Comilla Victorians
-
విధ్వంసం.. ఊచకోత.. అంతకుమించి, బీపీఎల్‌లో విండీస్ వీరుడి సునామీ శతకం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకర బ్యాటింగ్ విధ్వంసం నిన్న (జనవరి 31) ఖుల్నా టైగర్స్-కొమిల్లా విక్టోరియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన నలుగురు బ్యాటర్లు రికార్డ స్థాయిలో 26 సిక్సర్లు బాదారు. ఇందులో కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు జాన్సన్ చార్లెస్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ విండీస్ వీరుడు 56 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 107 పరుగులు చేసి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. చార్లెస్ సునామీ శతకం.. విధ్వంసం, ఊచకోత అన్న పదాలను దాటిపోయి, ఇంకే పదం వాడాలో తెలియనంత రేంజ్లో సాగింది. చార్లెస్‌కు పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ (39 బంతుల్లో 73; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) బీభత్సమైన హాఫ్ సెంచరీ తోడవ్వడంతో ప్రత్యర్ధి నిర్ధేశించిన 211 పరుగుల భారీ టార్గెట్‌ను కొమిల్లా విక్టోరియన్స్ మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించి రికార్డు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్.. తమీమ్ ఇక్బాల్ (61 బంతుల్లో 95; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (55 బంతుల్లో 91 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ బ్యాటర్ హోప్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి తమీమ్ కూడా తోడవ్వడంతో చిన్న సైజ్ విధ్వంసమే జరిగింది. వీరిద్దరు ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. నసీం షా, మొసద్దెక్ హొసేన్ తలో వికెట్ తీసి పర్వాలేదనిపించారు. మహ్ముదుల్ హసన్ జాయ్ (1) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా.. ఆఖర్లో ఆజమ్ ఖాన్ (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా మెరుపులు మెరిపించాడు. అనంతరం కష్టసాధ్యమైన 211 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కొమిల్లా విక్టోరియన్స్.. ఆది నుంచే ఎదురుదాడికి దిగింది. ఓపెనర్ లిటన్ దాస్ (4) రిటైర్డ్ హర్ట్‌గా, కెప్టెన్ ఇమ్రుల్ ఖయేస్ (5) త్వరగా ఔటైనప్పటికీ.. మహ్మద్ రిజ్వాన్, జాన్సన్ చార్లెస్ బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్ల దుమ్ముదులిపారు. వీరిద్దరి ధాటికి కొమిల్లా విక్టోరియన్స్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ సెంచరీతో కొమిల్లాను గెలిపించిన చార్లెస్‌ను మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు భుజాలపై మోస్తూ స్టేడియం మొత్తం ఊరేగించారు. కాగా, ఈ విజయంతో కొమిల్లా విక్టోరియన్స్.. సిల్హెట్ స్ట్రయికర్స్, ఫార్చూన్ బారిషల్ జట్లతో సహా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. -
బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో మెరుపులు.. విధ్వంసం సృష్టించిన హోప్, తమీమ్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లో సంచలన ప్రదర్శనలు నమోదవుతున్నాయి. ఈ లీగ్‌లో భారత్ మినహాయించి ప్రపంచ దేశాల క్రికెటర్లు పాల్గొంటూ, సత్తా చాటుతున్నారు. ప్రస్తుత సీజన్లో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్ధలయ్యాయి. ఇవాళ (జనవరి 31) కొమిల్లా విక్టోరియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖుల్నా టైగర్స్ ఆటగాళ్లు తమీమ్ ఇక్బాల్ (61 బంతుల్లో 95; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (55 బంతుల్లో 91 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో విండీస్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ హోప్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి తమీమ్ కూడా తోడవ్వడంతో చిన్న సైజ్ విధ్వంసమే జరిగింది. వీరిద్దరు ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. నసీం షా, మొసద్దెక్ హొసేన్ తలో వికెట్ తీసి పర్వాలేదనిపించారు. మహ్ముదుల్ హసన్ జాయ్ (1) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా.. ఆఖర్లో ఆజమ్ ఖాన్ (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా మెరుపులు మెరిపించాడు. అనంతరం భారీ లక్ష్యా ఛేదనకు దిగిన కొమిల్లా విక్టోరియన్స్ సైతం ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్ లిటన్ దాస్ (4) రిటైర్డ్ హర్ట్‌గా, కెప్టెన్ ఇమ్రుల్ ఖయేస్ (5) ఔటైనప్పటికీ.. మహ్మద్ రిజ్వాన్ (32 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), జాన్సన్ చార్లెస్ (29 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దుమ్ముదులుపుతున్నారు. వీరిద్దరి ధాటికి కొమిల్లా విక్టోరియన్స్ స్కోర్ 11 ఓవర్లకే 107కి చేరింది. ఈ జట్టు గెలవాంటే 54 బంతుల్లో మరో 104 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. -
11 సిక్సర్లు, 10 ఫోర్లతో చెలరేగిపోయాడు!
ఢాకా: బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ విశ్వరూపం ప్రదర్శించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో కొమిల్లా విక్టోరియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన తమీమ్ ఇక్బాల్.. తన జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. శుక్రవారం ఢాకా డైనమేట్స్తో జరిగిన తుది పోరులో ఇక్బాల్ చెలరేగిపోయాడు. 61 బంతుల్లో 11 సిక్సర్లు, 10 ఫోర్లు సాయంతో అజేయంగా 141 పరుగులు సాధించాడు. దాంతో కొమిల్లా విక్టోరియన్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచిన ఢాకా డైనమేట్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కొమిల్లా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఎవిన్ లూయిస్(6) తొలి వికెట్‌గా నిష్క్రమించాడు. ఆ తర్వాత అనముల్ హక్‌తో కలిసి ఇక్బాల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ జోడి రెండో వికెట్ 89 పరుగులు జోడించిన తర్వాత అనముల్(24) ఔటయ్యాడు. ఆపై వెంటనే షమ్సూర్ రెహ్మాన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. అయితే అప్పటికే ఫుల్ జోష్‌లో ఉన్న ఇక్బాల్ తన దూకుడుగా మరింత పెంచాడు. క్రీజ్‌లో పాతుకుపోయి ఆకాశమేహద్దుగా విజృంభించాడు. ఈ క్రమంలోనే 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఆటను కడవరకూ కొనసాగించడంతో కొమిల్లా 200 లక్ష్యాన్ని ఢాకా డైనమేట్స్ ముందుంచింది. లక్ష్య ఛేదనలో ఢాకా పరుగుల ఖాతా తెరవకుండానే సునీల్ నరైన్ వికెట్‌ను కోల్పోయింది. ఆ దశలో ఉపుల్ తరంగా(48; 27 బంతుల్లో 4 ఫోర్లు,, 3సిక్సర్లు)-రోనీ తలుక్దర్(66; 6 ఫోర్లు, 4 సిక్సర్లు)లు 102 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేయడంతో ఢాకా విజయం దిశగా పరుగులు తీసింది.కాగా, ఉపుల్ తరంగా రెండో వికెట్‌గా ఔటైన తర్వాత ఢాకా స్కోరులో వేగం తగ్గింది. రోనికి మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం లభించకపోవడంతో ఢాకా నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఫలితంగా కొమిల్లా 17 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. కొమిల్లా బౌలర్లలోవహాబ్ రియాజ్ మూడు వికెట్లు సాధించగా, మహ్మద్ సైఫుద్దీన్, తిషారా పెరీరాలు తలో రెండు వికెట్లు తీశారు. ఇది కొమిల్లా విక్టోరియన్స్‌కు రెండో టైటిల్.