collectors meet
-
28న కలెక్టర్ల సదస్సు..! పూర్తి చేయాల్సిన లక్ష్యాలపై కేసీఆర్ దృష్టి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట్రమంత్రులు, అన్నిశాఖల కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సోమవారం సమావేశానికి సంబంధించి శనివారం ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) కలెక్టర్లకు మౌఖికంగా సమాచారమిచ్చినట్లు తెలిసింది. కేసీఆర్ సీఎంగా రెండో పర్యాయం ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్ 13తో నాలుగేళ్లు పూర్తి కానున్నాయి. వచ్చే ఏడాది గరిష్టంగా నవంబర్ లేదా అంతకుముందే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయడానికి కొద్ది సమయమే మిగిలింది. మిగిలిన ఈ కాలంలో దృష్టి సారించాల్సిన ప్రాధాన్యత అంశాలు, పూర్తి చేయాల్సిన లక్ష్యాలపై సదస్సులో జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. పలు కీలక నిర్ణయాలతో పాటు ఆదేశాలు సైతం జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. తక్కువ సమయమే.. రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో కేసీఆర్ రోజువారీ సమీక్షలు, సమావేశాలతో పాలన యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. 2020లో కోవిడ్–19 మహమ్మారి ప్రారంభమైన తరువాత పాలనావ్యవహారాలు కాస్త మందగించాయి. కోవిడ్–19 పూర్తిగా తగ్గుముఖం పట్టినా పాలన యంత్రాంగం మళ్లీ పూర్వపు క్రియాశీలస్థితికి రాకపోవడానికి వరుసగా రాష్ట్రంలో హుజూర్నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్, హుజూరాబాద్, మునుగోడు స్థానాలకు ఉపఎన్నికలు రావడమూ ఓ కారణంగా చెబుతున్నారు. ఎన్నికలకు దీంతో తక్కువ సమయమే ఉండటం ప్రభుత్వానికి కీలకంగా మారింది. రాష్ట్రంలో అసంపూర్తిగా మిగిలిపోయిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేయడంతోపాటు ఇంకా మిగిలిన హామీలను నెరవేర్చి లబ్ధిదారులకు చేరువ కావడానికి కలెక్టర్ల సదస్సును ఉపయోగించుకోనున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందే డబుల్‌బెడ్ రూం ఇళ్లు పంపిణీ రాష్ట్రంలో చేపట్టిన 2.91 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి అసెంబ్లీ ఎన్నికలకు ముందే లబ్ధిదారులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నిర్మాణం పూర్తైన 62 వేల ఇళ్లను వచ్చే జనవరి 15లోగా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఆలోగా లబి్ధదారులను ఎంపిక చేయడంతోపాటు మిగిలిన ఇళ్ల నిర్మాణం పూర్తికి ముఖ్యమంత్రి గడువు నిర్దేశించే అవకాశం ఉంది. ధరణి పోర్టల్‌పై వచ్చిన ఫిర్యాదులు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. గతంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సైతం ధరణి సమస్యలపై విస్తృతంగా చర్చించి నిర్దేశిత గడువులతో సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినా అకాల వర్షాల కారణంగా అది వాయిదా పడింది. పోడు భూముల సమస్య, గొత్తికోయల దాడిలో ఎఫ్ఆర్వో మరణించడం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం. ధరణి సమస్యలు, పోడు వ్యవహారంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించి కీలక ఆదేశాలను జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు, మరో విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ, వర్షాకాలం ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు వంటి అంశాలపై కలెక్టర్ల సదస్సులో చర్చించే అవకాశం ఉంది. కొత్త పథకాలపై ఆదేశాలు ? గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇంకా నెరవేర్చని వాటిపై కేసీఆర్ ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా సొంత జాగాలో ఇళ్లను కట్టుకునేవారికి రూ.3 లక్షలను ప్రోత్సాహకంగా అందించడం, ఉద్యోగాల భర్తీ మరింత వేగవంతం చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు. ఇదీ చదవండి: ఆ ‘35’పై టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ -
CM KCR: ‘ప్రగతి’ చూపకుంటే మారాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్య క్రమాల అమలు ఆశిం చిన రీతిలో లేకపోవ డంపై సీఎం కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారు. దీంతో జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)కు చివరి హెచ్చ రిక జారీ చేయనున్నారు. ఇందుకోసం ఈ నెల 28న ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన సమా వేశం.. రెండు రోజులు ముందుకు జరిగి ఈ నెల 26వ తేదీకి మారింది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), జిల్లా పంచాయతీ అధి కారి (డీపీఓ), జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారుల (డీఆర్డీఓ)ను తమ వెంట తీసుకురావాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులందరూ తప్పకుండా హాజరుకావాలని చెప్పింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్యక్రమాల అమలుపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు సీఎం మరోసారి దిశానిర్దేశం చేయనున్నారు. పది రోజుల సమయం ఇటీవల సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్, యాదాద్రి–భువనగిరి జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా క్షేత్రస్థాయిలో పల్లె ప్రగతి, హరిత హారం కార్యక్రమాల అమలును ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పరిశీలించారు. ఆశించిన రీతిలో పురోగతి లేదని ఆయన గుర్తించినట్టు సమాచారం. ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి పల్లె/పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల అమలుపై తన ఆశయాలు, లక్ష్యాలను సవివరంగా చెప్పారు. అయినా క్షేత్రస్థాయిల్లో పరిస్థితులు మారట్లేదని తాజాగా నిర్వహించిన పర్యటనల్లో సీఎం ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వెంటనే మరోసారి జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మూడు కార్యక్రమాల అమలు విషయంలో తన ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలను చివరిసారిగా వారికి స్పష్టం చేయాలని కేసీఆర్ ఈ సమావేశానికి తలపెట్టినట్టు సమాచారం. ఈ కార్యక్రమాల అమలుతో పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించే ప్రసక్తే లేదని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీఓలు, డీఆర్డీఓలకు ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేయనున్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు మరోసారి వారం పది రోజుల సమయం ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే నెల్లో ఆకస్మిక తనిఖీలు వచ్చే నెల నుంచి ముఖ్యమంత్రి రెండో విడతగా జిల్లాల్లో పర్యటించి ఈ కార్యక్రమాల అమలుపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కలెక్టర్లతో నిర్వహించనున్న సమావేశంలో వానా కాలం సాగు, రైతుబంధు పంపిణీ, ధరణి సమస్యల పరిష్కారం, పాఠశాలల పునఃప్రారంభం తదితర అంశాలపై సైతం ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసే అవకాశముంది. -
జిల్లాల పునర్విభజనపై కలెక్టర్ల సమావేశం
హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల పునర్విభజనపై సీఎం కేసీఆర్ కసరత్తు ముమ్మరం చేశారు. రేపటి నుంచి రెండ్రోజుల పాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన సమావేశంకానున్నారు. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగే ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు, ముసాయిదా ప్రతిపాదనలపై కలెక్టర్లతో సీఎం కేసీఆర్ ప్రధానంగా చర్చిస్తారు.