'హుద్ హుద్' కాలనీలో ఉద్రిక్తత.. పోలీసుల మోహరింపు
కుందూవానిపేట : శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలం కూందూవానిపేటలో మంగళవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. హుద్ హుద్ తుఫాను కాలనీ నిర్మాణాన్ని చేపట్టవద్దంటూ మత్స్యకారులు అడ్డుకున్నారు. తుఫాను వల్ల నష్టపోయిన వారికి అధికార ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వనిదే నిర్మాణాన్ని చేపట్టొద్దని అధికారులను డిమాండ్ చేశారు.
కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో భారీగా పోలీసులను మొహరించారు. టీడీపీ సర్కార్ తమకు నష్టపరిహారం చెల్లించడంలేదంటూ బాధిత మత్స్యకారులు ఆరోపించారు. 2014లో హుద్ హుద్ తుఫాన్ సంభవించి ఉత్తరాంధ్రలో భారీగా నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.