'చినరాజప్ప వ్యాఖ్యలు సరికావు'
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమకాయల చినరాజప్పపై వైఎస్ఆర్ సీఎల్పీ ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్దిని అడ్డుకుంటున్నారంటూ చినరాజప్ప వ్యాఖ్యానించడం సరికాదని జ్యోతుల నెహ్రూ విమర్శించారు.
ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మాత్రమే వైఎస్ జగన్ అడ్డుకుంటున్నారని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఓటుకు కోట్లు వంటి టీడీపీ నీచ సంస్కృతిని వైఎస్ జగన్ వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.