Cockroach Janta Party
-
కాక్రోచ్ దెబ్బకు టీడీపీ రివర్స్.. మోదీకి షాక్..!
-
‘కాక్రోచ్’ స్ఫూర్తితో మరో కొత్త పార్టీ!
క్విక్ కాల్?” అనే మెసేజ్ చూడగానే క్యాలెండర్లో ఫ్రీ స్లాట్ వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఒక్క స్లైడ్‌లో చెప్పాల్సిన విషయం 10 స్లైడ్స్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్గా సా..గిపోతూ చివరికి మీటింగ్ టైమ్ కూడా మించి పోవడం. మనమంతా ఒక కుటుంబం (We are a family) అనే హెచ్ఆర్ మాట… పనిభారం పెరిగిన ప్రతిసారి గుర్తొచ్చే ఒకరకమైన ఫీలింగ్. కార్పొరేట్ ఉద్యోగుల్లో కలిగే ఈ అనుభవాలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యంగ్య రూపంలో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.రోజువారీ పనిలో భాగంగా మారిపోయిన ఈ చిన్న చిన్న ఒత్తిడులు, మీటింగ్ కల్చర్, ప్రెజెంటేషన్ల పొడవు, పని–వ్యక్తిగత జీవితం మధ్య సరిహద్దులు మసకబారడం వంటి అంశాలు.. ఇప్పుడు హాస్యరూపంలో ఒక పెద్ద ఆన్లైన్ సంభాషణగా మారాయి. సాధారణంగా ఉద్యోగులు లోపలే పేరుకుపోయే అసహనం.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక సార్వత్రిక అనుభవంగా మారి అందరినీ కనెక్ట్ చేస్తోంది.ఈ నేపథ్యంలోనే కాక్రోచ్ జనతా పార్టీ అనే మీమ్ ట్రెండ్ నుంచి ప్రేరణ పొందుతూ “కార్పొరేట్ మజ్దూర్ జనతా పార్టీ (CMJP)” అనే సెటైరిక్ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కార్పొరేట్ జీవితంలోని ఒత్తిడిని, అలసటను వ్యంగ్యంగా రాజకీయ రూపంలో చూపిస్తూ ఈ ట్రెండ్ మరింత చర్చకు దారి తీస్తోంది.గుర్గావ్కు చెందిన అమెజాన్ మాజీ ఉద్యోగి శుభం కుమార్ మిట్టల్ ‘లింక్డిన్’లో చేసిన ఒక సెటైరికల్ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈయనే ఈ సీఎంజేపీ ప్రకటిస్తూ ఒక వ్యంగ్య మేనిఫెస్టోను పంచుకున్నారు. ఈ పోస్ట్ ఉద్యోగుల్లోని అలసట, పని ఒత్తిడి, కార్పొరేట్ సంస్కృతి మీద ఉన్న అసంతృప్తిని సరదాగా రాజకీయ రూపంలో చూపించింది. కాక్రోచ్ పార్టీ మీమ్ ట్రెండ్ నుంచి స్ఫూర్తి తీసుకున్న ఈ కాన్సెప్ట్, కార్పొరేట్ ఉద్యోగుల దైనందిన సమస్యలను ఫన్నీ మేనిఫెస్టోలా చూపించారాయన.ఈ వ్యంగ్య మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించి పలు సరదా ప్రతిపాదనలు ఉన్నాయి. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని “అనవసరంగా ఎక్కువ పని దినాలు”గా పేర్కొనడం, “క్విక్ కాల్?” అనే మాటను అధికారికంగా వర్క్‌ప్లేస్ ఒత్తిడిగా గుర్తించాలన్న సూచన, అలాగే జీతంలో కంపెనీ చూపే మొత్తం (CTC).. చేతికి వచ్చే జీతం మధ్య తేడాలపై ప్రత్యేక దర్యాప్తు జరగాలన్న డిమాండ్లు ఉన్నాయి.ఇంకా వెటకారంగా.. వరుసగా మూడు సార్లు ఉద్యోగం కోల్పోయిన వారికి ప్రత్యేకంగా “ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్” ఇవ్వాలని కూడా ఈ వ్యంగ్య మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అలాగే 50 స్లైడ్స్ కంటే ఎక్కువ ఉన్న పీపీటీలను ఉద్యోగుల మానసిక ఒత్తిడికి కారణమని గుర్తించాలని సూచించారు. “We are a family” అనే హెచ్ఆర్ మాటను.. ఉద్యోగులను ఒప్పించడానికి వాళ్లు ఉపయోగించే భావోద్వేగ పద్ధతిగా చూడాలని కూడా ఇందులో ఆయన ప్రస్తావించారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవ్వడంతో లింక్టిన్, ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది కార్పొరేట్ ఉద్యోగులు ఈ అంశాలు తమ రోజువారీ అనుభవాలకు చాలా దగ్గరగా ఉన్నాయని కామెంట్లు చేశారు. కొందరు అయితే ఇది జోక్ అయినప్పటికీ “చాలా నిజంగా అనిపిస్తోంది” అని పేర్కొన్నారు.అయితే ఆశ్చర్యకరంగా.. “Corporate Majdoor Janta Party” అనే పేరుతో ఒక వెబ్సైట్ కూడా ప్రత్యక్షమవ్వడం ఈ ట్రెండ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చింది. ఆ సైట్లో జాయిన్ ద మూమెంట్ అనే ఆహ్వానం ఉండటంతో ఇది సాధారణ పోస్ట్ నుంచి ఒక పెద్ద ఇంటర్నెట్ క్యాంపెయిన్‌గా మారినట్లు కనిపిస్తోంది. ఒక సాధారణ LinkedIn వ్యంగ్య పోస్ట్‌గా మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు కార్పొరేట్ ఉద్యోగుల అలసట, పని ఒత్తిడి, కార్యాలయ సంస్కృతి మీద ఉన్న అసంతృప్తిని హాస్యరూపంలో బయటపెడుతున్న ఒక వైరల్ సోషల్ మీడియా ఉద్యమంగా మార్చేయడం గమనార్హం.అది ఇది కాదు.. ఇదిలా ఉంటే.. ప్రముఖ కమెడియన్ అన్మోల్ గర్గ్ కూడా ఇదే థీమ్‌పై వీడియోలు చేస్తూ ఈ ట్రెండ్‌కు మరింత ప్రచారం కల్పిస్తున్నారు. కార్పొరేట్ జనతా పార్టీ (Corporate Janata Party - CJP) పేరుతో కార్పొరేట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న లేఆఫ్‌లు, వేధింపులు, తక్కువ హైక్‌లు, టాక్సిక్ వర్క్ కల్చర్‌లపై నిరసనగా ఈ క్యాంపెయిన్ ప్రారంభించారాయన. అయితే దీనికంటూ కొన్ని లక్ష్యాలను ఆయన నిర్దేశించుకున్నారు. లేఆఫ్ ఇన్సూరెన్స్: ఉద్యోగం నుండి తొలగిస్తే ప్రభుత్వాలు లేదంటే కంపెనీలు భద్రత కల్పించడం. మూన్‌లైటింగ్ (Moonlighting): ఒక ఉద్యోగి ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో పనిచేయడానికి అనుమతి. పని వేళలు: కార్యాలయ వేళల తర్వాత ఫోన్ కాల్స్, మెయిల్స్ బంద్ చేయడం. జీతాల పెంపు: ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ శాతంలో హైక్ ఇవ్వడం.. ఇందులో ఉన్నాయి. ఇది కేవలం ఒక మీమ్ పేజీ లా కాకుండా, ప్రైవేట్ రంగ ఉద్యోగుల హక్కుల కోసం ఏర్పాటయిన ఒక వర్క్‌ఫోర్స్ ఉద్యమంగా వైరల్ అయింది. అయితే, కొన్ని ప్లాట్‌ఫారమ్‌లలో దీని ఖాతాలు బ్యాన్ కావడంతో ఉద్యోగుల సంఘీభావంతో ఇది మరింత చర్చనీయాంశమైంది కూడా. -
కాక్రోచ్ జనతా పార్టీని నాకిచ్చేయండి..!
సోషల్ మీడియాలో వ్యంగ్యరూపంలో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) రోజుల వ్యవధిలోనే విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఎంతలా అంటే భారత్‌లో ప్రధానంగా ఉన్న రాజకీయా పార్టీలను వెనక్కు నెట్టి మరీ ఈ పార్టీ దూసుకుపోయింది ఏ నోట విన్నా సీజేపీ అనే స్థాయికి ఈ సోషల్ మీడియా పార్టీ చేరింది. అయితే దీన్ని నెలకొల్పంది అభిజీత్ దిప్కే. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన అభిజిత్.. ఇటీవల దీన్ని సోషల్ మీడియా వేదికగా లాంచ్ చేయగా విశేషమైన ఆదరణ లభించింది. అయితే దీనికి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్న ఈ పార్టీకి చెందిన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా భారతదేశంలో బ్లాక్ అయ్యింది. యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ డిజిటల్ ఉద్యమ అకౌంట్ బ్లాక్ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఆ పేరును నాకిచ్చేయండి..హరియాణాలోని పానిపట్‌కి చెందిన న్యాయవాది సుధీర్ జాకర్ సీజేపీని తన పేరుతో ఎన్నికల సంఘంలో నమోదు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఆయన తానే పార్టీ జాతీయ కన్వీనర్ అని ప్రకటించుకున్నాడు, దీన్ని అమెరికాలో చదువుకుంటున్న అభిజీత్ దిప్కే నుంచి వేరు చేసి తన పేరుతో పార్టీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుధీర్ జాకర్.. కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాడు. ఆ పేరును తనకు కేటాయించాలని కోరుతూ ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఆ పార్టీని రిజిస్టర్ చేసుకోవడానికి భారత్‌కు రమ్మంటే రానంటున్న అభిజిత్ దీప్కే నుంచి ఆ పార్టీని వేరు చేయాలని దరఖాస్తులో కోరారు. ‘యువతలో కోపం పెరుగుతోంది. ఎవరైనా ముందుగా ఈ పేరును నమోదు చేసి దుర్వినియోగం చేస్తే ఉద్యమం నశిస్తుంది. అందుకే నేను ముందుకు వచ్చాను’ అని దరఖాస్తు చేసుకునే క్రమంలో చెప్పుకొచ్చారు సదరు న్యాయవాది. ప్రారంభించిన ఐదు రోజుల తర్వాత గత గురువారం భారతదేశంలో సీజేపీ ‘ఎక్స్’ ఖాతాను నిలిపివేశారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్లైన్ ట్రెండ్లలో ఒకటిగా అవతరించిన సీజేపీని ప్రస్తుతం బ్యాన్ చేశారు. మరి ఇది పార్టీగా రూపాంతరం చెందుతుందా? తుపాను వేగంతో వచ్చిన ఈ పార్టీకి ఇక్కడతోనే కథ ముగిసినట్లా అనేది కాలమే నిర్ణయించాలి. మొత్తంగా సీజేపీ ఇప్పుడు అసలు స్థాపకుడు అభిజీత్ దిప్కే వర్సెస్ జాకర్ మధ్య యాజమాన్య పోరుకు తెరతీయడం మరింత హాట్ టాపిక్‌గా మారింది. -
‘కాక్రోచ్ జనతా పార్టీ’పై విచారణకు నో!
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఇటీవల పుట్టుకొచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)’కి సంబంధించిన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశాన్ని మరీ సెంటిమెంట్‌గా తీసుకోవద్దని, ఇందులో అత్యవసరంగా విచారించాల్సినంత తీవ్రత ఏమీ లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఇటీవల విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన సీజేపీ వెనుక ఉన్న వ్యక్తులపై, అలాగే నకిలీ న్యాయవాద డిగ్రీల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని న్యాయవాది రాజా చౌదరి పిటిషన్ వేశారు. పిటిషనర్ తరఫున ఎన్.కె.గోస్వామి వాదనలు వినిపించారు. సీజేపీ సోషల్ మీడియా ద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్టను మసకబారుస్తోందని పేర్కొన్నారు. కోర్టులో జరిగే సంభాషణలు, న్యాయమూర్తుల వ్యాఖ్యలను కొందరు వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. కోర్టు వ్యాఖ్యలను కత్తిరించి, మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. తాము వాక్ స్వాతం్రత్యానికి, ప్రజాస్వామిక హక్కులకు వ్యతిరేకం కాదని, కేవలం కోర్టు వ్యాఖ్యలను స్వార్థానికి వాడుకోవడంపైనే అభ్యంతరం తెలుపుతున్నామన్నారు. వాదనలు విన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వీఎం పంచోలిల ధర్మాసనం.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మరీ అంత సెంటిమెంట్‌గా తీసుకోవద్దంటూ వ్యాఖ్యానించింది. ఈ అంశంపై వెంటనే విచారించాలన్న అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. -
కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతుందా?
భారత ప్రధాన న్యాయమూర్తి మే 15న ఓ కేసు విచారణ సందర్భంగా నిరుద్యోగుల్ని బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చారు. మొత్తం యువత గురించి తాను ఆ మాటలు అనలేదనీ, ప్రత్యేకంగా కొందరు వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేశాననీ రెండు రోజుల తరువాత వారు ఒక వివరణ ఇచ్చారు. అయినప్పటికీ, బొద్దింకలు అనే మాటను జెన్–జీ వైరల్‌గా మార్చేసింది. ‘అవును. మేము బొద్దింకలమే’ అని ప్రకటించుకుంది. ఇది కేవలం మీమ్ రాజకీయమా? వ్యవస్థలపై యువతరంలో పేరుకుపోతున్న అసహనానికి కొత్త రూపమా?ఉద్యోగాలులేని యువతరం సోషల్ మీడియా, ఆర్టీఐ యాక్టివి జంలోకి వచ్చి కొందర్ని టార్గెట్ చేస్తున్నారని చేసిన వ్యాఖ్య దుమారం రేపింది. ‘బొద్దింకలు’ అనే పోలిక సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఇచ్చిందనీ, ప్రజాస్వామ్యంలో అసమ్మతి శత్రుత్వం కాదనీ అనేకమంది స్పందించారు. మనకు నచ్చనివాళ్ల భావ ప్రకటనా స్వేచ్ఛను కూడా మనం గౌరవించి తీరాలి. లేకుంటే భావప్రకటనా స్వేచ్ఛను మనమే విశ్వసించడం లేనట్టే అనే అర్థంలో అమెరికా సామాజిక కార్యకర్త నోమ్ చామ్స్కీ మాటలు మళ్లీ వైరలయ్యాయి.ఉద్యమకాలంలో అవమానం కూడా ఒక్కోసారి ఆత్మగౌరవ గుర్తింపుగా మారిపోతుంది. నగ్జల్బబరీలో ఆదివాసుల సాయుధ పోరాటాన్ని ఆరంభించినవాళ్లు సీపీఐ–మార్క్సిస్టు–లెనినిస్టులు. గిట్టనివాళ్లు వాళ్లను నక్సలైట్లు అని విమర్శించేవారు. ‘అవును మేము నక్సలైట్లమే’ అంటూ వాళ్లు సగర్వంగా ప్రకటించుకోవడం మొద లెట్టారు. ‘మేము మాల’, ‘మేము మాదిగ’ వంటి ఆత్మగౌరవ ప్రకట నల్ని కూడా చూశాం. ఇది సోషల్ మీడియా యుగం కనుక వేగం మరింత ఎక్కువ.‘బొద్దింక’ కొత్త రాజకీయ మీమ్‌గా మారింది.బోస్టన్ యూనివర్సిటీ విద్యార్థి అభిజీత్ దీప్కే సరదాగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అంటూ ఒక పోస్టు పెట్టాడు. అది వైరల్ అయ్యింది. కొన్ని గంటల్లోనే ఆ పార్టీలో వేలమంది చేరి పోయారు. ఇదేమీ రాజకీయ పార్టీ కాకపోవచ్చు కానీ, ఈతరం భావోద్వేగాలకు అద్దం పడుతోంది. పాత రాజకీయ భాష కొత్త యువతను ఆకట్టు కోవడం లేదు. అందుకే మీమ్స్, వ్యంగ్యం, డిజిటల్ క్యాంపెయిన్లు కొత్త రాజకీయ వ్యక్తీకరణలుగా మారుతున్నాయి.బొద్దింకల గురించి ఎన్నో కథలున్నాయి. ‘న్యూక్లియర్ యుద్ధం వచ్చినా చివరికి మిగిలేది బొద్దింకలే’ అనే మాట దశాబ్దాలుగా ప్రచారంలో ఉంది. జీవశాస్త్ర పరంగా చూసినప్పుడు బొద్దింకలు అద్భుతమైన జీవన సామర్థ్యం కలిగిన జీవులు. కోట్ల సంవత్స రాలుగా ఇవి అంతరించకుండా కొనసాగుతున్నాయి. మంద్ర స్థాయిలో రేడియేషన్‌ను తట్టుకునే సామర్థ్యం కూడా వీటికి ఉందన డానికి సైంటిఫిక్ ఆధారాలున్నాయి. అందుకే ఇప్పుడు యువత ‘మమ్మల్ని ఎంత తక్కువ చేసి మాట్లాడినా మేము బతుకుతాం, తిరిగి లేస్తాం’ అని ధీమాగా అంటోంది. సరికొత్త పోరాట వేదికలుఒకప్పుడు ఉద్యమాలు వీధుల్లో మొదలయ్యేవి. ఇప్పుడు అవి మీమ్ పేజీల్లో మొదలవుతున్నాయి. ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్లు, ఇన్ స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్టులు– ఇవే ఇప్పుడు కొత్త పోరాట వేదికలు. అమెరికాలో ‘వాల్ స్ట్రీట్‌ను ఆక్రమించండి’, హాంగ్‌కాంగ్ ఉద్యమాలు, అరబ్ స్ప్రింగ్ – అన్నీ డిజిటల్ మీడియా ప్రభావాన్ని చూపించాయి. ఇప్పుడు భారతదేశంలో కూడా జెన్–జెడ్ అదే దారిలో వెళ్తోంది. వ్యంగ్యం ఇప్పుడు వినోదం మాత్రమే కాదు, అది ఒక నిరసన గళం.సోషల్ మీడియాలో యువత అంటున్నదేమిటీ?– ‘ప్రశ్నించడం దేశద్రోహం కాదు.’ అది నిజమేకదా? కాక్రోచ్ జనతా పార్టీ నిజంగానే ఎన్నికల బరిలోనికి దిగుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చ కాదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం; ఇది ఒక తరపు అసంతృప్తికి అద్దంపడుతోంది. వ్యవస్థల పట్ల యువతలో పెరుగుతున్న ఆక్రోశాన్ని ఇది వ్యక్తం చేస్తోంది. చరిత్ర చాలా రకాలుగా పునరావృతం అవుతోంది. ఈసారి అది ప్రహసనంగా కనిపించవచ్చుగానీ దాని వెనుక తీవ్ర ఆక్రోశం దాగుంది. దాన్ని గుర్తించడం ముఖ్యం.- డానీ వ్యాసకర్త సమాజ, రాజకీయ విశ్లేషకులు -
కాక్రోచ్ దుమారం.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శర్మ చేసిన బొద్దింకల వ్యాఖ్యలతో ప్రారంభమైన వివాదం.. ఆ తర్వాత “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. సమర్థనలు, ఖండనలు.. తీవ్ర అభ్యంతరాలతో ఈ క్యాంపెయిన్‌పై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అయితే అటు ఇటు తిరిగి చివరకు.. ఈ రాజకీయ సెటైర్ క్యాంపెయిన్ కోర్టు మెట్లెక్కింది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు.. సీజేఐ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ.. న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం సాగుతోందని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని అత్యవసర విచారణలు జరపాలని.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆ పిటిషన్లను పరిశీలించారు. అయితే ఇది అత్యవసర విచారణ జరిపే పిటిషనేం కాదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. మే 15న జరిగిన ఓ కేసు విచారణ సందర్భంగా ‘‘కొందరు బొద్దింకల్లా అన్నిచోట్లా కనిపిస్తున్నారు..’’ అంటూ సీజేఐ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక, వృత్తుల్లో స్థానం దక్కని కొందరు యువకులు బొద్దింకల్లా అన్నిచోట్లా కనిపిస్తున్నారు. కొందరు మీడియాగా, ఇంకొందరు ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరినీ టార్గెట్ చేస్తుంటారు అని పేర్కొన్నారాయన. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో.. సీజేఐ తర్వాత వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు యువతపై కాకుండా నకిలీ, బోగస్ డిగ్రీలతో వ్యవస్థల్లోకి చొరబడుతున్న వారినే ఉద్దేశించాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ “కాక్రోచ్ జనతా పార్టీ” (సిజెపి) పేరిట సోషల్ మీడియాలో వ్యంగ్య ప్రచారం కొనసాగింది. ఈ పరిణామాలను ప్రాక్టీసింగ్ లాయర్ రాజా చౌదరి సుప్రీంకోర్టులో పిటిషన్ రూపంలో దాఖలు చేశారు. సీజేఐ వ్యాఖ్యలను కొందరు సోషల్ మీడియాలో వక్రీకరించి.. నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడినట్టుగా ప్రచారం చేశారని.. ఈ దుష్ప్రచారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని అందులో పేర్కొన్నారాయన. ఈ పిటిషన్లపై న్యాయవాది గోస్వామి వాదనలు వినిపించారు. కోర్టు విచారణల్లో జరిగిన మాటల మార్పిడిని.. వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే నకిలీ లా డిగ్రీలు, బోగస్ న్యాయవాదుల వ్యవహారాలపై సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ అంశాన్ని అంత సీరియస్‌గా తీసుకోవద్దంటూ సీజేఐ సూర్యకాంత్ పిటిషనర్‌కు సూచించారు. ఈ అంశంలో ఇంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి అత్యవసర విచారణ జరపాల్సినంత సీన్ లేదు. సమయం వచ్చినప్పుడు కోర్టు ఈ అంశాన్ని తప్పక పరిశీలిస్తుంది అని లాయర్ గోస్వామిని ఉద్దేశిస్తూ సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యల ప్రస్తావన, మళ్లీ వివరణ అంశాల్ని ఆయన ప్రస్తావించలేదు."Don’t take it so sentimentally’, says Chief Justice of India Surya Kant, as a lawyer mentions PIL, saying a distorted and malicious narrative is being continued to malign the judiciary despite clarification by the CJI on the 'cockroach' remark.CJI says there is no such grave… pic.twitter.com/gi0yp91N9h— ANI (@ANI) May 25, 2026మరో పిటిషన్లో “కాక్రోచ్ జనతా పార్టీ” పేరిట సాగుతున్న ఆన్లైన్ క్యాంపెయిన్ కార్యకలాపాలపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని దాఖలైంది. సీజేఐ వ్యాఖ్యలను సెలెక్టివ్‌గా తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని పిటిషనర్లు ఆరోపించారు. మెర్చండైజ్, బ్రాండింగ్, రాజకీయ సెటైర్ పేరుతో ప్రచారం సాగిస్తూ వాణిజ్య లాభాలు పొందే ప్రయత్నం జరుగుతోందని కూడా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను కోర్టు పరిశీలించాల్సి ఉంది. అలా మొదలై..మహారాష్ట్రకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ అభిజిత్ దిప్కే ప్రారంభించిన “కాక్రోచ్ జనతా పార్టీ” మొదట సరదా సెటైర్లా మొదలైనా.. క్రమంగా ఇది వ్యవస్థలపై అసంతృప్తి వ్యక్తం చేసే డిజిటల్ ఉద్యమంగా మారింది. సీజేఐ సూర్యకాంత్ చేసిన “కాక్రోచ్” వ్యాఖ్యలను తమపై అవమానంగా భావించిన కొంతమంది నిరుద్యోగ యువత, సోషల్ మీడియా యూజర్లు ఈ పేరును వ్యంగ్య చిహ్నంగా మార్చుకున్నారు. “మమ్మల్ని బొద్దింకలు అంటారా..? అయితే ఇదే మా పార్టీ” అన్నట్లుగా ఈ క్యాంపెయిన్‌ను నడిపిస్తున్నారు.చదవండి: కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నికల బరిలోనికి దిగుతుందా?ఈ గ్రూప్ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టర్లు, వ్యంగ్య నినాదాలు, డిజిటల్ పోస్టర్లతో భారీ ప్రచారం చేస్తోంది. “Wherever WiFi Works is our headquarters”, “Party for the unemployed and overqualified” లాంటి ట్యాగ్లైన్లతో యువతలో వైరల్ అవుతోంది. రాజకీయాలపై, న్యాయవ్యవస్థపై, ఉద్యోగ వ్యవస్థపై వ్యంగ్య వ్యాఖ్యలతో పోస్టులు పెడుతూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.ట్రోలింగ్ మాత్రమే కాదు..అయితే ఇది కేవలం ట్రోలింగ్‌కే పరిమితం కాలేదు. మాజీ ప్రధాన న్యాయమూర్తులకు పదవీ విరమణ తర్వాత రాజ్యసభ అవకాశాలు ఇవ్వొద్దని, పార్టీ మారిన ఎమ్మెల్యేలు-ఎంపీలకు 20 ఏళ్ల అనర్హత విధించాలని, మహిళలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, పరీక్షల లీకేజీలపై కఠిన చట్టాలు తీసుకురావాలని వంటి డిమాండ్లను కూడా తమ మేనిఫెస్టోలో చేర్చింది. దీంతో ఇది పూర్తిగా సరదా క్యాంపెయినా..? లేక వ్యవస్థలపై డిజిటల్ నిరసనా..? అనే చర్చ మొదలైంది.మరోవైపు విమర్శకులు మాత్రం ఈ క్యాంపెయిన్ న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా మారుతోందని ఆరోపిస్తున్నారు. సీజేఐ వ్యాఖ్యలను సెలెక్టివ్‌గా కట్ చేసి వైరల్ చేయడం, మెర్చండైజ్, బ్రాండింగ్, రాజకీయ సెటైర్ పేరుతో ప్రచారం చేయడం ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. ఇదే అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. -
కాక్రోచ్ జనతా పార్టీ.. అభిజిత్ దిప్కే ఇంటికి పోలీసుల భద్రత
ముంబై: కాక్రోచ్ జనతా పార్టీ. సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చి కేవలం ఒక వారం వ్యవధిలోనే ప్రధాన పార్టీల సోషల్ మీడియా సభ్యత్వాన్ని దాటి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నివాసానికి పోలీసులు భద్రత కల్పించారు. అతని నివాసం వద్ద అవాంచనీయ ఘటనలు జరగకుండా నిరంతరం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. నిరుద్యోగం, పరీక్ష పత్రాల లీకేజీలు, విద్యా సంబంధిత సమస్యలపై మీమ్స్,రాజకీయ వ్యాఖ్యానాల ద్వారా గతవారం సోషల్‌మీడియాలో పురుడుపోసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ కొద్ది రోజుల్లోనే రెండుకోట్లకు పైగా ఫాలోవర్స్‌ను దాటిపోయింది. సీజేఐ ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన వాఖ్యల నేపథ్యంలో ఈ పార్టీ ఆవిర్భావం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతాపార్టీ సంచలనం సృష్టిస్తున్ననేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఇంటికి పోలీసులు రక్షణ కల్పించారు. అతని నివాసం వద్ద రద్దీ లేకుండా చూసేందుకు, ఎంఐడీసీ వాలుజ్ ప్రాంతంలోని ఆయన నివాసానికి తాము ఇరవై నాలుగు గంటల సాధారణ పోలీసు భద్రతను కల్పించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పంకజ్ అతుల్కర్ తెలిపారు. అంతేకాని ఎటువంటి బెదిరింపులు దీనికి కారణం కాదని పేర్కొన్నారు. కాగా కాక్రోచ్ జనతా పార్టీకి పాకిస్థాన్, బిలియనీర్ జార్జ్ సోరోస్ నెట్‌వర్క్‌ల నుంచి మద్దతు లభిస్తోందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఈ ఆరోపణలను కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఖండించారు. మా పార్టీకి పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధం లేదు. కేంద్రమంత్రి చేసిన ఆరోపణలు నిరాదారమైనవన్నారు. పార్టీ ఉద్దేశ్యం కేవలం భారతీయ ప్రజల సమస్యలను వినిపించడం, యువతలో అవగాహన పెంచడమేనని స్పష్టం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీకి కేవలం భారత్‌లోనే 94శాతం మంది ఫాలోవర్స్ ఉన్నారని తెలిపారు. పార్టీ డిజిటల్ ఉద్యమంపై విస్తృతమైన అణచివేత జరుగుతోందని, తమ సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ, వెబ్‌సైట్‌ను తొలగించారని లేదా హ్యాక్ చేశారని, దీంతో తమ అధికారిక వేదికల్లో దేనికీ తమకు ప్రాప్యత లేకుండా పోయిందని అభిజిత్ దిప్కే ఆరోపించారు. -
‘కాక్రోచ్ జనతా పార్టీ’ని చూస్తుంటే జాలేస్తోంది : కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
సాక్షి,ఢిల్లీ: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల జరిగిన సభలో మాట్లాడుతూ..‘కాక్రోచ్ జనతా పార్టీ’కి పాకిస్థాన్, బిలియనీర్ జార్జ్ సోరోస్ నెట్‌వర్క్‌ల నుంచి మద్దతు లభిస్తోంది అని వ్యాఖ్యానించారు.అయితే, ఈ ఆరోపణలను కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. మా పార్టీకి పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధం లేదు. రిజిజు చేసిన ఆరోపణలు అసత్యం, నిరాధారం. మా పార్టీ ఉద్దేశ్యం భారతీయ ప్రజల సమస్యలను వినిపించడం, ముఖ్యంగా యువతలో అవగాహన పెంచడమే” అని స్పష్టం చేశారు. అభిజీత్ దిప్కే తమ పార్టీకి భారత్‌లోనే 94 శాతం మంది సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్నారని గుర్తు చేశారు.దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పాకిస్థాన్, జార్జ్ సోరోస్ నెట్‌వర్క్‌ల నుండి ఫాలోవర్స్ సంపాదించుకునే వారిని చూస్తుంటే నాకు జాలేస్తుంది. మన దేశంలో తగినంత జనాభా, అత్యంత చురుకైన యువత ఉన్నారు. వారు నిజమైన, విలువైన ఫాలోవర్స్. భారత్ వ్యతిరేక నెట్‌వర్క్‌ల నుంచి గుర్తింపు కోరాల్సిన అవసరం లేదు” అని అన్నారు.I pity those who seek their followers in social media from Pakistan & George Soros gang.— Kiren Rijiju (@KirenRijiju) May 23, 2026 -
అణచివేస్తున్నారు!
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)పై అణచివేత చర్యలు కొనసాగుతున్నాయని పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆరోపించారు. తమ సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేస్తున్నారని, హ్యాకింగ్ జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమ పార్టీకి ప్రస్తుతం తమ సోషల్ మీడియా ఖాతాలేవీ అందుబాటులో లేవని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా హ్యాక్ చేశారని విమర్శించారు. రెండు రోజుల క్రితం సీజేపీ ‘ఎక్స్’ఖాతాను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆ పార్టీ కొత్త ఖాతాను సృష్టించుకుంది. నీట్(యూజీ)–2026 పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలంటూ సీజేపీ శుక్రవారం ఆన్లైన్లో ఉద్యమం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తనకు బెదిరింపులు వస్తున్నాయని, ప్రాణహాని ఉందని అభిజిత్ దిప్కే చెప్పారు. తమ పార్టీని పూర్తిగా అణచివేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ ఇన్స్టాగ్రామ్ పేజీని, తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ పేజీని హ్యాక్ చేశారని తెలిపారు. ట్విట్టర్ ఖాతాను నిలిపివేశారని, బ్యాకప్ ఖాతాను కూడా తొలగించారని వెల్లడించారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలేవీ తమకు అందుబాటులో లేవన్నారు. ఇకపై వచ్చే పోస్టులను కాక్రోచ్ జనతా పార్టీ నుంచి వచ్చిన అధికారిక ప్రకటనగా పరిగణించకూడదని కోరారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు కక్షగట్టారు సీజేపీ వెబ్సైట్ అయిన ‘కాక్రోచ్జనతాపార్టీ.ఓఆర్జీ’ని కూడా ప్రభుత్వ వర్గాలు కక్షపూరితంగా తొలగించినట్లు అభిజిత్ దీప్కే తెలిపారు. అది ఇప్పుడు అందుబాటులో లేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే తమ పార్టీపై యుద్ధం ప్రకటించారని అభిజిత్ దీప్కే మండిపడ్డారు. ‘‘ప్రభుత్వం మా ప్రతిష్టాత్మక వెబ్‌సైట్‌ను తొలగించింది. మా వెబ్సైట్లో కోటి మంది సభ్యులుగా చేరారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆరు లక్షల మంది సభ్యులు పిటిషన్‌పై సంతకం చేశారు’’అని వివరించారు. ఎంతగా అణచివేస్తున్నా తమ ఉద్యమం నానాటికీ విస్తరిస్తూనే ఉందని తేల్చిచెప్పారు. ఇండియాలో కాక్రోచ్ జనతా పార్టీ ‘ఎక్స్’ఖాతాను నిలిపివేయడాన్ని డిజిటల్ హక్కుల సంఘం ‘ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్’తప్పుపట్టింది. ఈ చర్యను ప్రభుత్వ అధికార దురి్వనియోగంగా అభివర్ణించింది. ఇదీ కాక్రోచ్ కథ → ఉద్యోగాలు, ఉపాధి లేని యువత పరాన్నజీవులుగా, బొద్దింకల మాదిరిగా వ్యవస్థలపై దాడి చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ నెల 15న ఒక కేసు విచారణ సందర్భంగా మాట్లాడుతూ విమర్శించారు. → ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో సంబంధాలున్న అభిజిత్ దీప్కే అనే యువకుడు జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తంచేశాడు. ఈ నెల 16న ‘వాయిస్ ఆఫ్లేజీ అండ్ అన్ఎంప్లాయ్డ్’అనే ట్యాగ్‌లైన్‌తో కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేశాడు. ఇదొక ఆన్లైన్ వ్యంగ్య పార్టీ. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. రాజ్యాంగాన్ని, ఐదు సూత్రాల మేనిఫెస్టోను ప్రకటించాడు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆన్లైన్లో పోరాటం సాగించడమే తన లక్ష్యమని స్పష్టంచేశాడు. ప్రధానంగా యువత ఈ పార్టీ పట్ల విపరీతంగా ఆకర్షితులయ్యారు. → కాక్రోచ్ జనతా పార్టీని ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరించేవారి సంఖ్య కోటికి చేరుకుంది. రెండు రోజుల వ్యవధిలోనే 40 వేల మంది ఆ పార్టీలో చేరారు. → నిరుద్యోగం, రాజకీయ జవాబుదారీతనం, ప్రశ్నపత్రాల లీకేజీలపై యువతలో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని సీజేపీ బహిర్గతం చేసింది. సీజేపీ వెబ్సైట్. ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. → అధికార బీజేపీ సహా ప్రధాన జాతీయ రాజకీయ పార్టీల కంటే సీజేపీకి సోషల్ మీడియాలో అధికంగా ఆదరణ లభించింది. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో బీజేపీ కంటే సీజేపీని ఎక్కువ మంది అనుసరించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సీజేపీని అనుసరించేవారి సంఖ్య 2 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 22న సీజేపీ ‘ఎక్స్’ఖాతాను నిలిపివేసింది. -
అభిజీత్ దీప్కే (కాక్రోచ్ జనతా పార్టీ) రాయని డైరీ
కొన్నిసార్లు అవకాశాలను భగవంతుడు కల్పిస్తాడు. మరికొన్నిసార్లు భారత ప్రధాన న్యాయమూర్తి! నిజం! నాకసలు ఏ ఉద్యమమూ చేపట్టాలని లేదు. కానీ, దైవం ఏ రూపంలోనో వచ్చి, ఇదిగో ఇలా ప్రభుత్వాలతో తలపడమని పిలుపును ఇస్తాడు కావచ్చు... ఉమర్ ఖాలిద్‌కు ఇచ్చినట్లుగా! ఖాలిద్ ఆరేళ్ల తర్వాత తీహార్ నుండి మూడు రోజుల బెయిల్ మీద బయటికి వచ్చి జూన్ 1 నుంచి 3 వరకు తల్లికి తోడుగా ఉండబోతున్నాడు... ఈ లోపు ఆ మూడు రోజుల బెయిలైనా రద్దు కాకుండా ఉంటే!ఢిల్లీలో అల్లర్లకు కుట్ర పన్నాడని ‘ఉపా’ కింద ఉమర్ ఖాలిద్‌ని 2020లో అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచారు. ఇప్పుడు నేను ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని పెట్టి నిరుద్యోగ యువకుల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నానని నా పైన ‘ఉపా’ పెట్టినా చేసేదేం లేదు!! రెండు రోజులు ఆగితే ఇండియా వెళ్లేవాడిని. నాలుగు రోజులు ఇండియాలో ఉండి, తిరిగి బోస్టన్ వచ్చేసేవాడిని.బోస్టన్ విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్ రిలేషన్స్‌లో రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీ చేసొచ్చిన భారతీయ యువకుడికైనా స్వదేశంలో ఎక్కడో ఒక చోట చిన్న ఉద్యోగం దొరుకుతుందనే నమ్మకం లేదు. ఉండటానికైతే ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో అమ్మానాన్న ఉంటారు. కానీ ఇప్పుడు నేను ఛత్రపతి శంభాజీ నగర్‌లోని మా ఇంటికి వెళ్లటానికి లేదు.‘‘ఎందుకొచ్చిన పిచ్చి పని జీత్! ఆ ఆన్లైన్ ఆటలు ఆపేసెయ్’’ అని అమ్మ అంటోంది. ‘‘అమ్మా... ఇన్‌స్టాలో వారం రోజుల్లో నాకు 2 కోట్ల మంది ఫాలోవర్స్...’’ అన్నాను నవ్వుతూ. ‘‘అదేదో వారానికి ఇంత జీతం అని చెబుతున్నావేంటి జీత్!!’’... అమ్మ నుంచి ఫోన్ లాక్కొని నాన్న! ‘‘జీత్, మన ఇంటి చుట్టుపక్కల నిన్నటి నుంచి ఎవరో కొత్తవాళ్లు కనిపిస్తున్నార్రా’’... నాన్న నుంచి ఫోన్ లాక్కొని అమ్మ. ‘‘అమ్మా... నాకేం కాదు’’ అన్నాను.‘‘కానీ, ఇక్కడ అంతా అంటున్నారు... మీ జీత్‌ను అక్కడే అమెరికాలో ఉండిపొమ్మని చెప్పండి, ఇండియా వస్తే అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తీసుకెళతారు... అని!’’అమ్మ ఏడుస్తూ చెబుతోంది.‘‘అమ్మా ఏం కాదు, ఊర్కో’’ అంటున్నాను, అమ్మ ఏడుస్తూనే ఉంది. అమ్మ నుంచి నాన్న ఫోన్ లాక్కోవటం లేదు! అంటే, నాన్న అక్కడి నుంచి వెళ్లిపోయారా? ఈ నాన్నలెందుకు కొడుకుల మీది కోపాన్ని తల్లుల మీద ప్రదర్శిస్తారు?! అన్లైన్ ఉద్యమాలు ఊరికే బొద్దింకల్లా పుట్టుకు రావు. వాటి ఆవిర్భావం వెనుక ఒక ఆవేదన ఉంటుంది. ఒక మహావేశం ఉంటుంది. సీజేపీ అనే మా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కూడా అలాగే ఉద్యమ రూపం తీసుకుంది. నిరుద్యోగుల ఆత్మగౌరవ సాధన సీజేపీ ప్రధాన లక్ష్యం, ప్రధాన పోరాటం.ఈ లక్ష్యాన్ని ఏర్పరిచింది, పోరాటానికి దారి చూపింది... సాక్షాత్తు భారత ప్రధాన న్యాయమూర్తి! ఆయనకు మా ఉద్యమ ధన్యవాదాలు. నిరుద్యోగులను ఆయన బొద్దింకలతో పోల్చారు! వాళ్లకు ఏ ఉద్యోగమూ దొరకదు అన్నారు! వారిలో కొందరు సోషల్ మీడియా కార్యకర్తలు అవుతారు అన్నారు. కొందరు ఆర్టీఐ యాక్టివిస్ట్‌ల అవతారం ఎత్తుతారు అన్నారు. అలా అని, ప్రపంచ భారతీయ బొద్దింకలన్నిటినీ ఆయనే ఏకం చేశారు. నిరుద్యోగులను బొద్దింకలు అన్నందుకు ‘చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా’ మీద ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి కోపమేం లేదు. అసలు ఆయన మీద గౌరవంతోనే మేము మా పార్టీకి ముందనుకున్నట్లుగా ‘కాక్రోచ్ జనతా ఇంపాక్ట్’ అనే పేరు పెట్టుకోలేదు. పెట్టుకుని ఉంటే అప్పుడది ‘సీజేఐ’ అయి ఉండేది. ‘సీజేఐ’ అన్నప్పుడల్లా ‘చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా’ అని అన్నట్లుగానూ ఉండేది!! -
అలా పుట్టిందే.. ఈ 'బొద్దింకల పార్టీ'
ఫ్రెంచ్ విప్లవం గురించి మనం పుస్తకాల్లో చదువుకున్నాం. రష్యాలో శ్రామిక వర్గం చేసిన తిరుగుబాట్ల గురించి విన్నాం. భారతదేశంలో జేపీ ఉద్యమం, అన్నాహజారే ఉద్యమం లాంటి వీధి పోరాటాలను కళ్లారా చూశాం. వీటన్నింటికీ ఒక వ్యవస్థ ఉండేది... ఒక బలమైన నాయకుడు ఉండేవాడు.. కోట్లాది రూపాయల నిధులు ఉండేవి. కానీ.. ఏ నాయకుడు లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా, కేవలం ఒక మీమ్ ఆయుధంగా, ఒకేఒక్క వారంలో జాతీయ రాజకీయ పార్టీలగుండెల్లో రైళ్లు పరిగెత్తించవచ్చని ఎవరైనా ఊహించారా?ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా, అత్యంత పటిష్టమైన ఐటీ సెల్ కలిగిన పార్టీగా భీకరంగా నిలబడ్డ భారతీయ జనతా పార్టీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల రికార్డును, కేవలం 120 గంటల్లో తుత్తునియలు చేస్తూ... ఏకంగా 1.80 కోట్ల ఫాలోవర్ల వైపు దూసుకుపోతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' ఇవాళ భారతదేశంలో అతిపెద్ద హాట్ టాపిక్!.నిశ్శబ్ద డిజిటల్ విప్లవంఇది కేవలం ఇంటర్నెట్లో సరదాగా నవ్వుకునే జోక్ కాదు. ఇది దేశ రాజకీయాలను కుదిపేస్తున్న ఒక నిశ్శబ్ద డిజిటల్ విప్లవం. దేశ యువతలో గూడుకట్టుకున్న అగ్నిపర్వతం బద్దలైన తీరు. అసలు ఈ 'బొద్దింకల పార్టీ' వెనుక ఉన్న వ్యూహకర్త ఎవరు? జెన్-జీ తరం ఎందుకు ఈ వైపు మొగ్గు చూపుతోంది? భారతదేశ భవిష్యత్తు రాజకీయాలను ఇది ఏ దిశగా నడపబోతోంది? ఏ వృక్షానికైనా పుట్టుకకు ఒక విత్తనం కావాలి. ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ' అనే మహా వృక్షం మొలకెత్తడానికి కారణం.. దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రాంగణంలో జరిగిన ఒక ఘటనే!ఆ అవమానాన్నే తమ అస్తిత్వంగా మార్చుకుని..మే 15, 2026 న సుప్రీంకోర్టులో బోగస్ సర్టిఫికెట్లు, ఫేక్ డిగ్రీల కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో... సర్వోన్నత న్యాయస్థానానికి చెందిన ఒక ప్రముఖ న్యాయమూర్తి, వ్యవస్థలపై బురదజల్లే కొంతమంది నిరుద్యోగ యువతను ఉద్దేశించి బొద్దింకలు, సమాజ పరాన్నజీవులు అనే పదునైన పదాలను ఉపయోగించారన్న వార్తలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. మరుసటి రోజే సదరు న్యాయమూర్తి తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని, వ్యవస్థలను మోసం చేసే దళారులను ఉద్దేశించి మాత్రమే తాను అన్నానని వివరణ ఇచ్చుకున్నప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైన ఆ అవమానకరమైన వ్యాఖ్యలు చూసి యువత కుంగిపోలేదు. రోడ్లెక్కి ధర్నాలు చేయలేదు, బంద్ కు పిలుపు ఇవ్వలేదు. అవును, మేము బొద్దింకలమే! మీ వ్యవస్థల అణు విస్ఫోటనాలను తట్టుకుని నిలబడే బొద్దింకలమే! అంటూ... ఆ అవమానాన్నే తమ అస్తిత్వంగా మార్చుకుని, ఎదురుదాడికి దిగారు. అలా పుట్టిందే ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ'.ఆ సోషల్ మీడియా చాణక్యుడు ఎవరు? ఇంతటి సంచలనానికి తెరలేపిన ఆ సోషల్ మీడియా చాణక్యుడు ఎవరు? ఆయన పేరే అభిజీత్ దీప్కే. మహారాష్ట్రలోని సంభాజీనగర్ కు చెందిన 30 ఏళ్ల యువకుడు. ఇతను ఏ రోడ్డు పక్కనో ఉండే సాధారణ మీమర్ కాదు. అమెరికాలోని ప్రతిష్టాత్మక బోస్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన మేధావి. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా విభాగంలో పనిచేసి, డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ పై ప్రజలను ఎలా ఆకర్షించాలో క్షుణ్ణంగా నేర్చుకున్న స్ట్రాటజిస్ట్. మే 16న అభిజీత్ తన ఎక్స్ ఖాతాలో ఒక సాధారణ గూగుల్ ఫామ్ లింక్ పెట్టి... మీరు కూడా సమాజంలో బొద్దింకలాగా అవమానాలు ఎదుర్కొంటున్నారా? అయితే రండి... మనమంతా కలిసి కాక్రోచ్ జనతా పార్టీ పెడదాం అని ఒక వ్యంగ్య పిలుపునిచ్చాడు. ఆశ్చర్యం! కేవలం 24 గంటల్లో లక్ష మంది... 48 గంటల్లో పది లక్షల మంది ఆ ఫారమ్‌ను నింపేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కాక్రోచ్ జనతా పార్టీ పేజీ ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే ఫాలోవర్ల సంఖ్య రాకెట్ లాగా దూసుకుపోయింది. దేశంలోని పెద్ద పెద్ద ఐటీ సెల్స్, వందల కోట్లు ఖర్చు పెట్టి పెంచలేని ఫాలోయింగ్‌ను... ఈ యువకుడు కేవలం తన ఆలోచనతో, వ్యంగ్యంతో సాధించి చూపించాడు. రోమన్ తత్వవేత్త సెనెకా అన్న ఒక మాట ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. దేశ యువత ఎప్పుడెప్పుడు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుదామా అని ఎదురుచూస్తున్న తరుణంలో... అభిజీత్ దీప్కే ఇచ్చిన 'కాక్రోచ్' బ్రాండ్ వారికి ఒక అద్భుతమైన అవకాశంగా దొరికింది.ప్రపంచ సోషల్ మీడియా చరిత్రలోనే..కేవలం ఒకే ఒక్క వారంలో 1.80 కోట్ల మంది ఫాలోవర్లు ఒక పార్టీ వైపు రావడం అనేది ప్రపంచ సోషల్ మీడియా చరిత్రలోనే ఒక అద్భుతం. ఇంతలా యువత ఎందుకు జాయిన్ అవుతున్నారు? దీని వెనుక కేవలం ఆ వ్యాఖ్యలపై మాత్రమే కోపం మాత్రమే లేదు. దీని వెనుక భారతీయ యువత ప్రతిరోజూ అనుభవిస్తున్న మూడు భయంకరమైన పీడకలలు, వ్యవస్థాగత వైఫల్యాలు దాగి ఉన్నాయి.బలమైన వేదికగా..భారతదేశంలో విద్యార్థుల భవిష్యత్తు పదే పదే రోడ్డున పడుతోంది. రాత్రింబవళ్లు కంటిమీద కునుకు లేకుండా, తల్లిదండ్రులు తిండి తిని తినక కూడబెట్టిన సొమ్ముతో కోచింగ్ సెంటర్లలో మగ్గిపోతున్న విద్యార్థులకు... పరీక్ష రాశాక తెలిసే నిజం ఏంటంటే.. పేపర్ లీక్ అయిందని. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష అక్రమాలు, రిక్రూట్మెంట్ బోర్డుల నిరంతర వైఫల్యాలు యువతలో తీవ్రమైన అశాంతిని, వ్యవస్థలపై పూర్తి నమ్మకరాహిత్యాన్ని పెంచాయి. తాము ఎంత చదివినా ఉపయోగం లేదు, డబ్బున్న వారికే సీట్లు, ఉద్యోగాలు దక్కుతాయనే నిరాశలో ఉన్న యువతకు... ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక బలమైన వేదికగా నిలిచింది.‘బద్ధకస్తులు, నిరుద్యోగుల అధికారిక గొంతుక’దేశంలో డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి చేతిలో ఉద్యోగం లేక, సమాజంలో తలదించుకుని తిరుగుతున్న 'జెన్-జీ' యువత సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ యువతను సాంప్రదాయ సమాజం ఏమని పిలుస్తోంది? ఫోన్లలో రీల్స్ చూసుకునే బద్ధకస్తులు, పనికిరాని వాళ్లు అని ముద్రిస్తోంది. అందుకే ఈ కాక్రోచ్ జనతా పార్టీ తన అఫీషియల్ బయో లో ఏమని రాసిందో తెలుసా? “బద్ధకస్తులు, నిరుద్యోగుల అధికారిక గొంతుక” అని. సమాజం తమను ఏ మాటలతో అయితే అవమానిస్తోందో... అదే మాటలను తమ ఆయుధాలుగా మార్చుకుని వ్యవస్థలపైకి విసిరారు ఈ జెన్-జీ యువత.మేనిఫెస్టో చూస్తే.. మైండ్ బ్లాక్ఈ కాక్రోచ్ జనతా పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో చూస్తే... పాలకుల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు ఒకసారి పరిశీలిద్దాం. రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ వయసు ఖరారు చేయాలి ప్రజాప్రతినిధులకు కనీస విద్యార్హత ఉండాలి. లగ్జరీ బంగళాలు, ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో విలాసాలు బంద్ చేయాలి, సాధారణ అపార్ట్మెంట్లు ఇవ్వాలి. జడ్జీలకు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదు. ఈ డిమాండ్లు ప్రతి సాధారణ భారతీయుడి మనసులో ఉన్నవే.అందుకే ఇది కేవలం సోషల్ మీడియా జోక్ కాదు, ఒక నిశ్శబ్ద రాజకీయ తిరుగుబాటు. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక వ్యక్తి కాదు... అది దేశ యువత ఆలోచనల ప్రతిరూపం!జెన్-జీ అరచేతిలో ఆయుధం ఇదే..ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నది 'జెన్-జీ' తరం అంటే 1997 నుంచి 2012 మధ్య పుట్టిన యువత. ఈ తరానికి పాతకాలపు రాజకీయ ఉపన్యాసాలు వినే ఓపిక లేదు. టీవీ స్టూడియోల్లో కూర్చుని నాయకులు ఒకరిపై ఒకరు అరుచుకునే డిబేట్లు చూస్తే అసహ్యం వేస్తుంది. వీరికి సుదీర్ఘమైన మేనిఫెస్టోలు వద్దు... వీరికి కావాల్సింది సటైర్, మీమ్స్॥ ఐరనీ. గతంలో రాజకీయ పార్టీలు ప్రజలను ఆకర్షించడానికి వందల కోట్లు ఖర్చు పెట్టి ర్యాలీలు తీసేవి, గోడ పత్రికలు వేసేవి, ఐటీ సెల్స్ ద్వారా ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవి. కానీ ఈ జెన్-జీ యువతకు ఇంటర్నెట్ అనేది అరచేతిలో ఉన్న ఆయుధం.సరికొత్త డిజిటల్ దండయాత్రఒక అంశాన్ని ఎలా ట్రెండ్ చేయాలో, దేనిని వైరల్ చేయాలో వారికి తెలిసినంతగా మరే తరానికీ తెలియదు. తమను అవమానించిన వ్యవస్థలను చూసి ఏడవడం కంటే... ఆ వ్యవస్థలను చూసి హేళనగా నవ్వడం... ఆ నవ్వులోనే పదునైన ప్రశ్నలు సంధించడం ఈ తరం నేర్చుకుంది. అందుకే, సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఈ సరికొత్త డిజిటల్ దండయాత్రను ఎలా ఎదుర్కోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి.సాంప్రదాయ పార్టీల గుండెల్లో వణుకుమహాత్మా గాంధీ గారి ఒక ప్రసిద్ధ వాక్యం ఈ పరిస్థితికి అద్దం పడుతుంది. మొదట వారు నిన్ను నిర్లక్ష్యం చేస్తారు, తర్వాత నిన్ను చూసి నవ్వుతారు, ఆ తర్వాత నీతో యుద్ధం చేస్తారు, చివరకు నీవే గెలుస్తావని. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. మొదట దీనిని ఒక 'మీమ్' అని లైట్ తీసుకున్నారు, తర్వాత నవ్వారు... కానీ ఇప్పుడు 1.80 కోట్ల ఫాలోవర్లు దాటాక... సాంప్రదాయ పార్టీల గుండెల్లో వణుకు మొదలైంది.దేశవ్యాప్తంగా మిగిలి ఉన్న అతిపెద్ద ప్రశ్న...ఇప్పుడు దేశవ్యాప్తంగా మిగిలి ఉన్న అతిపెద్ద ప్రశ్న... ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ' కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లోని లైకులు, షేర్లకే పరిమితమా? లేక రాబోయే రోజుల్లో నిజమైన ఓట్ల రాజకీయాలను శాసిస్తుందా? ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం... బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల్లో ఈ పార్టీకి సంబంధించిన రీజినల్ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు పుట్టుకొచ్చాయి. బీహార్‌లో జరగబోయే ఉపఎన్నికల్లో ఈ పార్టీ తరఫున స్వతంత్ర అభ్యర్థులను నిలబెడతామనే ప్రకటనలు కూడా వస్తున్నాయి.ఇది ఒక గట్టి హెచ్చరికతృణమూల్ కాంగ్రెస్ కి చెందిన కొందరు యువ ఎంపీలు సైతం ఈ మూవ్‌మెంట్‌ను సమర్థిస్తూ పోస్టులు పెట్టడం విశేషం. అయితే... నాణేనికి రెండో వైపు కూడా మనం చూడాలి. డిజిటల్ ప్రపంచంలో వచ్చే లైకులు, ఫాలోవర్లు ఎప్పుడూ 100 శాతం ఓట్లుగా మారవు. గతంలో కూడా ఆన్లైన్లో ఎన్నో ట్రెండ్స్ వచ్చాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. నిజమైన ఎన్నికల రాజకీయం అనేది క్షేత్రస్థాయిలో ఉండే కుల, మత, ఆర్థిక సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారి దేశాన్ని ఏలుతుందని అనుకోవడం అత్యాశే అవుతుంది. కానీ... ఇది ఒక గట్టి హెచ్చరిక!సాంప్రదాయ పార్టీలు ఇప్పటికైనా తమ పంథా మార్చుకోకపోతే, యువత సమస్యలను గాలికొదిలేస్తే.. సోషల్ మీడియా ద్వారా ఎలాంటి ప్రత్యామ్నాయ శక్తులు పుట్టుకొస్తాయో చూపించడానికి ఇదొక సజీవ సాక్ష్యం. తెలుగు జాతి గర్వించదగ్గ మహాకవి శ్రీశ్రీ అన్నట్లు నేనొక దుర్గం, నేనొక సంవర్తం, నేనొక తిరుగుబాటు... నా గొంతుకలో రగిలే ఆక్రోశం రేపటి నవయుగానికి బాట. ఇవాళ భారత యువత గొంతుకలో రగులుతున్న ఆక్రోశమే ఈ కాక్రోచ్ జనతా పార్టీ.చివరిగా చెప్పేది ఒక్కటే...ఏ యువతనైతే "బొద్దింకలు" అని ఈసడించుకున్నారో... అదే బొద్దింకలు ఇవాళ డిజిటల్ ప్రపంచంలో సామ్రాజ్యాలు ఏలుతున్న పాలకుల సింహాసనాల పునాదులను కదిలిస్తున్నాయి. బొద్దింకల శాస్త్రీయ ప్రత్యేకత తెలుసా? ఎంతటి భయంకరమైన అణు విస్ఫోటనం జరిగినా, రేడియేషన్‌ను తట్టుకుని భూమిపై బ్రతకగలిగే ఏకైక జీవి బొద్దింక! ఇవాళ భారత యువత కూడా తాము అన్ని కష్టాలను, పేపర్ లీకేజీలను, నిరుద్యోగాన్ని, లంచగొండితనాన్ని తట్టుకుని నిలబడే కఠినమైన బొద్దింకలమేనని... తమను తక్కువ అంచనా వేసి తొక్కిపారేయాలని చూస్తే ఊరుకునేది లేదని ఈ డిజిటల్ విప్లవం ద్వారా చాటిచెబుతోంది.ఇది కేవలం ఒక మీమ్ పేజీ విజయమో, లేదా అభిజీత్ దీప్కే అనే వ్యక్తి చాణక్యమో కాదు... ఇది వ్యవస్థలపై సామాన్యుడు సాధించిన నిశ్శబ్ద విజయం. పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. యువతకు కేవలం ఉచిత పథకాలు, వాగ్దానాలు ఇస్తే సరిపోదు... వారికి పారదర్శకమైన వ్యవస్థలు కావాలి, ఉద్యోగాలు కావాలి, గౌరవం కావాలి. అది ఇవ్వనంత కాలం... ఇలాంటి వేలాది కాక్రోచ్ జనతా పార్టీలు పుడుతూనే ఉంటాయి... పాలకులను ప్రశ్నిస్తూనే ఉంటాయి.- కంచర్ల యాదగిరిరెడ్డి, Managing Editor, సాక్షి టీవీ -
దేశ రాజకీయాలను కుదిపేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీపై ఎడిటర్స్ కామెంట్
-
కాక్రోచ్ జనతా పార్టీకి కర్ణాటక మంత్రుల మద్దతు!
సాక్షి బెంగళూరు: సోషల్ మీడియా వేదికగా ఇటీవల పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీకి కన్నడనాడు కర్ణాటకలో కూడా మద్దతుదారులు పెరిగారు. ఏకంగా రాష్ట్ర మంత్రులు సైతం ఈ ఆన్లైన్ పోర్టల్‌కు మద్దతు ప్రకటించారు. దేశ సమస్యలపై కేంద్రం స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో యువతలో పెల్లుబికిన ఆగ్రహమే ఈ కాక్రోచ్ జనతా పార్టీ’ అని మంత్రి శరణ ప్రకాశ్ పాటిల్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. నిరుద్యోగం, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ తదితర కారణాల వల్ల యువత ఆగ్రహంతో ఉంది. వారి సమస్యలపై కేంద్రం స్పందించడం లేదని మండిపడ్డారు. మరో మంత్రి సంతోష్ లాడ్ కూడా కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలిపారు. యువత డిజిటల్ పోరాటంపై తనకు సంతోషంగా ఉందని, ఇలాంటి పోరాటం ప్రస్తుతం అవసరమని, తన మద్దతు కచ్చితంగా ఉంటుందని చెప్పారు. అలాగే సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చ సాగుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఈ పార్టీకి అనుకూలంగా చాలా మంది వీడియోలు, పోస్టులు పెడుతున్నారు. ఈ నెల 24న కాక్రోచ్ జనతా పార్టీ శాంతియుత మానవహారాన్ని నిర్వహిస్తోందంటూ ఒక పోస్టర్ షేర్ అవుతోంది. బెంగళూరు టౌన్‌హాల్ ఎదుట ఆదివారం ఉదయం 11 గంటలకు ఆందోళన చేపడుతున్నట్లు ఆ పోస్టర్లో పేర్కొన్నారు. యువతకు భవిష్యత్తు లేదని, ధరల పెరుగుదల, నీట్ పేపర్ లీకేజీ, ఓట్ల చోరీ తదితర అంశాలపై యువత పోరాటం అనే పేరిట ఈ పోస్టర్ ప్రచురితమైంది. -
ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే
న్యూఢిల్లీ: నీట్(యూజీ)–2026 పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పారీ్ట(సీజేపీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియాలో పోరాటం ఆరంభించింది. ఆ పార్టీ ‘ఎక్స్’ఖాతాలను ప్రభుత్వం నిలిపివేయడంతో ‘కాక్రోచెస్ నెవర్ డై’అనే ట్యాగ్‌లైన్‌తో ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’పేరిట కొత్త ఖాతాను సృష్టించుకుంది. ఇదే ఖాతా నుంచి పోస్టులు చే స్తోంది. ఇన్స్టా్రగామ్లోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది. విద్యా రంగంలో కేంద్రం దారుణంగా విఫలమైందని, పరీక్షలు సైతం సక్రమంగా నిర్వహించలేకపోతోందని సీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ ఆన్లైన్లో పెట్టిన పిటిషన్‌కు మద్దతు ఇవ్వాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కోరారు. తాజాగా ఒక వీడియో సందేశం పోస్టుచేశారు. ‘‘బొద్దింకల్లారా.. ఎలా ఉన్నారు? ఇంటర్నెట్లో మీరంతా బాగా రాణిస్తున్నారని అందరూ అంటున్నారు. కానీ ఇప్పుడు నిజమైన పని చేయాల్సిన సమయం వచ్చింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఈ రోజు ఆన్లైన్లో ఒక పిటిషన్‌ను ప్రారంభిస్తున్నాం. దీనికి అందరూ మద్దతివ్వాలి’’అనికోరారు. విద్యా వ్యవస్థలోని వైఫల్యాలు విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే జవాబుదారీతనం ఉండాలన్నారు. అందుకు సమయం వచ్చిందన్నారు. 22 లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినడానికి, నీట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి వ్యవస్థే కారణమని ఆరోపించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని అభిజిత్ దీప్కే తేల్చిచెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తనకు బెదిరింపులు కూడా వచ్చాయని పేర్కొన్నారు. చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారని చెప్పారు.దీప్కే భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే భద్రతపై ఆయన తల్లిదండ్రులు భగవాన్, అనితా దీప్కే ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడి ప్రాణాలకు ఎవరైనా ముప్పు తలపెట్టే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. ఆ పార్టీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. పార్టీ ఎక్స్ ఖాతాను ప్రభుత్వం నిలిపివేసింది. మరోవైపు అభిజిత్‌కు బెదిరింపులు సైతం వస్తున్నట్లు తెలుస్తోంది. తమ కుమారుడు ఇబ్బందుల్లో పడతాడేమో లేక అరెస్టును కూడా ఎదుర్కొంటాడేమోనన్న భయంతో తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. అభిజిత్‌కు ఆమ్ ఆద్మీ పారీ్టతో సంబంధాలున్నాయి. అతడి తల్లిదండ్రులు మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో నివసిస్తున్నారు. తమ బిడ్డ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం తమకు ఎంతమాత్రం ఇష్టం లేదని వారు చెప్పారు. అతడి భద్రత పట్ల ఆందోళన చెందుతున్నామని, నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నామని వెల్లడించారు. ఇంటికి తిరిగిరావాలని అభిజిత్‌ను కోరారు. -
ఇలాంటిదేదో జరుగుద్దని ముందే ఊహించాం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యల నేపథ్యంలో గతవారం సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ‘ఎక్స్’ఖాతాను ప్రభుత్వం గురువారం నిలిపివేసింది. అయితే గంటల వ్యవధిలో ఆ పార్టీ ‘కాక్రోచెస్ డోంట్ డై’ట్యాగ్‌లైన్‌తో ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’పేరిట మరోఖాతాను సృష్టించుకుంది. తమ ఖాతాను హ్యాక్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయని, నిలిపివేస్తారని కూడా ముందే ఊహించామని పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చెప్పారు. ఇది ప్రభుత్వం తనకు తాను చేసుకున్న తప్పిదం అని పేర్కొన్నారు. దీనిపై చట్టపరంగా పోరాడుతామని వెల్లడించారు. ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’పేరుతో ‘ఎక్స్’లో కొత్త ఖాతా ప్రారంభించామని తెలిపారు. తమ ఖాతా, ఉద్యమం వేగంగా జనంలోకి చొచ్చుకెళ్తున్నాయని స్పష్టంచేశారు. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ ఖాతా ప్రారంభం కాగా.. మళ్లీ ఫాలోవర్స్ విషయంలో దూసుకుపోతోంది. అందుకే తప్పుడు ప్రచారంతమ ఉద్యమాన్ని చూసి ప్రభుత్వం భయపడుతోందని, అందుకే ఖాతాను నిలిపివేసిందని అభిజిత్ దీప్కే విమర్శించారు. అంతేకాదు.. సీజేపీ విషయంలో జరుగుతున్న ప్రచారంపైనా ఆయనో క్లారిటీ ఇచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ లాంటి ఇస్లాం ప్రభావిత దేశాల నుంచే దానికి ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారని, ఫేక్.. బోట్(కంప్యూటర్ ఆపరేటెడ్) అకౌంట్లు ఉన్నాయని(కొందరు వీడియోలు పెట్టారు.. అవి ఫేక్ అని అభిజిత్ అంటున్నారు).. జనతా కాక్రోచ్ పార్టీ ప్రొపగాండ క్యాంపెయిన్ అని, తాను ఆప్ ఏజెంట్‌నని(అభిజిత్ దీప్కే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీంలో పని చేశారు), దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని, ఇది ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చే విదేశీ కుట్ర వ్యవహారమంటూ జరుగుతున్న ప్రచారాలన్నింటినీ ఆయన ఖండించారు. ఒకవైపు నిరుద్యోగ యువత ఈ ఉద్యమంలో చేతులు కలుపుతుంటే.. పనికిమాలిన వాళ్లే అలాంటి ప్రచారాలు నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చాడు. I know you are desperately trying to hack the account but since you have failed to do so. Let me share the real data.Why would you call 94% of Indian youth as Pakistanis? https://t.co/547NtEP934 pic.twitter.com/9DRTx6l96e— Abhijeet Dipke (@abhijeet_dipke) May 21, 2026ఇన్‌స్టాగ్రామ్‌లో 18 మిలియన్లు క్రాస్ఉపాధి, ఉద్యోగాలు లేని యువత పరాన్నజీవులు, బొద్దింకల మాదిరిగా వ్యవస్థలపై దాడి చేస్తున్నారని జస్టిస్ సూర్యకాంత్ ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా ఆక్షేపించారు. దీనిపై నిరసన వ్యక్తంచేస్తూ అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించారు. నిజానికి ఇదొక వ్యంగ్య డిజిటల్ పార్టీ. సోషల్ మీడియాలో యువత విపరీతంగా ఆకర్షితులయ్యారు. సామాజిక కార్యకర్తలు, కళాకారులు ఆ పార్టీకి మద్దతుగా నిలిచారు. పలు రాజకీయ పార్టీ నేతలు, మేధావులు కూడా అండగా నిలిచారు. పార్టీ ‘ఎక్స్’ఖాతాకు ఫాలోవర్ల సంఖ్య లక్షల్లో చేరింది. ఇన్‌స్టా్రగామ్‌లో అనుసరించేవారి సంఖ్య 18 మిలియన్లు దాటేసింది. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ విషయంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న కాంగ్రెస్, రెండో స్థానంలో ఉన్న బీజేపీలను సీజేపీ అధిగమించినట్లైంది. కాక్రోచ్ జనతా పార్టీ పదునైన రాజకీయ విమర్శలు, వ్యాఖ్యానం ద్వారా ఆదరణ పొందుతోంది. సమకాలీన అంశాలపై చర్చ.. నిరుద్యోగం, పరీక్ష పత్రాల లీక్‌లు, విద్యా వ్యవస్థ తీరుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ప్రధానంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తోంది. అందుకే దీనికి దేశద్రోహి, ప్రభుత్వ వ్యతిరేక ముద్ర వేసి తిట్టి పోస్తున్నారు. అయితే వాళ్లకు స్వయంగా అభిజిత్ కౌంటర్ ఇస్తుండడం గమనార్హం. ఈ సమయంలో కాక్రోచ్ జనతా పారీ్టకి సంబంధించిన తొలి ‘ఎక్స్’ఖాతా గురువారం నుంచి నిలిచిపోవడం.. కాసేపటికే కొత్త అకౌంట్ ప్రత్యక్షం కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, ‘ఎక్స్’లో ద కాక్రోచ్ యూత్, కాక్రోచ్ న్యూస్, ఐయామ్ కాక్రోచ్, కాక్రోచ్ పార్టీ ఆఫ్ ఇండియా, కాక్రోచ్ జనతా పారీ్ట(జెన్ జెడ్) పేరిట ఖాతాలు చురుగ్గా పని చేస్తున్నాయి. -
‘కాక్రోచ్ జనతా పార్టీ’ సునామీ : ఎవరీ అభిజీత్?
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janta Party - CJP) గురించే చర్చ నడుస్తోంది. కేవలం కొద్ది రోజుల్లోనే మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుని, దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల కంటే వేగంగా దూసుకుపోతున్న ఈ సరికొత్త వ్యంగ్య (Satirical) ఉద్యమం వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఈ వైరల్ ట్రెండ్ వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు తెలుసా?భారతదేశ యువతను అనూహ్యంగా ఆకట్టుకున్న సీజేపీ వెనుక ఉన్న ఆ సంచలనం పేరు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke). ఉద్యోగాలు లేక, సమాజంలో గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ సోషల్ మీడియా, ఆర్టీఐ (RTI) యాక్టివిస్టులుగా మారి వ్యవస్థపై దాడి చేసే కొంతమంది నిరుద్యోగ యువతను "బొద్దింకలు" (Cockroaches), "సమాజానికి పట్టిన పరాన్నజీవులు" (Parasites) అన్న భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు ఆన్లైన్లో ప్రతిస్పందనగా 30 ఏళ్ల ఈ రాజకీయ ప్రచార వ్యూహకర్త, అభిజీత్ ప్రారంభించిందే కాక్రోచ్ జనతా పార్టీ. ఇది ఇప్పుడు సునామీలా మారింది. ఆపై సీజేఐ వివరణ ఇచ్చుకున్నప్పటికీ .. ‘బొద్దింక’ అనే పదాన్ని ఒక ఆయుధంగా మార్చుకున్నారు అభిజీత్.యువతను అవమానించిన ఆ పదంతోనే సరికొత్త వ్యంగ్య రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టారు. ఫలితంగా సీజేపీ పార్టీ ఆవిర్భవించింది. ఆ పార్టీ వెబ్ సైట్ అండ్ అజెండా తమను తాను "సోమరులు, నిరుద్యోగ యువత పక్షపాతి" (Voice of the lazy and unemployed youth) గా ప్రకటించుకుంది. 'Secular, Socialist, Democratic, and Lazy' అనే ట్యాగ్‌లైన్‌తో నడుస్తున్న ఈ డిజిటల్ పార్టీకి కేవలం ఐదు రోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ల (1.2 కోట్లు) కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు వచ్చారు. ఇది దేశాన్ని ఏలుతున్న బీజేపీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. దీని ఆవిర్భావం కేవలం జోక్ కాదు.. యువత ఆక్రోశం! ఇంటర్నెట్ జోక్ లాగా మొదలైనప్పటికీ, దేశంలోని నిరుద్యోగం, నీట్ (NEET) పేపర్ లీకేజీలు, పరీక్షల కుంభకోణాలపై యువతలో ఉన్న అసంతృప్తిని ఈ వేదిక ప్రతిబింబిస్తోంది.పార్టీలో చేరడానికి వింత నియమాలు:కచ్చితంగా నిరుద్యోగి అయి ఉండాలి (బలవంతంగానైనా, స్వచ్ఛందంగానైనా). విపరీతమైన సోమరితనం ఉండాలి (శారీరక శ్రమ పరంగా మాత్రమే). రోజుకు కనీసం 11 గంటలు ఆన్లైన్లోనే గడపాలి (Chronically Online). ప్రొఫెషనల్‌గా, లాజికల్‌గా వ్యవస్థపై విమర్శలు (Rant) గుప్పించగలిగే నైపుణ్యం ఉండాలి. ఇంతకీ ఎవరీ అభిజీత్ దిప్కే?పూణేలో జర్నలిజం చదివిన అభిజీత్, ఆ తర్వాత అమెరికాలోని ప్రముఖ బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ (PR) లో మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన నిరుద్యోగి.Now attempts being made to hack Instagram pic.twitter.com/doFskK9D7Z— Abhijeet Dipke (@abhijeet_dipke) May 21, 2026ఆమ్ ఆద్మీ నేపథ్యం సీజేపీని ప్రారంభించడానికి ముందు, దీప్కే 2020 - 2023 మధ్య ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేశారు. సోషల్ మీడియా విభాగంలో పనిచేశారు 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ విజయం సాధించినప్పుడు, దీప్కే రాజకీయ సందేశాలు మరియు యువతను చేరుకోవడంపై దృష్టి సారించిన మీమ్-ఆధారిత డిజిటల్ ప్రచారంపై పనిచేశారు.2024లో తన వ్యక్తిగత ఎదుగుదల, ఆర్థిక స్థిరత్వం కోసం ఆప్ నుండి బయటకు వచ్చి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. మేనిఫెస్టోకేవలం మీమ్స్ కే పరిమితం కాకుండా 5 అంశాలతో కూడిన ఒక మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. జడ్జీలకు పదవీ విరమణ తర్వాత రాజ్యసభ సీట్లు వంటి రాజకీయ ప్రయోజనాలు కల్పించకూడదు.పార్టీ ఫిరాయింపులపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.తాము కూడా ఆర్టీఐ (RTI) పరిధిలోకి వస్తామని, ఎలాంటి అజ్ఞాత విరాళాలు (Electoral Bonds) తీసుకోబోమని స్పష్టం చేయడం. మహువా మోయిత్రా, ప్రశాంత్ భూషణ్ వంటి ప్రముఖులు సైతం ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. సంప్రదాయ రాజకీయాల్లో డబ్బు, అంగబలం ఉన్నవారే రాజ్యమేలుతున్న తరుణంలో.. ఈ జెన్ జెడ్ (Gen Z) యువత కేవలం మీమ్స్, రీల్స్ ద్వారా డిజిటల్ విప్లవాన్ని సృష్టిస్తూ దేశంలోనే సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. As expected Cockroach Janta Party’s account has been withheld in India. pic.twitter.com/44ymllnSMJ— Abhijeet Dipke (@abhijeet_dipke) May 21, 2026ఇంతలోనే భారీ షాక్మే 16న ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ' ఖాతా ఇ వలం 4 రోజుల్లోనే, ఆ ఖాతాకు 2 లక్షలకు పైగా ఫాలోవర్లు చేరడంతో అది నిషేధించబడింది అంటూ అభిజీత్ ట్వీట్ చేశారు. మే 16న ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ' ఖాతా ఇ వలం 4 రోజుల్లోనే, ఆ ఖాతాకు 2 లక్షలకు పైగా ఫాలోవర్లు చేరడంతో అది నిషేధించబడింది అంటూ అభిజీత్ ట్వీట్ చేశారు. ఊహించినట్టే, ' కాక్రోచ్ జనతా పార్టీని ఇండియాలో నిలిపివేశారని పేర్కొన్నారు. -
‘ఇన్‌స్టా’లో రికార్డ్.. ‘ఎక్స్’లో బ్లాక్.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కథ కంచికి?
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఊహించని రీతిలో దూసుకుపోతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)కి గట్టి షాక్ తగిలింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అధికార బీజేపీ అధికారిక ఖాతా కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకుని రికార్డు సృష్టించిన కొద్ది గంటల్లోనే, ఈ పార్టీకి చెందిన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా భారతదేశంలో బ్లాక్ అయ్యింది. యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ డిజిటల్ ఉద్యమ అకౌంట్ బ్లాక్ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.బీజేపీని దాటేసిన క్రేజ్!కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 10 మిలియన్ల (కోటి) ఫాలోవర్ల మార్కును దాటేసింది. ప్రస్తుతం 8.7 మిలియన్ల ఫాలోవర్లతో ఉన్న బీజేపీ అధికారిక ఇన్‌స్టా ఖాతాను ఇది అధిగమించింది. కాంగ్రెస్ 13 మిలియన్ల ఫాలోవర్లతో ముందుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ చాలా వెనుకబడి ఉంది. ఈ మైలురాయిని అందుకున్న కొన్ని గంటల్లోనే ‘సీజేపీ’ ఎక్స్ అకౌంట్‌ను భారత్‌లో బ్లాక్ చేశారు. ‘మేము ఊహించినట్టే జరిగింది’ అంటూ ఈ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ స్పందించారు.సుప్రీం వ్యాఖ్యల నుండి పుట్టిన ఉద్యమంనిరుద్యోగం, పేపర్ లీకేజీలు, రాజకీయాలపై విసుగు చెందిన జెన్-జీ యువత ఆవేదన నుండి పుట్టిన పొలిటికల్ సెటైర్ మూవ్మెంట్ ఇది. గత వారం ఒక కోర్టు విచారణలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. నిరుద్యోగులు, ఆన్లైన్ యాక్టివిస్టులను ఉద్దేశించి ‘బొద్దింకలు’,'పరాన్నజీవులు' అని వ్యాఖ్యానించారనే వార్తలతో ఈ ఉద్యమం మొదలైంది. ఆ వ్యాఖ్యలను సవాలు చేస్తూ, యువత ఈ వినూత్న పార్టీని స్థాపించారు. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని, నకిలీ డిగ్రీల వారినే తానలా అన్నానని సీజేఐ వివరణ ఇచ్చినప్పటికీ నెటిజన్ల ఆగ్రహం చల్లారలేదు.సెలబ్రిటీల మద్దతు.. భారీ నెట్వర్క్బోస్టన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, మాజీ ఆప్ సోషల్ మీడియా కార్యకర్త అయిన 30 ఏళ్ల అభిజీత్ దిప్కే ఈ వినూత్న మూవ్‌మెంట్‌ను ప్రారంభించారు. ‘సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ’ అనే నినాదంతో, కేవలం హాస్యం, మీమ్స్ ఆధారంగా యువతను ఇది విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వైవిధ్యమైన డిజిటల్ ప్రచారానికి ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్, టీఎంసీ ఎంపీలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్ వంటి ప్రముఖులు కూడా మద్దతు తెలపడం విశేషం.ఇది కూడా చదవండి: ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా సీజేపీ! -
ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా సీజేపీ!
మే 2026.. భారత్‌లో అద్భుతమైన ఘట్టం చోటుచేసుకుంది. పార్టీ పెట్టి వారం తిరగకముందే కాక్రోచ్ జనతా పార్టీ పెను సంచలనాలు సృష్టిస్తోంది. ఏకంగా బీజేపీ లాంటి దిగ్గజ పార్టీని మించిపోయి.. కురువృద్ధ పార్టీ కాంగ్రెస్‌ను సైతం పక్కకు నెట్టేసే దిశగా దూసుకుపోతోంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగంగా.. అతిపెద్ద పార్టీగా ఎదగడానికి సిద్ధమైంది.సీజేపీ.. కాక్రోచ్ జనతా పార్టీ. ఇది ప్రస్తుతానికి రాజకీయ పార్టీ కాదు. కేవలం వ్యంగ్య ఉద్యమం(సెటైర్) అని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాళ్లకు చెప్పనక్కర్లేదు. కానీ, డిజిటల్ ఫ్లాట్ఫారమ్లలో గత నాలుగైదు రోజులుగా మామూలు సత్తా చాటడడం లేదు. ముఖ్యంగా జెన్ జీ యువత ఆదరణ, మద్దతుతో దూసుకుపోతోంది. సో.మీ. ఫాలోవర్స్ విషయంలో బీజేపీని ఇప్పటికే దాటేసింది సీజేపీ. ఆ విషయాన్ని కూడా అంతే వెటకారంగా ప్రకటించుకుంది. ప్రస్తుతానికి అత్యధిక ఫాలోవర్స్ ఉన్న పార్టీగా కాంగ్రెస్ ఉంది. సీజేపీ దూకుడు చూస్తుంటే.. రేపో, మాపో ఆ ఫిగర్‌ను దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే ఆన్లైన్లో ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న పార్టీ(నాన్ పొలిటికల్)గా సీజేపీ నిలవనుంది.World’s largest party they said🤭 pic.twitter.com/dT9TOFKZoZ— Cockroach Janta Party (@CJP_2029) May 20, 2026అలా పుట్టింది..మే 15, 2026న సుప్రీం కోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి. కొంతమంది యువకులు బొద్దింకల్లాంటివాళ్లు.. అని ఆయన చేసిన వ్యాఖ్యలు నిరుద్యోగ యువతలో ఆగ్రహాన్ని రగిల్చాయి. పెద్ద సంఖ్యలో యువత దీన్ని అవమానకరంగా భావించి వ్యంగ్యరూపంలో ప్రతిస్పందించారు. అలాంటి వాళ్లలో అభిజీత్ దిప్కే ఒకడు. ఈ ఒక్కడే ఈ పెను సంచలనానికి కేంద్ర బిందువయ్యాడు.మహారాష్ట్రలో పుట్టి, పుణేలో జర్నలిజం చదివిన అభిజిత్.. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ చేస్తున్నాడు. గతంలో ఆప్ వలంటీర్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు డిజిటల్ క్యాంపెయిన్, మీమ్ కల్చర్‌లో ప్రత్యేక నైపుణ్యం ఇచ్చింది. ఆ నైపుణ్యంతో కాక్రోచ్ జనతా పార్టీ అంటూ సెటైరిక్ పేజీని ప్రారంభించాడు.సీజేఐ వివరణ.. చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. దీంతో యువతపై తాను చేసిన వ్యాఖ్యలను పొరపాటుగా మీడియా చూపించిందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు. ఫేక్ డిగ్రీలతో వృత్తుల్లోకి వచ్చినవాళ్లను మాత్రమే ఉద్దేశించి తాను అలా అన్నానని ఆయన చెప్పారు. భారత యువతపై తాను ఎలాంటి విమర్శ చేయలేదని.. పైగా వాళ్లను చూసి గర్వపడుతున్నానని.. వాళ్లే దేశాభివృద్ధికి మూలస్తంభాలని వ్యాఖ్యానించారు. అయితే.. అప్పటికే సీజేపీ జోరు మొదలైంది.మేము సైతం.. మే 16న గూగుల్ ఫారమ్ ద్వారా అభిజిత్ సీజేపీ సభ్యత్వం ప్రారంభించాడు. వాయిస్ ఆఫ్ లేజీ అండ్ అన్‌ఎంప్లాయిడ్ అనే నినాదం ఇచ్చాడు. “సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ” అనే వ్యంగ్య సిద్ధాంతాలతో పార్టీ ముందుకు సాగుతోందని ప్రకటించాడు. అప్పటికే సీజేఐ తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నా.. పెద్ద సంఖ్యలో యువత మాత్రం వెనక్కి తగ్గలేదు. కాక్రోచ్ పార్టీకి మద్దతు తెలిపేలా ‘‘మేము కూడా కాక్రోచులమే’ అంటూ ఫాలో బటన్‌ను క్లిక్ చేస్తూ, సభ్యత్వం తీసుకుంటూ తమ అసంతృప్తిని డిజిటల్ వేదికలపై భారీగా వ్యక్తం చేస్తూ వస్తున్నారు.అలా.. మే 17–20 మధ్య జస్ట్ నాలుగురోజుల్లోనే వెబ్ పేజీకి నాలుగు లక్షలకు పైగా సభ్యులు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 9 మిలియన్ ఫాలోవర్లు వచ్చి చేరారు. తద్వారా ఆప్, బీజేపీ పార్టీలను చాలా దూరం నెట్టేశారు. సీజేపీ జోరు చూస్తుంటే కాంగ్రెస్‌ను కూడా దాటేందుకు ఎంతో సమయం పట్టేలా కనిపించడం లేదు. అలాగని ఇది పూర్తి సెటైరిక్ మూమెంట్‌గా ఉండిపోలేదు. అర్థవంతమైన చర్చలు, సమకాలీన అంశాలపై మేధావులతో డిబేట్లు, అభిప్రాయ సేకరణ.. ఇలా ఈ ఉద్యమం ప్రత్యేకంగా నిలిచింది. మా లక్ష్యం ఎన్నికల్లో గెలవడం కోసం కాదు, ఉద్యోగ సమస్యలు, పరీక్షల మోసాలు, యువత నిరాశ వంటి అంశాలను వ్యంగ్యరూపంలో వెలుగులోకి తేవడమే. ఇది యువతను అవమానపరిచిన వ్యాఖ్యకు ప్రతిస్పందన. మేము కాక్రోచులం అనే గుర్తింపుని స్వీకరిస్తున్నాం. ఎందుకంటే దేశ వ్యవస్థ అంతగా కుళ్లిపోయింది కాబట్టి. ఆ కుళ్లులోనే కాక్రోచులు బయటకు రావాల్సి వస్తోంది. ఇది సెటైరిక్ ఉద్యమం కావొచ్చు. అలాగని ఇదేం జోక్ కాదు. దేశంలో ఉన్న కోట్లాది మంది నిరుద్యోగుల గొంతుకంగా మారింది అని చెబుతున్నాడు. అయితే నేపాల్, బంగ్లాదేశ్‌లా జెన్‌జీ ఉద్యమానికి ఇది దారి తీస్తుందా? అనే ప్రశ్నకు ఆయన నుంచి నో అనే సమాధానమే వచ్చింది. FYI pic.twitter.com/XCkclwy50K— Cockroach Janta Party (@CJP_2029) May 19, 2026👉సీజేఐ ఏమన్నారంటే.. కొంత మంది బొద్దింకల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉద్యోగాల్లేని యువత.. సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలుగా మారి, వ్యవస్థపై దాడి చేస్తున్నారు. 👉సీజేఐ వ్యాఖ్యల్ని సమర్థించిన వర్గాలు: బొద్దింకలతో పోల్చడం అంటే.. యువతలోని సహనశక్తి, ఎక్కడైనా బతికే సామర్థ్యం ఉంది.👉విమర్శించిన వర్గాలు: మేం కాక్రోచ్‌లమే అంటూ వెటకారంగా స్పందించినా.. నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది ఆ పేజీ ఫాలోయింగ్. పైగా ఆ ప్లాట్‌ఫారమ్‌లలో జరుగుతున్న డిబేట్లలో కామెంట్ల రూపంలో అభిప్రాయాలు తెలియజేస్తున్నారు👉రాజకీయ విశ్లేషకులు: ఇది ఒక “సోషల్ మీడియా విప్లవం”. నిరుద్యోగ యువత అసంతృప్తిని వ్యంగ్యరూపంలో వ్యక్తం చేస్తున్నారు.👉ప్రతిపక్ష నేతలు: భారతీయ యువతలోని నిరాశను ప్రతిబింబిస్తోంది. ప్రభుత్వం ఉద్యోగాలపై దృష్టి పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది👉ప్రభుత్వ అనుకూల వర్గాలు: ఇది కేవలం వ్యంగ్య ఉద్యమం మాత్రమే, నిజమైన రాజకీయ శక్తిగా మారడం కష్టంఅభిజిత్ ఎన్ని వివరణలు ఇస్తున్నప్పటికీ.. వ్యంగ్య ఉద్యమం నుంచి డిజిటల్ విప్లవంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ జెన్‌జీ మద్దతుతో ఏదైనా పెను ఉద్యమానికి దారి తీస్తుందా? లేదంటే రాజకీయ సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుందా? అనేది కాలమే నిర్ణయించాలి. -
‘కాక్రోచ్ జనతా పార్టీ’ vs ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’?
న్యూఢిల్లీ: భారతదేశ రాజకీయ ముఖచిత్రంలో నిత్యం కూటములు, చీలికలు, వాట్సాప్ వార్ రూమ్‌ల హడావుడిని చూస్తూనే ఉంటాం. అయితే, దేశంలో ఎన్నడూ లేని విధంగా ఒక సరికొత్త ‘బయోలాజికల్’ డిజిటల్ రాజకీయ యుద్ధం మొదలైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన ‘బొద్దింకలు’, ‘పరాన్నజీవులు’ (కాక్రోచెస్, పారాసైట్స్) అనే వివాదాస్పద వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అయితే, యువత ఈ అవమానాన్ని కేవలం నిరసనగా మార్చకుండా, ఒక వినూత్న వ్యంగ్య రాజకీయ ఉద్యమంగా మలిచారు. దీని ఫలితంగానే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ), ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’ (ఎన్పీఎఫ్) వంటి వ్యంగ్య పొలిటికల్ గ్రూపులు నెట్టింట ప్రభంజనం సృష్టిస్తున్నాయి.కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్థానం (CJP)‘ఎక్కడ వైఫై ఉంటే అదే మా ప్రధాన కార్యాలయం’ అంటూ అభిజీత్ దిప్కే అనే యువకుడు మే 16న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని స్థాపించారు. కేవలం నాలుగు రోజుల్లోనే ‘ఎక్స్’, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ పేజీకి ఏకంగా 10 లక్షల (మిలియన్) పైగా ఫాలోవర్స్ వచ్చారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ప్రవేశ పరీక్షల భారంతో నలిగిపోయే యువతకు ఈ వేదిక ఒక ఆయుధంగా మారింది. వీరి మేనిఫెస్టోలో.. రిటైర్మెంట్ తర్వాత చీఫ్ జస్టిస్‌లకు రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదని, తప్పుడు వార్తలు రాసే మీడియాపై చర్యలు తీసుకోవాలని, మహిళలకు కేబినెట్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయడం గమనార్హం. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్ వంటి ప్రముఖులు కూడా దీనిపై ఆన్లైన్లో స్పందించడంతో ఈ ఉద్యమానికి మరింత ప్రచారం లభించింది. (Cockroach Janta Party Story)దూసుకొచ్చిన ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’(NPF)రాజకీయాల్లో ఖాళీలు ఉండవు కాబట్టి, సీజేపీకి పోటీగా ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’ రంగంలోకి దిగింది. పరాన్నజీవులుగా ముద్రపడిన సాధారణ పౌరుల తరఫున తామే అసలైన ప్రతిపక్షం అని ఈ గ్రూప్ ప్రకటించుకుంది. ‘వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికే మేము ఈ విరిగిన వ్యవస్థతో అతుక్కుపోయాం’ అని ఎన్పీఎఫ్ తన వెబ్సైట్లో పేర్కొంది. పార్లమెంట్లో నేరస్థులు ఉండకూడదని, చదువుకున్న ప్రజాప్రతినిధులు రావాలని, వర్షం పడితే నదులుగా మారే రోడ్ల వ్యవస్థ మారాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. సీజేపీ బొద్దింకలాగా ఎలాంటి కష్టాలనైనా తట్టుకునే సామాన్యుడిని ప్రతిబింబిస్తే, ఎన్పీఎఫ్ మాత్రం ‘అసలైన పరాన్నజీవులు ఎవరు?’ అంటూ పాలకుల వైపు ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది. (National Parasitic Front Story)సరికొత్త మీమ్ పాలిటిక్స్ యుగంభారతదేశంలో కార్టూన్లు, మిమిక్రీ ద్వారా రాజకీయ వ్యంగ్యం ఎప్పటి నుంచో ఉంది. కానీ 2026 నాటి ఈ డిజిటల్ యుగంలో, యువత కేవలం జోకులను చూసి నవ్వుకోకుండా, తామే స్వయంగా భాగస్వామ్యులయ్యే ‘పార్టిసిపేటరీ సాటైర్’ విధానాన్ని ఎంచుకున్నారు. పూర్వం యువత ప్లకార్డులతో రోడ్లపైకి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఒక వెబ్సైట్ తెరిచి, లోగో క్రియేట్ చేసి, ఒక నకిలీ రాజ్యాంగాన్ని రాసి మధ్యాహ్నానికల్లా వేలల్లో ఫాలోవర్లను సంపాదిస్తున్నారు. ఈ రెండు గ్రూపులు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన అధికారిక పార్టీలు కాకపోయినప్పటికీ, దేశంలోని నిరుద్యోగ యువత ఆవేదనను, వ్యవస్థపై వారికున్న అసంతృప్తిని డిజిటల్ వేదికగా ప్రపంచానికి చాటిచెబుతున్నాయి.ఇది కూడా చదవండి: మీ అర్హతలకు ప్రభుత్వ పథకాలు.. కొత్త వెబ్సైట్ వచ్చేసింది!


