Cocktail 2 Movie
-
బెంగళూరులో రష్మిక.. కృతితో కలిసి హడావుడి (ఫొటోలు)
-
పెళ్లయిపోయింది.. మిగిలింది అదొక్కటే
సాధారణంగా హీరో లేదా హీరోయిన్లకు పెళ్లయిన తర్వాత అదృష్టం కూడా కలిసొస్తుందని అంటూ ఉంటారు. అందుకు తగ్గట్లే పలువురు హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకున్న తర్వాత హిట్స్ కొడుతుంటారు. జీవితంలోనూ సంతోషాన్ని పొందుతూ ఉంటారు. ఇప్పుడు రష్మిక, సమంత కూడా పెళ్లి తర్వాత సక్సెస్ అందుకుంటారా? ఒకేవారం రిలీజ్ అవుతున్న వీళ్ల సినిమాలపై హైప్ ఎలా ఉంది?(ఇదీ చదవండి: విదేశీయుడితో స్టార్ హీరో దత్త కూతురు నిశ్చితార్థం)సమంత గురించి మాట్లాడుకుంటే తెలుగులో ఒకప్పుడు మహేశ్ బాబు, రామ్ చరణ్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. స్టార్డమ్ అనుభవించింది. కానీ హీరో నాగచైతన్యతో విడాకులు, తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడటం లాంటివి జరిగేసరికి నటించడం చాలావరకు తగ్గించేసింది. హీరోయిన్గా అయితే చివరగా విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి'లో కనిపించింది. ఇది ఫ్లాప్ అయింది. దీని తర్వాత ఓ సిరీస్ చేసింది గానీ ఇదీ వర్కౌట్ కాలేదు.ఇక గతేడాది 'శుభం' మూవీతో నిర్మాతగా మారింది. కంటెంట్ పరంగా ఓకే అనిపించుకున్నప్పటికీ బడ్జెట్ పరంగా సేఫ్ అయిపోయింది. గతేడాది చివరలో డైరెక్టర్ రాజ్ నిడిమోరుని రెండో పెళ్లి చేసుకుంది. ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు లీడ్ రోల్ చేసి నిర్మాతగా 'మా ఇంటి బంగారం' అనే సినిమాని పూర్తి చేసింది. పలుమార్లు వాయిదా పడి ఈ వారమే ఇది థియేటర్లలోకి రానుంది. మార్కెట్లో అయితే దీనిపై పెద్దగా హైప్ అయితే లేదు. సమంత కోసమే ఈ మూవీకి ఆడియెన్స్ రావాలి. అలానే కంటెంట్ కూడా అదిరిపోయిందనే టాక్ రావాల్సి ఉంటుంది. 'పెద్ది' కూడా నెమ్మదించింది కాబట్టి పాజిటివ్ టాక్.. సమంత 'బంగారం'కి చాలా కీలకం. మరి పెళ్లి సామ్‌కి హిట్ రూపంలో అదృష్టాన్ని తీసుకొస్తుందేమో చూడాలి?రష్మిక విషయానికొస్తే కెరీర్ పరంగా పీక్ స్టేజీలో ఉంది. ఇలాంటి టైంలో పెళ్లి గురించి సాధారణంగా హీరోయిన్లు ఆలోచించారు. కానీ ఈమె ఆలోచించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసింది. ఇది జరగడానికి ముందే హిందీలో 'కాక్టెయిల్ 2' అనే మూవీ చేసింది. ఓ కుర్రాడు ఇద్దరమ్మాయిలని ప్రేమించడం, వీళ్ల ముగ్గురు కలిసే ఉండటం అనే బోల్డ్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమాకి ప్రస్తుతానికి హిందీలో మాత్రమే బజ్ ఉంది. తెలుగులో రిలీజ్ చేయట్లేదు. ఇప్పటివరకు యాక్టింగ్ ఓరియెంటెడ్ పాత్రలతో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న రష్మిక.. ఇందులో పూర్తిగా గ్లామర్ షో చేసింది. పెళ్లి తర్వాత ఈమె నుంచి వస్తున్న తొలి చిత్రమిదే. మరి సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పెద్ది' ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్) -
'కాక్టెయిల్ 2' మూవీ ప్రమోషన్ లో రష్మిక మందన్నా సందడి (ఫొటోలు)
-
రష్మిక రెమ్యునరేషన్ రూ. 15 కోట్లు!
సినిమా ఒక్కసారి ముద్దుగా అక్కున చేర్చుకుంది అంటే ఊహించనంత తీరాలకు తీసుకెళ్లి కూర్చో పెడుతుంది. అలాంటి వారిలో రష్మికమందన్నా ఒకరు. ఎక్కడో కర్ణాటకలోని గ్రామంలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మొదట్లో మాతృభాషలో కథానాయకిగా పరిచయమయ్యారు. ఆ తరువాత టాలీవుడ్లోకి దిగుమతి అయి గీత గోవిందం చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.ఆ తరువాత పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అయ్యారు. ఇక గుడ్‌బై చిత్రంతో బాలీవుడ్లో పాగా వేసిన రష్మిక యానిమల్ చిత్రంతో కమర్షియల్‌గా సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఆ తరువాత ఒకటి రెండు చిత్రాలు ఫ్లాప్ అయినా కేరీర్‌కు వచ్చే డోకా ఏమీ ఉండదు. రష్మిక విషయంలో ఇదే జరుగుతోంది. సల్మాన్‌ఖాన్‌కు జంటగా నటించిన చిత్రం నిరాశ పరిచింది. ఇటీవల నటుడు విజయ్ దేవరకొండను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.ఇక్కడ పెళ్లి అయిన హీరోయిన్లకు కెరీర్ దెబ్బ తింటుందన్న ఆనవాయితీని ఈ బ్యూటీ తిరగరాశారు. ఇప్పుడు ఈ క్రేజీ భామ రేంజ్‌కు వరుసగా భారీ అవకాశాలు రావడమే కాదు పారితోషికాన్ని భారీ మొత్తంలో ముట్టచెబుతున్నారు. అది ఎంతగా అంటే ఇప్పటి వరకు దక్షిణాది టాప్ హీరోయిన్లు తీసుకుంటున్న పారితోషికాన్ని బీట్ చేసేంతగా. ఇప్పటి వరకు దక్షిణాది హీరోయిన్లలో అత్యధికంగా నయనతార రూ.10 కోట్ల తీసుకుంటున్న ప్రచారం జరుగుతోంది. రష్మిక ఇప్పుడు కాక్–టెయిల్–2 చిత్రంలో రూ.15 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదే నిజమైతే పారితోషికం విషయంలో ఈ అమ్మడు నయనతారను బీట్ చేసినట్లే అవుతుంది. -
'కాక్టెయిల్ 2' మూవీ ట్రైలర్ లాంచ్...రష్మిక సందడి (ఫొటోలు)
-
ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్.. కాక్టెయిల్-2 ట్రైలర్ చూశారా?
రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోన్న లేటేస్ట్ బాలీవుడ్ మూవీ కాక్టెయిల్-2. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ కృతి సనన్ మరో హీరోయిన్గా మెప్పించనుంది. ఈ సినిమాకు హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా కాక్టెయిల్-2 ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని ఇద్దరమ్మాయిలతో ఓ అబ్బాయి రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సీన్స్ ఫుల్ రొమాంటిక్‌గా కనిపిస్తున్నాయి. ఇద్దరితో షాహిద్ కపూర్ కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయినట్లు కనిపిస్తోంది. కాగా.. ఈ మూవీ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. దీపికా పడుకోన్, డయానా పెంటీ, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలలో నటించిన 'కాక్టెయిల్' (2012) చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. -
పెళ్లి తర్వాత జాక్‌పాట్ కొట్టిన రష్మిక!
కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు సాధారణంగా హీరోయిన్లు పెళ్లి చేసుకోరు. కానీ రష్మిక ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండని వివాహం చేసుకుంది. అయితే బ్రేక్ తీసుకోవడం లాంటివేం లేకుండా ఫుల్ బిజీగా మారిపోయింది. తెలుగులో రణబాలి, మైసా లాంటి మూవీస్ చేస్తూ హిందీలో 'కాక్టెయిల్ 2' లాంటి క్రేజీ ప్రాజెక్టులు చేసింది. అయితే రష్మిక ఉందంటే కచ్చితంగా సదరు మూవీకి క్రేజ్ రావడం గ్యారంటీ. అందుకు తగ్గట్లే ఇప్పుడు ఈ బ్యూటీ రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.(ఇదీ చదవండి: ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి సినిమా ఛాన్స్)తెలుగులో ఒక్కో సినిమాకూ రూ.8-10 కోట్ల మధ్య తీసుకునే రష్మిక.. బాలీవుడ్లో మాత్రం దీనికి రెట్టింపు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19న రిలీజయ్యే 'కాక్టెయిల్ 2' కోసం ఏకంగా రూ.15 కోట్లు అందుకుందట. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఈ మూవీలో నటించిన మరో హీరోయిన్ కృతి సనన్‌కి కూడా అంతే మొత్తం ఇచ్చారు. కాకపోతే కృతితో పోలిస్తే రష్మిక జూనియర్. అయినా సరే ఇద్దరకీ ఒకే మొత్తం రెమ్యునరేషన్ అంటే రష్మిక రేంజ్ పెరిగిపోయినట్లే!కన్నడ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన రష్మిక.. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు ఇక్కడే వరస మూవీస్ చేసింది. హిందీలో అమితాబ్, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి స్టార్స్‌తోనూ నటించింది గానీ 'పుష్ప' ఫ్రాంచైజీ ఈమెకు ఉత్తరాదిలోనూ మంచి క్రేజ్ తీసుకొచ్చింది. గతేడాది వచ్చిన 'ఛావా' సక్సెస్ కూడా ఈమె కలిసొచ్చింది. ఈ క్రమంలోనే హిందీలో ఈమెకు రూ.15 పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. చాలామంది మిడ్ రేంజ్ హీరోల తీసుకునే మొత్తంతో పోలిస్తే ఈ మొత్తం చాలా ఎక్కువనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
సరదా సరదాగా...
సరదాగా ఆటపట్టించడం అంటాం కదా... షాహిద్ కపూర్–రష్మికా మందన్నా మధ్య అలాంటి సంఘటనే జరిగింది. షాహిద్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా, కృతి సనన్ హీరోయిన్లుగా నటించిన హిందీ చిత్రం ‘కాక్టెయిల్ 2’. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది ఈ టీమ్. ఆ మధ్య ఒక కార్యక్రమంలో ఫొటోలకు పోజులిస్తున్న సమయంలో షాహిద్ కపూర్ అనుకోకుండా రష్మిక భుజంపై చేయి వేశారు.అయితే రష్మిక కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినట్లు వెనక్కి జరిగి, అతని చేతిని తప్పించారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. తాజాగా ముంబైలో జరిగిన ఒక ప్రమోషనల్ ఈవెంట్లో షాహిద్, రష్మిక, కృతి పాల్గొన్నారు. ముగ్గురూ కలిసి ఫొటోలకు పోజులిస్తున్నప్పుడు రష్మికను సరదాగా ఆట పట్టిస్తూ షాహిద్ కావాలని కాస్త దూరంగా జరిగారు. గత ఈవెంట్లో రష్మిక ఎలా అయితే చేశారో షాహిద్ అచ్చంగా అలానే అనుకరించడం చాలా ఫన్నీగా కనిపించింది. అయితే షాహిద్ దూరం జరగ్గానే అతనితో పాటు రష్మిక, కృతి సరదాగా నవ్వేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. -
ఈ సినిమా ప్రేక్షకుల ఊహకు అందదు : రష్మిక మందన్నా
షాహిద్ కపూర్, రష్మికా మందన్నా, కృతీసనన్ ప్రధాన తారాగణంగా నటించిన హిందీ చిత్రం ‘కాక్ టెయిల్ 2’. హోమి అదజానియా దర్శకత్వంలో దినేష్ విజన్, లవ్ రంజన్ , అంకుర్ గార్గ్ నిర్మించారు. ఇందులో కునాల్ పాత్రలో షాహిద్ కపూర్, దియాగా రష్మికా మందన్నా, అల్లీగా కృతీసనన్ నటించారు. ఈ చిత్రం జూన్ 19న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ముంబైలో ఈ సినిమా మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్లో రష్మికా మందన్నా మాట్లాడుతూ–‘‘డిఫరెంట్ లవ్‌స్టోరీ సినిమా ఇది. ఈ సినిమా కథ ప్రేక్షకుల ఊహకు అందదు. షాహిద్‌తో ఆన్ స్క్రీన్ పై మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఈ సినిమాలో కృతీసనన్ మరింత అందంగా కనిపిస్తారు’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాలో నేను కునాల్ రోల్ చేశాను. కథలో ఇద్దరు హీరోయిన్ల మధ్యలో కునాల్ ఎవరివైపు వెళ్లాలో తెలియక సతమతం అవుతుంటాడు. రష్మిక, కృతీసనన్ సూపర్‌స్టార్స్. ఎంతో ప్రొఫెషనల్‌గా ఉంటారు’’ అని చెప్పారు. ఇక హోమి అదజానియా దర్శకత్వంలో సైఫ్ అలీఖాన్ , దీపికా పదుకొనె, డయానా పెంటీ లీడ్ రోల్స్ చేసిన హిందీ హిట్ ఫిల్మ్ ‘కాక్టెయిల్’. ఈ ‘కాక్టెయిల్’ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న రెండో సినిమా ‘కాక్ టెయిల్ 2’ అని తెలుస్తోంది.


