
జూలు ‘కోడి’
సాధారణంగా కుక్కలకు జూలు ఉంటుంది. ఇక్కడ మాత్రం కోడికి ఉంది. అదే విచిత్రం. కళ్లు, కాళ్లు కూడా కనపడకుండా మొత్తం ఒళ్లంతా
సాధారణంగా కుక్కలకు జూలు ఉంటుంది. ఇక్కడ మాత్రం కోడికి ఉంది. అదే విచిత్రం. కళ్లు, కాళ్లు కూడా కనపడకుండా మొత్తం ఒళ్లంతా ఈకలతో ఉండే ఈ కోడిపిల్లను బొబ్బిలి పట్టణంలోని సిరుగుడువీధిలో కోరుకొండ దుర్గాప్రసాద్ పెంచుతున్నారు. రెండు నెలల కిందట రోజుల వయసులో ఉన్న ఈ కోడి పిల్లను దుర్గాప్రసాద్ కొన్నారు. చుట్టుపక్కల వారందరికీ ఇప్పుడు ఇదో సెలబ్రిటీలా అయిపోయింది. హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల ఇలాంటి కోళ్లు జన్మిస్తాయని పశుసంవర్థక శాఖ అసిస్టెంటు డెరైక్టరు డాక్టరు మురళీధర్ పేర్కొన్నారు. -బొబ్బిలి