కరాటేలో సత్తా చాటిన జిల్లా కుర్రాళ్లు
ఏలూరు రూరల్ : కరాటే పోటీల్లో జిల్లా కుర్రాళ్లు సత్తా చాటారు. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కరాటే చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న ఏలూరుకు చెందిన పి.సాయికుమార్ జూనియర్ కలర్ బెల్ట్ అంశంలో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించాడు. ఇదే విభాగంలో పాల్గొన్న వై.రమేష్‌బాబు, కె.జ్ఞాన నాగసాయి బ్రాంజ్‌మెడల్ సొంతం చేసుకున్నారు. జూనియర్ కలర్ బెల్ట్ కుమితేలో ఎస్.సురేష్ సిల్వర్, బి.నాగబాబు బ్రాంజ్‌మెడల్ సాధిం చినట్టు శిక్షకుడు వి.దిలీప్‌కుమార్ తెలిపారు.