డిగ్రీ కాలేజీల్లో కామన్ కేలండర్
వీసీల భేటీలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో కామన్ అకడమిక్ కేలండర్ను అమలు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఒక్కో వర్సిటీ పరిధిలో ఒక్కోలా విద్యా కార్యక్రమాలు కొనసాగుతుండటం వల్ల సమస్యలు తలెత్తుతున్నా యి. కామన్ కేలండర్ అమలుకు ఉన్నత విద్యామండలి సోమవారం అన్ని వర్సిటీ వీసీలతో చర్చించి, వార్షిక కేలండర్ను రూపొందించిం ది. దాన్ని వెంటనే అమల్లోకి తేవాలని నిర్ణయించింది. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో మొదటి దశ సీట్ల కేటాయింపు, కాలేజీల్లో విద్యార్థుల చేరికలు పూర్తవడంతో సోమవారం నుంచే డిగ్రీ కాలేజీల్లో మొదటి సెమిస్టర్ ప్రారంభించా లని తెలిపింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్ చైర్మన్లు వెంకటాచలం, పలువర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.
ఇదీ అకడమిక్ కేలండర్...
► జూలై 3వ తేదీ నుంచి అన్ని డిగ్రీ కాలేజీల్లో మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం.
► సెప్టెంబర్ 18, 19 తేదీల్లో మొదటి ఇంటర్నల్ పరీక్షలు
► సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు దసరా సెలవులు.
► నవంబర్ 8, 9 తేదీల్లో సెకండ్ ఇంటర్నల్ పరీక్షలు.
► నవంబర్ 10 నుంచి 30 వరకు మొదటి సెమిస్టర్ ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలు.
► డిసెంబరు 2 నుంచి సెకండ్ సెమిస్టర్ తరగతులు ప్రారంభం.
► 2018 ఏప్రిల్ 7, 8 తేదీల్లో ఇంటర్నల్ పరీక్షలు
► ఏప్రిల్ 9 నుంచి 30 వరకు సెకండ్ సెమిస్టర్ ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలు.
► మే 1 నుంచి వేసవి సెలవులు.
► జూన్ 11 నుంచి 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభం.