వివాహం జరగాల్సిన ఇంట్లో విషాదం..
మహబూబాబాద్: వివాహం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం చిట్యాలలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల ప్రకారం.. గ్రామానికి చెందిన ఈదురు యాకయ్య, సోమలక్ష్మి దంపతుల మొదటి కూతురు లావణ్య(25) డిగ్రీ పూర్తి చేసింది.ఇటీవల నిశ్చితార్థం జరిగింది. ఇంతలో ఏమైందో తెలియదుగాని శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడింది. తల్లిదండ్రులు వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది విగతజీవిగా కనిపించింది. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.