కొండాపూర్(మెదక్ జిల్లా): భార్య కాపురానికి రాలేదనే మనస్తాపంతో ఓ భర్త పురుగుల మందు తాగాడు. ఈ సంఘటన కొండాపూర్ మండలం తోగరపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగిన చంద్రయ్య(35)ను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించగా..మార్గమధ్యంలోనే మృతిచెందాడు.