సమన్వయంతో పనిచేయాలి
రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి రేషన్‌కార్డుల ఆధార్ సీడింగ్ నూరుశాతం పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ పార్థసారథి సూచించారు. భువనగిరి ఆర్డీఓ కార్యాలయం నుంచి ఆయన జిల్లాలోని తహసీల్దార్లు, పౌర సరఫరాల అధికారులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
భువనగిరి :రెవెన్యూ, పౌర సరఫరాల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ పార్థసారథి సూచించా రు. బుధవారం భువనగిరి రెవెన్యూ డివి జనల్ అధికారి కార్యాలయం నుంచి జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, పౌర సరఫరాల అధికారులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన రేషన్ కార్డుల ఆధార్ సీడింగ్ కార్యక్రమాన్ని నూరు శాతం పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో ఆధార్ సీడింగ్ కార్యక్రమం 85శాతం వరకు పూర్తి చేసినందుకు ఆయన అధికారులను అభినందించారు.
అనర్హులకు చెందిన తెల్లరేషన్ కార్డులు తొలగించడంతో పాటు అర్హులకు మాత్రమే కార్డులు అందించేందుకు క్షేత్ర స్థాయిలో ఆధార్ సీడింగ్ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆలోచనా విధానానికి అనుగుణంగా అధికారులు పనిచేసి అనర్హులకు చెందిన కార్డులు, యూనిట్లను నిబంధనల మేరకు తొలగించాలన్నారు. మరణించిన, వలస వెళ్లిన వారిని, డూప్లికేట్ కార్డులను, యూనిట్లను రద్దు చేయడంలో ఆధార్ నంబర్‌ను ప్రతిపాదిక తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితిల్లో అర్హులైన వారు నష్ట పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చె ప్పారు. జిల్లాలో ఇంకా 3 లక్షల 50 వేల ఆధార్ సీడింగ్ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. తహసీల్దార్ల వద్ద పెండింగ్‌లో కన్ఫర్మేషన్ కోసం ఉన్న 1,13, 000 కార్డులను వెంటనే నిజనిర్ధాణ జరిపి తగ్గు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
అనర్హులకు చెందిన కార్డులు, యూని ట్లను రద్దుచేసిన అనంతరం రేషన్ డీలర్లకు ఆదాయం పెంచే మార్గాలపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ఈ విధానం ద్వారా ఇప్పటికే ఆదా అయిన కిరోసిన్‌ను అర్హులైన వారికి కోటా పెంచే అవకాశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ప్రతి తహసీల్దార్ విధిగా ప్రతి రోజూ ప్రభుత్వం నుంచి అందే ఈ మెయిల్‌ను స్వయంగా పరిశీలించాలని సూచించారు. లేకుంటే తగిన చర్యలు తప్పవన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా, భువనగిరి ఆర్డీఓ నూతి మధుసూదన్, డీఎస్ఓ నాగేశ్వర్రావు, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ సుధాకర్, డీసీఓ ప్రసాద్, మార్కెటింగ్ శాఖ ఏడీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం సేకరణకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి
అధికారులు ఖరీఫ్ ధ్యాన సేకరణకు వెంటనే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని రాష్ర్ట పౌరసరఫరాలశాఖ కమిషనర్ పార్థసారథి అధికారులను ఆదేశించారు. బుధవారం భువనగిరిలోని ఆర్డీఓ కార్యాలయంలో డి విజన్ పరిధిలోని తహసీల్దార్లు, పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో సాగు విస్తీర్ణం, పంటల రకాలు, దిగుబడిని దృష్టిలో ఉంచుకొని మార్కెట్ యార్డులు, ఐకేపీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. అవసరం మేరకు ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.