commercial center
-
భారత్ పెద్ద వాణిజ్య కేంద్రం
డెన్మార్క్ రాయబారి పీటర్ టక్సో జెన్సన్ సాక్షి, హైదరాబాద్: వాణిజ్య రంగానికి భారతదేశం అనువైన ప్రదేశమని, ఇక్కడి ఆర్థిక వ్యవస్థ ఎంతో బాగుందని డెన్మార్క్ రాయబారి పీటర్ టక్సో జెన్సన్ పేర్కొన్నారు. డెన్మార్క్‌కు చెందిన మెరైన్, ఆఫ్‌షోర్, ఇండస్ట్రీస్, ఆయిల్ స్పిల్ ఉపకరణాలు, రక్షణ, ఇంధన యుటిలిటీ విభాగంలో పంప్ సొల్యూషన్స్ అభివృద్ధిలో ప్రత్యేకత కలిగిన డెస్మీ భారత్‌లో తన మొదటి తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. బుధవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంట్నం మండలం ఆదిబట్ల ఐటీ సెజ్‌లో 4 ఏకరాల విస్తీర్ణంలో డెన్మార్క్ రాయబారి పీటర్ టక్సో జెన్సన్, తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్లు ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పీటర్ టక్సో జెన్సన్ మాట్లాడుతూ దేశంలో సంస్థ ఉనికి పటిష్టం చోసుకోవాలనే లక్ష్యంతో రూ.15 కోట్ల పెట్టుబడులతో ప్లాంటు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. దేశంలోనే హైదరాబాద్ వాణిజ్య రంగానికి పేరుగాంచిందని తెలిపారు. కార్యక్రమంలో డెస్మీ గ్రూప్ సీఈఓ హెర్నిక్ సొరెన్‌సేన్, డెస్మీ ఇండియా ఎల్ఎల్పీ చైర్మన్ జాన్ తారఫ్, డెస్మీ ఇండియా ఎల్ఎల్పీ ఎండీ ఏవీఎస్ మూర్తి పాల్గొన్నారు. -
కాకినాడ సెజ్‌లో తొలి వాణిజ్య కేంద్రం షురూ
టాటా-జీఎంఆర్ భాగస్వామ్యంలో రూరల్ బీపీఓ సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ సెజ్‌లో తొలి కమర్షియల్ సెంటర్ ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా యు. కొత్తపల్లి మండలం కొత్తమూలపేటలో జీఎంఆర్, దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా బిజినెస్ సపోర్ట్ సర్వీస్ లిమిటెడ్ సంయుక్త భాగస్వామ్యంలో ఈ సెంటర్ ఏర్పాటైంది. ఈ ఐటీ ఆధారిత సెంటర్లో ఆధార్‌కార్డుల తయారీ పనులు జరగనున్నాయి. జీఎంఆర్ ప్రెసిడెంట్ ప్రసన్న చల్లా, టాటా బిజినెస్ సపోర్ట్ సర్వీస్ మేనేజింగ్ డెరైక్టర్ శ్రీనివాస్ కొప్పోలు సెంటర్‌ను బుధవారం ప్రారంభించారు. రూరల్ బీపీఓ (బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్)లో కాకినాడ సెజ్ నిర్వాసిత కుటుంబాలకు చెందిన శిక్షణ ఇచ్చిన 20 మంది యువకులకు చల్లా, కొప్పోలు ఉద్యోగ నియామక పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ మెట్రో, టైర్-2 నగరాల్లో బలీయంగా ఉన్న బీపీఓ పరిశ్రమను, ప్రతిభావంతమైన మానవ వనరులను గ్రామీణ ప్రాంతాలకు తీసుకురావాలనేదే లక్ష్యమన్నారు. టాటా బిజినెస్ సపోర్ట్ సర్వీస్ సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా గ్రామీణ యువత నగర యువత కంటే ఎంత మాత్రం తక్కువ కాదనే విషయాన్ని నిరూపించిందన్నారు. కాకినాడ సెజ్‌లో మొదటి దశ పనులు ప్రారంభించామని, దీనిలో భాగంగా మెరైన్ ఫుడ్స్ ప్రాసెసింగ్, బొమ్మల పరిశ్రమలు వచ్చే మూడు, ఆరు నెలల్లో రానున్నాయని ప్రసన్న చెప్పారు. ఏడాదిలో ఈ పరిశ్రమల ద్వారా రెండువేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. టీబీఎస్ఎస్ఎల్ ఎండీ శ్రీనివాస్ మాట్లాడుతూ రూరల్ బీపీఓ వచ్చే రెండేళ్లలో పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేస్త్తుందన్నారు. వచ్చే ఫిబ్రవరి నుంచి బీపీఓ కార్యకలాపాలు నిర్వహిస్త్తుందన్నారు. కార్యక్రమంలో జీఎంఆర్ బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ పోతుకూచి, జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ డెరైక్టర్ మీరా రఘునాథన్, కాకినాడ సెజ్ ప్రాజెక్టు హెడ్ బీహెచ్ఏ రామరాజు తదితరులు పాల్గొన్నారు. -
నరకయాతన
అంధకారంలో అనకాపల్లి వాణిజ్య కేంద్రానికి తప్పని చీకట్లు తాగు నీటికి జనం అవస్థలు జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లి ఇప్పటికీ అంధకారంలోనే మగ్గుతోంది. తొమ్మిది రోజులవుతున్నా.. పట్టణంలో చీకట్లు తొలగలేదు.చీకటిపడితే జనం అడుగుతీసి బయటపెట్టలేని దుస్థితి. తాగు నీటికి నోచుకోక నరకయాతన పడుతున్నారు. ముఖ్యంగా రోజువారి అవసరాలకు వాడుక నీరు దొరక్క పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామన్న అధికారుల మాటలు అమలు కాలేదు. పనులు చేపడుతున్నా సాంకేతిక సమస్యలు వెంటాడుతూనే వున్నాయి. అనకాపల్లి : పట్టణంలోని 60 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. 700 పైగా స్తంభాలు విరిగిపోయాయి. దీంతో రూ.3 కోట్ల మేర ఆ శాఖకు నష్టం వాటిల్లింది. విద్యుత్ డిమాండ్‌తో కశింకోట సబ్‌స్టేషన్ నుంచి అనకాపల్లికి ఇంతకాలం విద్యుత్ సరఫరా చేసేవారు. ప్రస్తుతం కశింకోట సబ్‌స్టేషన్ కూడా ధ్వంసమైంది. అక్కడి నుంచి విద్యుత్ వచ్చే అవకాసం లేకుండా పోయింది. రెండురోజుల క్రితమే వాటర్‌హౌస్‌కు విద్యుత్ సరఫరాకు అధికారులు భావించినా శారదానది మీదుగా విద్యుత్ తీగలు పడిపోవడంతో అధికారులు విఫలమయ్యారు. అనకాపల్లికి చారిత్రకంగా, వ్యాపారపరంగా గుర్తింపు ఉంది. ఇక్కడి జాతీయస్థాయి బెల్లం మార్కెట్లో రోజూ పెద్ద ఎత్తున లావాదేవీలు సాగుతాయి. జిల్లాస్థాయిలో కూరగాయల వ్యాపారం, ఇతర వాణిజ్య కలాపాలు కొనసాగుతుంటాయి. లక్షకు పైగా జనాభా ఉన్న ఈ పట్టణంలో దాదాపు జిల్లాస్థాయి ప్రధాన కార్యాలన్నీ ఉన్నాయి. దీనికితోడు వ్యాపార కలాపాల కోసం జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పలువురు వస్తుంటారు. గురువారం నాటికే విద్యుత్ సరఫరా చేస్తామని నేతలతో పాటు అధికారులు చెప్పారు. అయితే రోజులు గడుస్తున్నా విద్యుత్ పునరుద్ధరణలో ఆశాఖ అధికారులు విఫలమయ్యారు. ఈ క్రమంలో ప్రజల్లో ఆగ్రాహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు సీఎం చంద్రబాబునాయుడు, రాష్ర్టంలోని పలువురు మంత్రులు అనకాపల్లి మీదుగా పయనిస్తున్నా విద్యుత్ పునరుద్ధరణ విషయంలో అధికారులు చేతులెత్తేయడం శోచనీయం. వాతావరణం అనుకూలించకే : డీఈ రాజ్‌కుమార్... రెండు రోజులుగా వాతావరణం అనుకూలించకపోవడం వల్లే విద్యుత్ సరఫరా ఆలస్యమైందని డీఈ రవికుమార్ తెలిపారు. పరవాడ 22 కేవీ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా తీసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితులలోను ఆదివారం రాత్రికి లేదా సోమవారం నాటికి విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని చెప్పారు.