యక్తి పక్కన అనేక ఎగ్ ట్రేలు ఉన్నాయి. అతను ఒక్కో గుడ్డు పగలగొట్టి, వేడి పెనంమీద వేయడం కనిపిస్తుంది. అలా ఒక గుడ్డు వేశాడు కూడా. ఐతే మరో గుడ్డు పగల గొట్టి పెనం మీద వేయగానే.. తెల్ల రంగు కోడి పిల్ల పెనం మీద పడి వేడికి గంతులు వేయడం కనిపిస్తుంది. వెంటనే అతను తేరుకుని కోడిపిల్లను కాపాడాడులే! సాధారణంగా కోడి 21 రోజులపాటు గుడ్ల మీద పొదగడం వల్ల లేదా గుడ్లను పొదిగించే పరికరంతోగానీ కోడి పిల్లలు పుడతాయి. అంటే గుడ్డులోని అండం పిల్లగా మారాలంటే కొన్ని డిగ్రీల వేడి అవసరం అవుతుంది. కోడి గుడ్లపై పొదగడం వల్ల ఆ వేడి గుడ్డుకు అంది కోడి పిల్లగా ఏర్పడటానికి దోహదపడుతుంది. ఐతే ట్రేలో ఉన్న గుడ్డులోనుంచి కోడి పిల్ల ఎలా వచ్చిండబ్బా? అని చూసినవారంతా బుర్రలు గోక్కుంటున్నారు. ఇక నెటిజన్లైతే ఫన్నీ కామెంట్లతో జోకులు పేలుస్తున్నారు. మీరూ చూడండి..
చదవండి: చిచ్చర పిడుగు! ఎగ్జామ్స్‌లో కాపీ కొట్టేందుకు కొత్త ఎత్తులు..
View this post on Instagram
A post shared by ✹⃝💎 .̶͟͟͞͞͞͞🇷⃝ᴏ🅑𝒾ɲ♓𝖔𝖔ᶑ preet (@robinhood_preet)